సబ్ ఫీచర్

అతికించే అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టి క్కర్లంటే ప్రతివారికీ మోజే. పసివారి దగ్గర్నుంచీ, పెద్దవాళ్ల వరకూ స్టిక్కర్లంటే ఇష్టపడనివారుండరు. వాహనాలమీద, బీరువాలమీద, టేబుల్స్‌మీద, వార్డ్ రోబ్‌లమీద, లాప్‌టాప్‌లమీదా, రిఫ్రిజిటరేటర్‌లమీద, చివరకు ఈ చెయిన్లమీద కూడా స్టిక్కరింగ్ వర్క్‌తో అందరూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రేజుని దృష్టిలో పెట్టుకుని ఇపుడు వాల్ డెకరేషన్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రకృతి ప్రేమికులకు ఈ తరహా స్టిక్కరింగ్ సేద తీరుస్తున్నట్లే. ఎందుకంటే కంటికి కనబడకుండా పోయిన హరితవనాలు, పక్షులూ, జంతువుల స్టిక్కర్లు ఇపుడు మన ఇంటి గోడలపై కొలువై ఇంటికి కంటికీ ఇంపుగా కనిపిస్తున్నాయి. అద్భుతమైన భగవంతుని రూపాలు, తోటలోంచి ఇంట్లోకి చొచ్చుకు వచ్చినట్లుండే తరుశాఖలూ, వాటిమీద పక్షులూ.. ఇలా సరికొత్త వాతావరణం ఇపుడు వరండాలో డ్రాయింగ్ హాల్లో పడకగదిలో స్టిక్కర్ రూపంలో తళుకులీనుతున్నాయి. ఇప్పుడీ సృజనవల్ల మనం కొనుక్కోలేని వస్తువులని గదిలో అమర్చేలా, కొనే వస్తువులని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే వీలుంటుంది. కేవలం సీతాకోక చిలుకల్ని సైజులవారీగా అతికించి మురిసిపోయే కాలం మారింది. ఒక్కోక్కరిది ఒక్కో అభిరుచి, ఒక్కో గదికి ఒక్కో శైలి. ఇంటీరియర్‌లో ఇప్పుడీ స్టిక్కరింగ్ ప్రధాన భాగం అవుతోంది. పిల్లల గదిలో ఒకలా, యువతీయువకుల గదిలో మరోలా, మాస్టర్ బెడ్‌రూం ఇంకోలా కనిపించే స్టిక్కరింగ్ వ్యక్తుల మనోభావాలని ప్రతిఫలించేలా ఉండటం విశేషం.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి