సబ్ ఫీచర్

లేడీ సోల్జర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఎస్‌ఎఫ్ సరిహద్దు భద్రతాదళం. అక్కడ విధులు నిర్వర్తించటం అనుకున్నంత తేలిక కాదు. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకోవడానికి అత్యంత ధైర్య సాహసాలు కావాలి. నిత్యం డేగకళ్ళతో పహారా కాయాలి. ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఇలాంటి ఉద్యోగాలు మగవాళ్లు మాత్రమే చేయగలరు. వారికే శక్తి సామర్థ్యాలు ఉంటాయనేది సమాజంలో నాటుకుపోయిన భావన. అందుకేనేమో గత ఐదు దశాబ్దాలుగా బిఎస్‌ఎఫ్‌లో లేడీ జవాన్ అన్నమాటే లేదు. అలాంటి చరిత్రను తిరగరాసింది
తను శ్రీ పరీక్. రాజస్థాన్ బికనీర్‌కి చెందిన 25 ఏళ్ల ఈ లేడీ సోల్జర్ బిఎస్‌ఎఫ్‌లో మొట్టమొదటి మహిళా ఫీల్డ్ ఆఫీసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. గత 51 ఏళ్లలో బిఎస్‌ఎఫ్ ఆఫీసర్ ర్యాంకులో మహిళలు లేరన్న లోటుని తీర్చేసింది. 2014 యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ, మహారాష్ట్ర తేకన్‌పూర్ బిఎస్‌ఎఫ్ అకాడమీలో చేరారు. 52 వారాలపాటు అనేక అంశాల్లో శిక్షణ పొందారు. 67మంది ట్రైనీ ఆఫీసర్లకు తనుశ్రీ టీం లీడర్‌గా వ్యవహరిస్తా రు. అందులో 51 మంది డైరెక్ట్ ఎంట్రీ ఆఫీసర్ ర్యాంక్ ఉన్నవారే. మిగిలినవారు ప్రమోషన్ మీద వచ్చారు. అసిస్టెంట్ కమాండెంట్‌గా తనుశ్రీ పంజాబ్‌లోని ఇండో పాక్ బోర్డర్‌లో ఆమె బాధ్యతలు చేపట్టారు. 1965 లో ఏర్పాటైన బిఎస్‌ఎఫ్ పాక్, బంగ్లా సరిహద్దు రక్షణలో రాజీలేని పోరా టం చేస్తోంది. ఈ రక్షణ దళంలో రెండున్నర లక్షలమంది జవాన్లు దేశానికి సేవలందిస్తున్నా రు. మిలటరీ తర్వాత, భూ, జల, వాయు దళాల్లో పహారా కాసే ఏకైక ఫోర్స్ బిఎస్‌ఎఫ్. ఒక్కమాటలో చెప్పాలంటే బిఎస్‌ఎఫ్ దేశానికి మొదటి రక్షణ రేఖ మాత్రమే కాదు.. మొదటి రక్షణ గోడ కూడా. దేశంలోని అత్యంత గౌరవనీ య సేవల్లో ఇదీ ఒకటి. అలాంటి క్లిష్టమైన సర్వీస్‌లోకి మహిళ ఒక ఆఫీసర్‌గా రావడం జాతి గర్వించాల్సిన విషయం.
*
పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తనుశ్రీపై ప్రశంసల వర్షం కురిపించారు. బిఎస్‌ఎఫ్‌లో ఫీల్డ్ ఆఫీసర్ ఒక మహిళ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తనుశ్రీని స్ఫూర్తిగా తీసుకుని యువతులు బిఎస్ ఎఫ్‌లో సేవలు అందించడానికి ముందుకురావాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
*