సబ్ ఫీచర్

విసుగులోనూ పండిన హాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మోరు’ సినిమాలో బాల అమ్మోరుగా నటించిన సునయన గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మాయి నేడు సోషల్ మీడియాలో వెబ్ సిరీస్‌తో హల్‌చల్ చేస్తోంది. సహనానికి మారుపేరు స్ర్తి అని అంటారు. అలాంటి మహిళలో నిరాశ నిస్పృహాలు జనియించి విసుగుదల వస్తే ఎలా ఉంటుందో హాస్యంగా చూపించే ‘ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్’ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. అయితే నిజజీవితంలో మాత్రం తనకు విసుగనేది ఉండదని చెబుతోంది. ఓ కంపెనీ యాడ్స్‌కు వాయిస్ ఓవర్ కళాకారిణిగా పనిచేసే అవకాశం రావడంతో సోషల్‌మీడియాలో అడుగుపెట్టానంటున్న సునయన బాహుబలి సినిమాలోని కిలికి భాషపై చేసిన వీడియో వైరల్ సృష్టించింది. ‘ఈ వీడియోపై రెండు మిలియన్ల మంది తమ అభిప్రాయాలను పం పారు.
దీంతో మహిళకు సం బంధించిన అంశంపై ఏదైనా చేయాలని భావించి ఈ ‘ఫ్రస్ట్రేటెడ్ వుమెన్’ వెబ్ సిరీస్‌ను ఆరంభించాను. ఈ వీడియాలకు అద్భుతమైన స్పందన వస్తుంది. గర్భిణిగా ఉన్న సమయంలో ఇంటిలోనే ఉండి ఈ సిరీస్ చేశాను. ఎంతోమంది విలువైన అభిప్రాయలు నాతో పంచుకున్నారు’ అంటోంది సునయన.

విమర్శలు లేకపోలేదు..
‘నిరాశ, విసుగుదల వచ్చినపుడు మహిళల్లో వ్యతిరేక భావాలు వ్యక్తం అవుతాయి. ఈ భావాలనే కథాంశాలుగా తీసుకుని కార్యక్రమాలు రూపొందించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇలాంటివి అవసరమా అని అడుగుతుంటారు. కాని నేటి సామాజిక పరిస్థితుల్లో పనివత్తిడి వల్ల స్ర్తిలలో సహజంగా విసుగదల వస్తుంది. కాబట్టి దీనినే నేను నమ్మాను. దీనికి హాస్యాన్ని జోడించి చేస్తున్నాను’ అని సునయన అం టుంది. విసుగు వచ్చినపుడు ఓ మహిళ లో కలిగే స్పందనను హాస్యాన్ని జోడించి చూపిస్తున్నాను. తల్లిదండ్రులు, భర్త, అత్తింటివారి సహకారం ఉం డటం వల్లే ఇన్ని ఎపిసోడ్స్ చేయగలిగానని చెబుతోంది.
ఆధ్యాత్మికం
అంటే ఇష్టం
నిజ జీవితంలో ఇలాగే విసుగుదల తో ఉం టారా? అ ని ప్రశ్నిస్తే. ‘నేను చాలా ప్రాక్టికల్‌గా ఆలో
చిస్తాను. బాహ్యపరమైన పరిస్థితులు నాపై అంత ప్రభావం చూపవు. చాలా ఆచరణాత్మకంగా నడుచుకుంటా. ఇలాంటి వెబ్ సిరీస్ చేయటం వల్లనేమో ఆధ్యాత్మికం వైపు దృష్టి మళ్లింది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించటం వల్ల ఇపుడు కెమెరా ముందుకు రావటానికి ఎలాంటి భయం లేదు’ అని చెబుతోంది.