సబ్ ఫీచర్

అవయవదానం వైపు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని చైతన్యపర్చడమే ఆమెధ్యేయం. అందుకోసం అందుబాటులో వున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటారు. గృహిణిగా, ఉపాధ్యాయినిగా శరీర అవయవ దాన సంస్థ నిర్వాహకురాలిగా, రచయితగా సమాజాన్ని జాగృతం చేసేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన కాట్రగడ్డ భారతి ఎం.ఎ తెలు గు, ఎం.ఎ ఇంగ్లీషు చదివి బి.ఇడి పూర్తిచేసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు. తన విరామ సమయాన్ని సెలవు రోజులను సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఆహార, అవయవ దాన సంస్థ నిర్వాహకురాలిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అవయవ దానంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అం డ్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు.
రచయితగా..
కాట్రగడ్డ భారతికి తెలుగు భాషపై మంచి పట్టుంది. కను ల కొలను కవితా సంపుటి, ఇది మొట్టమొదటి పతిస్కృతి కవి తా సంకలనం అచ్చయ్యాయి. ఈ రెండు పుస్తకాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. అదేవిధంగా శరీర అవయవదానం ప్రాధాన్యతకు అద్దంపట్టేలా ఆమె రాసిన వెనె్నల పుష్పాలు బహుళ ప్రజాదరణ పొం దాయి. పిల్లలకు సాహిత్యంపై ఆలోచింపజేసే ఏకవాక్య కవిత లు, ద్విపదలు, నానీలు, హైకూలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి.
ఎన్నో పురస్కారాలు
సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా కాట్రగడ్డ భారతి పలు వేదికలపై సన్మానాలు పొందారు. రెండేళ్ల క్రితం ఉగాది సందర్భంగా ప్రత్యేక ప పురస్కారాన్ని సాహితీవేత్త మాడుగుల నాగఫణిశర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఇదే వేదికపై ఆమెను ఘనంగా సన్మానించారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ సాహితీవేత్త ఇందూరు శతజయంతి ఉత్సవాల్లో భారతి పాల్గొని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా సి.నారాయణరెడ్డి చేతులమీదుగా సత్కారం పొందారు. నిజామాబాద్ భావన సాహితి సంస్థతో భాషాప్రవీణ అవార్డు, సత్కారం పొందారు.
జాతీయ శరీర అవయవ దాన సంస్థ, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సంస్థ చైర్ పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. హైదరాబాద్ ప్రౌడ్ సంస్థ భారతి చేసిన సేవలకు విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానించారు.
సదస్సులతో అవగాహన
అవయవ దానంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించారు. అవయవదానంపై ప్రజల్లో వున్న అపోహలు తొలగించేలా, మరణానంతరం దేహం ఎలా ఎందరికి ఉపయోగపడుతుందో వివరిస్తూ సదస్సుల్లో ఉపన్యసించారు. వైద్య విజ్ఞానానికి పార్థివదేహం ఎలా ప్రయోగశాలగా ఉపకరిస్తుందో తెలియజేయడమే కాకుండా, వందలాదిమందిని దేహదాన ఉద్యమంలో సభ్యులుగా చేర్పించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డి శిక్షణా సంస్థలో, విశాఖలోనూ ఇలాంటి ప్రసంగాలు చేశారు. మేము సహితం ఫౌండేషన్ సభ్యురాలిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఓపిక ఉన్నంతవరకు సమాజసేవే: భారతి
గత ఏడాది అంతర్వేదిలో డా కత్తిమండ ప్రతాప్ నిర్వహించిన 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల పాటు జరిగిన ప్రపంచ కవితోత్సవంలో పాల్గొని కవితలు వినిపించాను. నా శరీరంలో ఓపిక ఉన్నంతవరకూ సమాజసేవకే పాటుపడతాను. రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తాను. శరీర అవయవ దాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతాను. ప్రజల సహకారం కూడా అవసరం.

- నీలిమ సబ్బిశెట్టి