సబ్ ఫీచర్

కిచెన్ గార్డెన్ క్వీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రా కృష్ణస్వామి ఓ సాధారణ గృహిణి. భర్త, పిల్లలు వెళ్లిపోగానే ఆమెకు ఏమీ తోచేదికాదు. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళితే కూరల ధరలు ఆకాశన్నంటేవి. కొయంబత్తూర్ సమీపంలోని పీలామెడులోని చంద్రగాంధీ నగర్‌లో నివాసం ఉండే ఇంటి పైకప్పు పైభాగం అంతా ఖాళీగా ఉంది. కనుక అక్కడ కూరగాయలు, ఆకు కూరలు పండిస్తే ఇంటికి సరిపడా కూరలు లభిస్తాయ కదా అని ఆలోచించింది. అంతే.. ఆ కొద్దిపాటి స్థలంలోనే రకరకాల ప్ర యోగాలు చేస్తూ తన ఇంటిని పచ్చటి బృందావనంగా మార్చేశారు. వేసవి కాలంలోనూ ఆ ఇంట్లో టమాటాలు సమృద్ధిగా పెరుగుతాయి. ఏ కాలమైనా కానివ్వండి తాజా కూరగాయలు, పండ్లు దర్శనిమిస్తాయి. పైసా ఖర్చు లేకుండా కేవలం వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారుచేసుకుంటూ వేసవిలోనూ సొంత కిచెన్ గార్డెన్‌ను పెంచుకోవచ్చనని చెబుతున్నారు చిత్రా కృష్ణస్వామి. ఇన్నాళ్లు పల్లెల్లో పండించిన కూరగాయలను ఉపయోగించుకుంటున్నాం. ఇపుడా పరిస్థితి మారాలి. ప్రతి ఇల్లు వ్యవసాయక్షేత్రం కావలంటున్నారు. పురుగు మందులు లేకుండా వంటింటి వ్యర్థాలతో ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకోవచ్చని అంటున్నారు. తొలుత ఐదు కుండలతోగార్డెన్‌ను పెంచటం ప్రారంభించారు. నేడు ఇంటిని పచ్చటి బృందావనంగా మార్చివేశారు. పైక ప్పు తోటలో ఇపుడు 14 రకాల ఆకు కూరలు, టమాటాలు, మిరపకాయలు, అనాస, సపో టా పండ్లు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, బెండకాయ.. ఇలా ఇం టికి కావల్సిన అన్ని రకాల కూరగాయలు పండుతాయి. గత రెండు నెలల నుంచి కుటుంబానికి అవసరమైన కూరగాయలు మార్కెట్ నుంచి కొనుగోలు చేయలేదంటే ఆశ్చర్యం వేయకతప్పదు.
వంటింటి వ్యర్థాలతో ఎరువు
వంటింటి వ్యర్థాలను చెత్తలో వేయకుండా పెద్దసైజు కుండల్లో వేస్తుంది. ఎర్రమట్టిలో ఈ వ్యర్థాలను కలుపుతుంది. తరువాత ఎండిపోయిన ఆకులను అందులో వేస్తుంది. ఇది బలమైన కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. వేసవిలో నీటి కొరత ఉంటుంది కాబట్టి ఇంట్లో వంటచేసేటపుడు బియ్యం, పప్పు, కూరగాయలు కడగటానికి ఉపయోగించే నీటిని ఓ బకెట్‌లో నిల్వచేస్తుంది. ఆ నీటిని మొక్కలకు పోస్తుంది. ఈ నీటిలో మొక్కలకు కావల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చిత్రా కృష్ణస్వామి అంటారు.
పిల్లలకు పకృతి సేద్యం పాఠాలు
ఆరు నెలల కాలంలోనే ఇంటి పైకప్పును హరితవనంగా సృష్టించిన చిత్రా కృష్ణస్వామి అభిరుచి గుర్తించిన చుట్టుపక్కల పాఠశాలల నిర్వాహకులు ఆమెను తమ పాఠశాలలకు పిలిపించుకుని పిల్లలకు మొక్కల పెంపకంలో మెళకువలను నేర్పిస్తున్నారు. ‘సేవ్ అవర్ మదర్ ఎర్త్’ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తూ ప్లాస్టిక్ ట్యూబ్స్‌లో సైతం టమాటా, పచ్చిమిర్చి మొక్కలను ఎలా పెంచుకోవచ్చునో వివరిస్తున్నారు. రసాయనాలు ఉపయోగించకుండా నేల మీద కాకుండా లాండ్‌స్కేప్, కంటైనర్, మైక్రో, కిచెన్, ఇండోర్ వంటి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిని పచ్చటి మొక్కలతో నింపేసిన ఆమె సాగువిధానానికి అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ వారు ‘ఈకో అవార్డును ఇచ్చి సత్కరించారు. కొయంబత్తూర్ చాప్టర్ అండ్ రెసిడెంట్స్ అవేర్‌నెస్ అసోసియేషన్ సైతం ఆమెను సత్కరించింది.
రాబోయే కాలంలో..
కూరగాయలు పెంపకానికి వర్షాకాలం మంచిది. కొద్దిపాటి మెళకువలు పాటిస్తే అన్నికాలాల్లోనూ అన్ని రకాల పంటలు పండించుకోవచ్చని చిత్రా కృష్ణస్వామి అంటారు. రాబోయే కాలంలో క్యాబేజీ, క్వాలీఫ్లవర్, కీర, బీట్‌రూట్, క్యారెట్ వంటి పంటలను పండిస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
గాలి వెలుతురు ఉండే చిన్న స్థలంలోనైనా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను సేంద్రీయ పద్ధతుల్లో పండించుకోవచ్చని ఆమె చెబుతున్నారు. మన ఇంట్లో పండే తాజా కూరగాయలతో వంట చేస్తుంటే ఆ కమ్మటి రుచే వేరుగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఐదు కుండలు, కొద్దిపాటి పీచు, టార్పాలిన్ లేదా ప్లాస్టిక్ షీట్‌తో ఈ వేసవిలోనే కిచెన్ గార్డెన్‌ను పెంచుకోవచ్చు. ఇంట్లో దొరికే పచ్చిమిర్చి, వెల్లుల్లితో చీడపీడలను నివారించుకోవచ్చని చిత్రా కృష్ణస్వామి చెబుతున్నారు.
*
చిత్రం.. అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న చిత్రా కృష్ణస్వామి