సబ్ ఫీచర్

రైజింగ్ స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, స్వార్థపూరిత సమాజంలో పరుల మంచి కోసమే బతికేవాళ్లు చాలా అరుదుగా వుంటారు. అలాంటివారిలో ఒకరు కిరణ్ అనే యువకుడు. మంచి మనసున్న యువకుడు. పెట్రోల్ పంపులో పనిచేస్తాడు. సొంతూరు కర్నాటకలోని మాంధ్య డిస్ట్రిక్ట్, అనెగోల అనే చిన్న గ్రామం. తండ్రి వ్యవసాయం చేస్తాడు. ఎపిఎస్ ఈవినింగ్ కాలేజీలో బికాం చదివిన కిరణ్.. పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. తను పనిచేసే పెట్రోల్ బంకుదగ్గర విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతుండేవి. రోజూ ఏదో ఒకటి అయ్యేది. కళ్లముందే ఘోరం జరిగిపోయేది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు సాయపడేవాడు. బండి డామేజ్ అయితే షెడ్డుకి తీసుకెళ్ళేవాడు. మనుషులకు దెబ్బలు బాగా తాకితే ఆసుపత్రికి తీసుకెళ్ళేవాడు. మామూలుగా తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు.
సరిగ్గా అక్కడే యాక్సిడెంట్లు కావడానికి కారణం సరైన సైన్ బోర్డులు లేకపోవడమే. ఆ విషయాన్ని గమనించిన కిరణ్.. ఒక రోజు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ఇదీ సంగతి అని వాళ్లకు వివరించాడు. సాక్ష్యం కావాలంటే ఇదిగో చూడండని అనేక యాక్సిడెంట్ల తాలూకు ఫొటోలను వారికి చూపించాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు..సైన్ బోర్డులు నాకివ్వండి.. వాటిని నేను ఏర్పాటుచేసుకుంటాను అని రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు కిరణ్ మాటలకు సానుకూలంగా స్పందించారు. నిత్యం యాక్సిడెంట్లు జరిగే టెంపుల్ రోడ్డు ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. జీరో యాక్సిడెంట్ స్పాట్‌గా తయారైంది. అదంతా కిరణ్ చలవే అని జనం నిస్సందేహంగా చెప్తారు. ఒకరోజు రాత్రి పూట భోజనం మానేసి ఈ పని చేసినందుకు ఎంతోమంది ప్రాణాలు కాపాడినవాడయ్యాడు. కిరణ్ జోక్యం చేసుకోవడంవల్లనే సైన్ బోర్డులు వచ్చాయని చాలామంది వచ్చి థాంక్స్ చెప్పారు. అధికారులు చేయలేని పని నువ్వు చేశావని మెచ్చుకున్నారు. కిరణ్‌లో ఈ సేవాగుణం ఎలా నాటుకుందంటే.. తనతోపాటు పనిచేసే మరో ఆరుగురితో కలిసి మంచి పనులకు నడుం బిగించాడు. రోడ్డు ఎక్కడ పాడైనా వెంటనే అక్కడ వాలిపోయి ప్రమాద సంకేతాలు పెడతాడు. మలుపుల దగ్గర, స్పీడ్ బ్రేకర్ల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తాడు. వీధి దీపాలు వెలగకపోయినా, మున్సిపాలిటీ వాళ్లకోసం వేచి చూడకుండా తన వంతు బాధ్యతగా చేస్తాడు. తెరిచి వున్న మ్యాన్ హోల్స్ విషయంలో అయితే చాలా సీరియస్‌గా వుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం మన స్వార్థం కోసం బతుకుతుంటే, కిరణ్ మాత్రం పరులకోసం బతుకుతున్నాడు. కిరణ్ నిస్వార్థ సేవ ఆ నోటా ఈనోటా బెంగుళూరు అంతా తెలిసింది. అందరినుంచి ప్రశంసలు వెల్లువలా వచ్చాయి. గత ఏడాది రైజింగ్ స్టార్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.