సబ్ ఫీచర్

అమ్మ అమాయకురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ నటించిన సినిమాలను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆమె ఏడ్చే దృశ్యాలను చూసి తట్టుకోలేను. కాని ఆమె చనిపోయిన తరువాతే కళా రంగంలో ఆమెకున్న ప్రజ్ఞాపాటవాలు తెలుసుకోగలిగాను అంటున్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. సినీ వినీలాకాశంలో ధ్రువవతారగా వెలుగొందిన మహానటి సావిత్రిపై బయోపిక్ వస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా తల్లి చుట్టు అల్లుకున్న చీకటి కోణాలు, తండ్రి జెమినీ గణేశన్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు గురించి వివరించారు.
హైదరాబాద్‌తో అనుబంధం
హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉండేది. గృహిణిగానే ఉండటానికి ఇష్టపడతాను. అమ్మ నటించే గృహిణి క్యారెక్టర్ల అంటే ఎంతో ఇష్టం. గ్లామర్ ప్రపంచానికి దూరంగానే అమ్మ మమ్మల్ని పెంచింది. హైదరాబాద్‌లో మా పెద్దమ్మ ఉండేది. సెలవుల్లో వచ్చేదాన్ని. అమ్మ హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటే పెద్దమ్మ ఇంట్లోనే ఉండేది. వాణిశ్రీతో ఇప్పటికీ టచ్‌లో ఉంటాను. జమున, షావుకారు జానకీలను కలుస్తాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగార్ని కలిసి వెళుతుండేదాన్ని.. మా రెండో అబ్బాయి అభినయ్ తమిళ సినిమా రామానుజంలో ప్రధాన పాత్ర పోషించారు.
సాధారణ మహిళగానే ఉండేది..
మా అమ్మ తియ్యని తల్లి. ఎందుకంటే ఏనాడు తాను పెద్ద స్టార్‌ను అని మా ముందు ప్రవర్తించలేదు. స్నేహితురాలిగా ఉండేది. షూటింగ్ లేకపోతే చిన్నపిల్లలా మాతో ఆడుకునేది. ఓ మధ్యతరగతి సాధారణ గృహిణిగానే ఇంట్లో ఉండేది. ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా.. ఉల్లాసంగా ఉండేది. ఈ విషయాలనే మా అమ్మ బయోపిక్ తీసే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు వివరించాను. పదహారేళ్లకే నాకు పెళ్లి చేసింది. నా పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాలకు తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఉండేవి. మా ఇంట్లో తండ్రి జెమినీ గణేశన్ లేకపోయినా ఆయన ఇంటికి వెళుతుండేదాన్ని. మా తమ్ముడు సతీష్‌కు అమ్మతో అనుబంధం ఎక్కువగా ఉండేది.
మార్గనిర్దేశం లేక మద్యానికి బానిసైంది..
తనను చుట్టుముట్టిన కష్టాలు, సమస్యలను పరిష్కరించుకునే పరిపక్వత అమ్మకు లేదు. ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు. అంతేకాదు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేక మద్యానికి బానిసైంది. ఓరోజు కోమాలోకి వెళ్లిన ఆమె అలా 19 నెలలు కోమాలోనే ఉండి చివరకు కన్నుమూసింది. ఆసుపత్రి బెడ్ మీద ఆ పరిస్థితుల్లో అమ్మను చూసి తట్టుకోలేకపోయేదాన్ని. తండ్రి జెమినీ గణేశన్ కూడా తల్లిని చూసి భావోద్వేగానికి గురయ్యేవారు. అమ్మ చనిపోయిన తరువాత కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడలేదు. ఆమె ఎంత పోగొట్టుకుందో అంత సంపాదించే వెళ్లింది.
ఆమె మాకు గొప్ప జీవితాన్ని ప్రసాదించింది.
బయోపిక్ సంతోషకరం
నాగ్ అశ్విన్ అమ్మ బయోపిక్ తీయాలనుకోవడం ఆనందకరమైన విషయం. రాబోయే జనరేషన్‌కు ఆమె గురించి తెలియాలంటే ఇది ఎంతో అవసరం. ఈ సందర్భంగా ఆయనను రెండు విషయాలపైనే అర్థించాను. ఒకటి స్క్రిప్ట్ చూపించమని కోరాను. అలాగే ఆమె స్టార్‌డమ్‌ను మాత్రమే చూపించమని కోరాను.