సబ్ ఫీచర్

అమెజాన్ అడవి ఇక ఎడారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌కి వాయువ్యంగా 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అతిపెద్ద వర్షారణ్యం- ‘అమెజాన్’. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలీవియా, గయానా, సురినామ్ దేశాల్లోకి ఇది విస్తరించింది. ఈ అడవి మొత్తంలో ఎన్నో నదులు విస్తరించి ఉన్నాయి. మత్స్య సంపదకు, ఇతర జలచరాలకు ఈ నదులు నెలవు. ఈ నదులే స్థానికులకు రవాణా మార్గాలు. స్థానిక ప్రజలు ఈ నదుల జలాలలో ఆటలాడుతూ వినోదిస్తుంటారు.
అక్టోబర్ 2015లో బ్రెజిల్ రాజధాని మనౌస్ సమీపంలోని నీగ్రో నదిలో నీటిమట్టం ఒక్కసారిగా తగ్గిపోవడంతో పడవలు ఎక్కడికక్కడ కదలకుండా నిలిచిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం తగ్గడం వల్లే ఈ నదీ జలాలు అడుగంటిపోయాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ‘నదీ జలాలు అడుగంటిపోవడంవల్ల అమెజాన్‌లో సంక్షోభం తలెత్తుతోంది. గత పదేళ్లలో అమెజాన్ ప్రాంతం భారీ వరదలకు, తీవ్రమైన కరువు కాటకాలకు గురైంది. నిజానికి ఇలాంటి వైపరీత్యం ఏ వందేళ్లకొకసారో సంభవిస్తుంది. ఇటీవల ఇక్కడ ఇది తరచుగా సంభవిస్తోంది’ అని జోస్ మారెంగో అంటారు. ఈయన ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపిసిసి)లో వాతావరణ శాస్తవ్రేత్త, జల శాస్తవ్రేత్త. బ్రెజిల్ అమెజానాలో జింగూ నదీ తీర ప్రాంత వాసి అయిన మతరిపే ట్రుమై- ‘ఇక్కడి వాతావరణంలోని మార్పులు మా జీవితాలను ఛిన్నాభిన్నం చేసాయి. నదులు పూడుకుపోవడం వల్ల మత్స్య సంపద అంతరించిపోతోంది. చేపలకు ఆహారమైన పసుపురంగు పళ్లు కూడా ఇప్పుడు లభ్యం కావడంలేదు. ఉరుములు, మెరుపులు అయితే బాగానే వస్తున్నాయి. కానీ వర్షం పడితేనే కదా మంచి జరిగేది’ అని ఆయన అంటారు.
అమెజాన్‌కి చెందిన రెండువిషయాలు పరిశోధకులను ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. మొదటిది అమెజాన్‌లో జల సంబంధమైన సమస్య తీవ్రమవుతోంది. బ్రెజిల్‌లోని ఒబిడోస్‌లో ప్రవహిస్తున్న అమెజాన్ నది నీటిమట్టం నిదానంగా పెరగడం గమనిస్తున్నాం. 20 ఏళ్ల ముందు కంటే ఇప్పుడు ఇక్కడి నీటిమట్టం 15 శాతం ఎక్కువగా ఉంది. పశ్చిమ అమెజాన్‌లో వాతావరణం పొడిగా వుండేకాలం నిడివి పెరుగుతోంది. వాతావరణంలోని మార్పులే కాదు, అడవులు విపరీతంగా తరిగిపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. గతంలో 27వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం 2014 తరువాత ఐదు వేల చదరపు కిలోమీటర్లకు కుదించుకుపోయింది’ అని అంటారు పౌలో అర్తాక్సో. ఈయన యూనివర్సిటీ ఆఫ్ సావోపౌలోకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్. ‘గ్లోబల్ వార్మింగ్ మరో 3-4 డిగ్రీల సెల్సియస్ పెరిగితే అమెజాన్ అడవులు పూర్తిగా అంతరించిపోతాయి. ఇదేజరిగితే ఇక్కడి గాలిలో కార్బన్ డయాక్సైడ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ పీల్చేందుకు ఒక్క చెట్టు కూడా మిగలదు కదా’ అని పౌలో అర్తాక్సో అంటారు. 30 నవంబర్-12 డిసెంబర్ 2015లలో పారిస్ నగరంలో వాతావరణానికి సంబందించి ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. వాయువ్య అమెజాన్‌కి చెందిన ఆండ్రీ బనివా పారిస్ సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రపంచంలోని జీవజాలం మొత్తం అంతరించిపోయే సమయం రాబోతోందని, ఆ కాలాన్ని ‘నిశ్శబ్ద యుగం’గా భావించవచ్చునని అన్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్