సబ్ ఫీచర్

పరిహారం.. పరిహాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల ఆత్మహత్యలపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల స్పందిస్తూ- ‘రైతు చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు. ఆ పరిస్థితిని నివారించడానికి మీరు తీసుకొంటున్న సమగ్ర విధానమేమిట’ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం హర్షణీయం. గత నెలలోకూడా ఇదే తీరులో అన్నదాత ఆత్మహత్యల్ని మానవ హక్కుల ఉల్లంఘనగా భావించాలంటూ న్యాయ పాలిక ఆదేశించడం జరిగింది. ఇక ఆ స్ఫూర్తిని పాలకులు అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మూడో త్రైమాసిక జీడీపీ లెక్కల్లో స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన అభివృద్ధికి వ్యవసాయ రంగం ప్రగతి కూడా ముఖ్యకారణమని తెల్పింది. పంటల దిగుబడుల్లో ప్రగతి ఎలాఉన్నా రైతు గతి ఏ మాత్రం మారబోదని గత అనుభవాలు చెప్తున్నాయి. ఆర్థిక వృద్ధి, అన్నదాత కంచం వరకూ చేరే విధానం ప్రస్తుతం దేశంలో లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగంలో ఒక మంచి అభ్యర్థన చేశారు. అదేమిటంటే అమెరికా నుండి ఎగుమతి చేస్తున్న మోటార్ బైకులపై ఆయా దేశాలు దిగుమతి సుంకంలో రాయితీలివ్వకపోవడం శోచనీయమట. ఆయన భారత్‌ని ఉద్దేశించే ఆ మాట అన్నారు. అలా అని మనం దిగుమతి చేసుకొంటున్న అమెరికా మోటార్ బైకుల తయారీ నష్టాల్లో లేదు. ముప్ఫై శాతం లాభాల్లోనే ఉంది. అయినా మనదేశం దిగుమతి సుంకాల్ని తగ్గించడం ద్వారా మరిన్ని లాభాలు తమ దేశపు సంస్థకి చేకూర్చాలన్నదే ఆయన అభిమతం. లాభాల బాటలో ఉన్న తమ పరిశ్రమ గురించి ఆయన అలా తపన పడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయ రంగానికి మన పాలకులెంత చేయూతనివ్వాలి!
ఇక్కడి రైతు పండించిన గోధుమలకి కనీస మద్దతు ధర దొరకని స్థితిలో దిగుమతి చేసుకొనే గోధుమలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివెయ్యడం భావ్యమా? అది కూడా ఈఏడాది గోధుమల దిగుబడి బాగానే ఉండొచ్చన్న అంచనాల మధ్య. ప్రభుత్వ విధానాలు స్వదేశీ రైతుని ఆదుకునేలా సమగ్రంగా, సమర్థవంతంగా లేవు. ఆ కారణంగానే రైతు ఆత్మహత్యలూ, ఆర్థికంగా చితికిపోవడాలూ పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అడ్డుకొనే వ్యూహాలు స్వామినాథన్ కమిటీ, జయతీ ఘోష్ కమిటీ నివేదికల్లో నిక్షిప్తమై అందుబాటులో ఉన్నాయి. సమగ్ర ప్రణాళికతోనే సంక్షోభ నివారణ సాధ్యం. అరకొర ప్రణాళికలూ, నష్టం జరిగాక పరిహారాలతో గట్టెక్కగలమనుకొంటే అంటే అది పరిహాసమే.
అధికారిక లెక్కల ప్రకారం అరగంటకో అన్నదాత ఆత్మహత్య చేసుకొంటున్నాడు. దీనికి ముఖ్యంగా అప్పులే కారణం. జాతీయ బ్యాంకులు అన్నదాతకు అవసరానికి అప్పు ఇవ్వడంలో విఫలం కావడంతో సాధారణ రైతు ప్రయివేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకొని, అధిక వడ్డీల భారంతో దివాలా తీయడమన్నది మామూలు విషయంగా మారిపోయింది. ఏ సంవత్సరం కూడా తాము విధించుకున్న టార్గెట్ మేరకైనా బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్న సూచనల్లేవు. ఇలాంటి పరిస్థితిని గమనించే అత్యున్నత న్యాయస్థానం రైతు ఆత్మహత్య అన్నది మానవ హక్కుల ఉల్లంఘన అంటూ, వాటి నివారణకై ప్రభుత్వాన్ని సమగ్ర ప్రణాళికల్ని రచించమని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణమాఫీకి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ఆ హామీని అమలుపర్చాలి. ఆపదలో ఉన్న రైతుకి ఏ మాత్రం ఊరట కలిగించినా అది దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్టే.

- డా. జివిజి శంకరరావు