సబ్ ఫీచర్

రైతు రాబడి పెరిగేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత 50 సంవత్సరాలలో మన వ్యవసాయ రంగం మంచి ప్రగతినే సాధించింది. ‘హరిత విప్లవం’ వల్ల తీవ్ర కరవు తొలగిపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1952-53లో 5.92 కోట్ల టన్నులు. 2014-15లో ఇది 25.27 కోట్ల టన్నులు. ఈ కాలంలో ఉత్పాదకత హెక్టారుకు 580 కేజీల నుండి 2070 కేజీలకు పెరిగింది. ఆహార సబ్సిడీ 2005-06లో రు.23,071 కోట్లు వుంటే 2015-16 నాటికి రూ. 1,05,509.41 కోట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల వల్ల తలసరి వినియోగంలో ప్రగతి ఆశించిన రీతిలో లేదు. ఇది (రోజుకి గ్రాములలో) 2009లో 444 ఉంటే, 2013 నాటికి 510.8కి పెరిగింది.
వ్యవసాయ రంగం ప్రగతి సాధించినా రైతుల పరిస్థితిలో మార్పు లేదు. ప్రభుత్వం మాత్రం రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం వ్యవసాయ కుటుంబ ఆదాయం సగటున సంవత్సరానికి రూ. 6,426 అని ఒక అంచనా. మన రైతులలో చిన్న, సన్నగారు రైతులు 85 శాతం వరకూ ఉన్నారు. హరిత విప్లవానికి పేరుగాంచిన పంజాబ్‌లో కూడా వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదర్కొంటున్నది.
రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోలేకపోతున్నారు. సాగునీటి ఖర్చులు తక్కువగా వుంటే నీరు వృథా అవుతున్నది. కొన్ని ఎరువులకు సబ్సిడీ బాగా ఉంటే వాటిని విపరీతంగా వాడుతున్నారు (ఉత్పాదకత పెరగకపోయినా). వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతుకూలీలు ఇతర రంగాలకు వలస పోతున్నారు. వ్యవసాయ కూలీల కొరత వల్ల వేతనాలు పెరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సుమారు 30 శాతం వుంది. ఈ పరిస్థితుల్లో రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకుని కొందరు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రసాయనాలతో భూసారం క్షీణిస్తున్నది. దిగుబడులు తక్కువ స్థాయిలో వున్నాయి. దీనికి ప్రధాన కారణం కేవలం 40 శాతం సాగుభూమికే నీటిపారుదల సౌకర్యాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ద్వారా నీటిని సమకూర్చాలి. నీటి ఆదా కూడా ముఖ్యమే. పంటలను నిల్వ చేసుకునేందుకు సౌకర్యాలు వుండాలి. రైతు కేవలం ఒకే పంటపై ఆధారపడకూడదు. ఆహార శుద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు చేబడితే ఆదాయం పెరుగుతుంది.
పాడి, కోళ్ల పరిశ్రమలు మంచి ప్రగతినే సాధించాయి. ఖర్చును తగ్గించుకోవడానికి మన రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి. ఆహార వృథాను అరికట్టాలి. ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్ల విషయంలో వృథా 10 నుండి 15 శాతం వరకు ఉంది. ఈ వృథా విలువ రూ. 92,651 కోట్లు అని అంచనా. ఆహారశుద్ధి పరిశ్రమను విస్తృత పరచాలి. వ్యవసాయ రంగంలో బాగా లాభం పొందేది దళారులే. వినియోగదారుడు చెల్లించే ధరలో 20 నుండి 30 శాతం మాత్రమే రైతు పొందుతున్నాడు. అందువల్ల మార్కెట్ సంస్కరణలకు పెద్దపీట వేయాలి. రైతుకు తన ఉత్పత్తిని మంచి ధర వచ్చే చోట విక్రయించుకునే అవకాశం కల్పించాలి.

-ఇమ్మానేని సత్యసుందరం