సబ్ ఫీచర్

ఓటమిని ఒప్పుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న నానుడి మన దేశంలోని రాజకీయ పార్టీల నాయకులకు చక్కగా సరిపోతుంది. ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేని నేతలు ఓటమిని అంగీకరించడం హుందాతనానికి నిదర్శనం. అయితే, మన రాజకీయ నాయకుల్లో హుందాతనం రానురానూ నశించిపోతున్నది. ఇందుకు నిదర్శనంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ఫలితాలపై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనలను చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఎన్నికల్లో దారుణ ఓటమి పొందిన మాయావతి తన పార్టీ పరాజయానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే (ఇవిఎంలు) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయడంతో తన పార్టీ ఓడిపోయిందనేది ఆమె ఆక్రోశం. పంజాబ్‌లో తమ పార్టీ ఓటమికి కారణం ఇవిఎంలేనంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న దానికంటే తమ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకు కారణం ఇవిఎంల ట్యాంపరింగ్ అని ఆయన అభియోగం.
నిజానికి ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనా? అన్నది జవాబులేని ప్రశ్న. 2009 ఎన్నికలలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇదే విధమైన ఆరోపణలు చేశారు. ఒక జట్టును ఏర్పాటుచేసి, ఇవిఎంలను ఏ విధంగా ట్యాంపర్ చేయవచ్చో, జిల్లాల వారీగా ఆయన ప్రచారం చేయించారు. దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు మిన్నకుండిపోయారు. 2014 ఎన్నికలు కూడ ఇవిఎంల ద్వారానే జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో ఆయన ఇవిఎంలపై ఆరోపణలు చేయలేదు.
ఇవిఎంలను ట్యాంపర్ చేయాలంటే, దాని లోపల చిన్న చిప్‌ను అమర్చాలి. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇవిఎంలు ఉపయోగిస్తారు. వీటన్నింటిలో చిప్‌లు అమర్చడం అసాధ్యం. ఎవరైనా అటువంటి దుస్సాహసం చేసినట్లయితే అది తప్పక బయటపడుతుంది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ సంస్థ ఇప్పటివరకూ రాజకీయ వత్తిడులకు లొంగిన దాఖలాలు లేవు. అటువంటి సంస్థను నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగమే ఇపుడు ఇవిఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు. మాయావతి పూర్తికాలపు రాజకీయవేత్త. తన కేడర్‌లో ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏవిధంగా పనిచేస్తాయన్నది ఆయనకు ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇవిఎంలపై ఆరోపణలు చేస్తున్నారంటే అది రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం. ఇవిఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం అయితే, అధికారంలో ఉన్న పార్టీలు ఏవి కూడా ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఓడిపోవు. అందువల్ల ఇవిఎంలను ట్యాంపర్ చేయడం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని ఆరోపణలు చేయడం సరికాదు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైన ఎన్నికలు కూడ ఇవిఎంల ద్వారా నిర్వహించినవేనన్న విషయాన్ని కేజ్రీవాల్ మరచిపోవడం దురదృష్టకరం. ఇకనైనా విజ్ఞతతో వ్యవహరించి ప్రజాభిమానం పొందటానికి ప్రయత్నించడం మంచిది.

- పి.మస్తాన్‌రావు