సబ్ ఫీచర్

పనిలో భద్రతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధి నిర్వహణలో ఉన్న కార్మికులు, ఉద్యోగుల భద్రతకు రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. సురక్షిత విధానాలు, ప్రమాదాలు జరగకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటించడం, ప్రమాదాలు ఏర్పడినప్పుడు గాయపడిన, మరణించినవారి కుటుంబాలను ఆదుకోవడంపై సానుకూల చర్యలు తీసుకోవలసిన అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో మరిన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేయవలసి ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంపై శ్రద్ధచూపుతోంది. విస్తృత ప్రచార కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. పరిశ్రమలు, వివిధ సంస్థలు, విధినిర్వహణలో ఉండగా అనేక కారణాలవల్ల ఏటా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య 6300. ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడుతున్నవారి సంఖ్య 2.3 మిలియన్లు. ఇక ప్రతి ఏటా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య 31.7 మిలియన్లు. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల జరిగే ఈ సంఘటనల ప్రభావం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిపై ప్రభావం చూపుతోందని అధ్యయనాలు తేల్చిచెబుతున్నాయి. ఆ ప్రభావం దాదాపు నాలుగు శాతం ఉంటోందని అంచనా. అందుకే పనిచేసే ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) స్పష్టమైన కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగానే ఏటా ఏప్రిల్ 28న ‘వరల్డ్ డే ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్’గా పరిగణిస్తోంది. విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో వివిధ సంస్థలూ పాలుపంచుకుంటున్నాయి. 2030 నాటికి సంపూర్ణ భద్రత కల్పించాలన్నది లక్ష్యం. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (ఓఎస్‌హెచ్) ఎలా సాధ్యమో కొన్ని సూచనలు చేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రచారం చేస్తోంది. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అందించాల్సిన సేవలపైనా సూచనలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఉద్యోగులు, కార్మికులు కూడా భద్రతా ప్రమాణాలను, జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలు, సంస్థల్లో భద్రతాలోపాలుంటే, ప్రమాదాలు జరుగుతూంటే ఉద్యోగులు, కార్మికులపై పరోక్ష ప్రభావం పడుతుంది. వారికి ఆరోగ్య, మానసిక, శారీరక సమస్యలు ఎదురౌతాయి. అది ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మొత్తంమీద అటు సంస్థలకు, ఇటు కార్మికవర్గానికి నష్టమే జరుగుతుంది. అదే విషయాన్ని ప్రచారం చేయడానికి 2017 సంవత్సరలో సరికొత్త నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ఎంచుకుంది. సంస్థాగతమైన, వృత్తిపరమైన విధుల్లో భద్రత, ఆరోగ్యం అన్న అంశాన్ని ఎంచుకుని ఈ ఏడాది కార్యక్రమాలు చేపడుతోంది. నానోటెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా ప్రమాణాలను పెంచాలన్నది మరో ముఖ్య సూచన. వీటిపై కార్మికవర్గానికి అవగాహన కల్పించాల్సిన తరుణమూ ఇదే. ప్రమాదాల్లో మరణించినవారికి స్మరించుకునే రోజు కూడా ఇదే. 1996 నుంచి దీనిని పాటిస్తున్నారు. ప్రమాదాలు లేని ఆరోగ్యకరమైన వాతావరణలో ఉద్యోగ కార్మిక వర్గాలు పనిచేసే రోజుకోసం ప్రపంచం పరితపిస్తోంది.

-రవళి