సబ్ ఫీచర్

ప్రాణాలకు తెగించి... బాలికను రక్షించి.. చిన్నారి సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి వయస్సు అడ్డంకికాదు అని నిరూపించింది ఆరేళ్ల చిన్నారి టికీ. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ చిన్నారి సాహసం, సమయస్ఫూర్తి ముందు ఆ మొసలి పారిపోక తప్ప లేదు. ఒడిశాలోని ఒక మూరుమూల గ్రామంలో టికీ చేసిన సాహసకృత్యం ఇది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో బంకులా అనేది ఒక కుగ్రామం. ఈ గ్రామ శివారులో ఒక నీటికుంట ఉంది. గ్రామంలోని పిల్లలు ఈ నీటి కుంటలో దిగి ఆటలాడుకుంటారు. బంకులా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బసంత్ దలాయ్ అనే ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలిక రెండవ తరగతి చదువుతున్నది. ఆమె సోదరి మమత అలియాస్ టికీదలాయ్ (6)తో నీటికుంట వద్దకు వచ్చారు. నీటికుంటలోకి ఎలా వచ్చిందో ఒక మొసలి వచ్చి చేరింది. అలవాటు ప్రకారం సోదరీమణులు అయిన బసంతి, టికీ స్నానం చేయడానికి ఇటీవల నీటి కుంటలోకి దిగారు. వారిరువురూ నీళ్ళలో ఆడుకుంటూండగా మొసలి వచ్చి బసంతిని పట్టుకొన్నది. దీంతో బసంతి కేకలు వేసింది. మొసలిని గమనించిన టికీ వెంటనే గట్టుపైకి వచ్చి, గట్టుమీద వు న్న కర్ర తీసుకొని మొసలి తలపై దెబ్బ మీద దెబ్బ ఆగ కుండా కొట్టిం ది. దెబ్బలకు తాళలేక మొసలి బసంతిని వదలిపెట్టింది. వెంటనే టికీ బాసటగా వుండి బసంతిని గట్టుమీదకు తీసుకువచ్చింది. పిల్లల కేకలు విని చుట్టుప్రక్కలవారు అక్కడకు చేరుకున్నా రు. చేతులు, తొడ భాగంలో గాయాలైన బసంతిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బసంతి ఆసుపత్రిలో కోలుకుంటున్నది.
సాహసంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి తన స్నేహితురాలిని మొసలి బారినుండి కాపాడిన మమత అలియాస్ టికీ దలాయ్‌ని అందరూ అభినందించారు.

chitram...
టికీ దలాయ్‌తో సెల్ఫీ దిగుతున్న ముఖ్యమంత్రి

- భార్గవరామ్