సబ్ ఫీచర్

అభివృద్ధికి నోచని మురికివాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు భవిష్యత్తులో మురికివాడలు లేని భారతదేశాన్ని చూడగలమా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఎన్నో ప్రభుత్వాలు మారినా మురికి వాడలు లేని భారతాన్ని చూపిస్తామని నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. మురికివాడలు లేని భారతాన్ని చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాజీవ్ ఆవాస్ యోజన పథకం ఆలోచనకు, ఆచరణకు మధ్య ఎంతో వ్యత్యాసం వుంది. పేదల్లో అనేక ఆశలు నింపింది. దేశంలో ఇల్లులేని నిరుపేదలంతా ఈ పథకంలో తమకు నీడ దొరుకుతుందని ఆశపడ్డారు. గృహరంగంలో కనిపిస్తున్న అభివృద్ధి బుడగ పేలిపోతుందేమోనని కొన్ని దశాబ్దాలకాలం ఆందోళనగా వున్న స్థిరాస్తి వ్యాపారుల లాబీ ఈ పథకంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఒనగూడే రాయితీలు, ప్రోత్సాహకాలు గుర్తించింది. ఆదేవిధంగా బ్యాం కింగ్ రంగం గృహ రుణాల రూపం లో వ్యాపారాభివృద్ధిని ఆశించాయి. ఈ పథకంపై సంతోషం వ్యక్తం చేసినవారిలో పట్టణ మధ్యతరగతి, సంపన్నవర్గాలు. ఎందుకంటే ఈ పథకం ద్వారా మురికివాడలు మాయమై పారిశుద్ధ్యం మెరుగై శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని తలచారు. ప్రధానంగా మురికివాడనుంచే సమస్యలు పుడతాయని భావించేవారికి అక్కడనుండి బలవంతంగా తరలించినా ఈ పథకాలద్వారా ఉద్ధరించినా పెద్దగా అభ్యంతరం వుండదు.
మూడు దశాబ్దాలుగా అమలవుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఆర్‌ఏవై పథకాన్ని ప్రత్యేకించి పరిశీలించాల్సి వుం టుంది. జవహర్‌లాల్ నెహ్రు పట్టణాభివృద్ధి మిషన్ (జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం) దీనికి చక్కని ఉదాహరణ. నగరాలను అందంగా తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ స్థాయిలో వుండాలన్న ఉద్దేశంతో వచ్చిందే ఈ పథకం. ముఖ్యంగా పట్టణాల్లో అందుబాటులో వున్న భూమి మురికివాడల పెరుగుదల, జనాభా,సదుపాయాలను అందిపుచ్చుకునే స్తోమత ఆధారంగా ఈ పథకాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈనాలుగు అంశాలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం/ఆర్‌ఏవై పట్టణాల్లో జనాభా పెరుగుదల, అందులోని నిరుపేదలపై ఆధారపడి ఉంటాయి. ఆర్‌ఏవై పథకంలో అతికీలకమైన అంశం ఏమిటంటే గృహానికి భూమి ఉచితంగా అందచేయడం. ఏదైనా పట్టణం లేదా రాష్ట్రం ఉచితంగా భూమిని కేటాయించలేదంటే కేంద్ర నిధులను అభ్యర్థించే అవకాశం కోల్పోతుంది. పట్టణ జనాభాలో 18నుండి 20 శాతం మురికివాడల వాసులుంటే, పట్టణ భూ విస్తీర్ణంలో వారు ఆక్రమించింది కేవలం మూడునుండి నాలుగు శాతం మాత్రమే. చాలావరకు మురికివాడల స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటి, స్వార్ధపరుల కన్నుపడిన పట్టణ నడిబొడ్డు ప్రాంతంలో వున్నవన్నది ముఖ్యాంశం.
ఆర్‌ఏవై ముఖ్య ఉద్దేశాలలో మురికివాడలలో డెభ్భై అయిదు శాతం గృహ వసతి యోగ్యమై వుండాలి. మిగిలిన ఇరవై అయిదు శాతం మించని జనాభాను అక్కడినుండి తరలించి వేరొకచోట వసతి కల్పించవచ్చు. మురికివాడల అభ్యున్నతికి ఇదేసరైన పరిష్కారం అవుతుంది. నిజానికి పట్టణాల్లో కాని రాష్టస్థ్రాయిలోకాని ఆక్రమిత భూములను స్థానిక సంస్థలు తమవిగా ప్రకటించి గృహవసతిలో పూచీ ఇవ్వవు. మురికివాడల వాసితులనుండి భూమిని స్వాధీనం చేసుకుని స్వప్రయోజనాలకు కొని, నిధుల సేకరణకు గానీ ఉపయోగించాలని చూస్తాయి. సాధారణంగా పట్టణాల్లో స్థానిక సంస్థలు మాస్టర్ ప్లాన్‌లో లేని ఎవరి యాజమాన్యంలో లేని భూములను గృహ వసతికి యోగ్యమైనవిగా గుర్తిస్తాయ. పట్టణాలకు వెలుపల, భూములు ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే వసతియోగ్యంగా నిర్ధారిస్తారు.
మురికివాడల అభివృద్ధికి భూములు కేటాయించే విషయంలో భిన్న ఆలోచనల కారణంగా ఆర్‌ఏవై పథకం చాలా పట్టణాల్లో మొదలే కాకుండా నిలిచిపోయింది. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం పరిస్థితి కూడా అంతే.చాలా సందర్భాల్లో స్థానిక సంస్థలు, నివాసిత సంఘాలు తమ ప్రాంతాల్లో భూసేకరణ జరగకుండా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చాయి. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను బాధ్యులను చేయాలని, జాతీయ సలహా కమిటీ చెప్పింది. అయితే భూముల కేటాయింపులో వసతి యోగ్యతకు సంబంధించి సరైన విధి విధానాలను కేంద్రం ప్రకటించకుండా కలెక్టర్ సమస్యను పరిష్కరించడం సాధ్యం కానే కాదు. మురికివాడలను వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడానికి ఎన్‌ఎస్‌ఎస్ గణాంకాలు దోహదపడతాయి. ఈ గణాంకాల ఆధారంగా ఉదాహరణకు మహారాష్టల్రో డెభ్భై శాతం మురికివాడలను నివాస యోగ్యంగా గుర్తింవచ్చు. మహారాష్ట్ర కాకుండా ఏ రాష్టమ్రైనా ఆర్‌ఏవై కింది ఉద్దేశించిన విధంగా కాకుండా తక్కువ మురికివాడలను గుర్తించి భూకేటాయింపులు నుండి తప్పించుకునే అవకాశం లేకుండా చేయవచ్చు. కొన్ని పట్టణాల్లో అరవై అయిదు శాతం అయితే ఇతర పట్టణాల్లో డెభ్భై అయిదునుండి ఎనభై శాతం వరకు మురికి వాడలను అభివృద్ధి చేయవచ్చు. కేంద్రంలో రాష్ట్రంలో దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించకపోతే స్థానిక యంత్రాంగం మురికివాడలను ఇరవై అయిదు శాతంనుండి ముప్పై శాతం మాత్రమే అభివృద్ధికి వీలైనవని చెప్పి చేతులు దులుపుకునే అవకాశముంది. సరైన మార్గదర్శకాలు లేకపోతే భూకేటాయింపు సమస్యలు పరిష్కరించలేకపోగా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమస్యను పరిష్కరిస్తే డెభ్భై అయిదు శాతం మురికివాడలను అభివృద్ధి పరచవచ్చు. స్థానిక సంస్థలు తమ లాభం కోసం సదరు భూములను కైంకర్యం చేయకుండా మరీ ముఖ్యంగా ఆ భూములను వాణిజ్య ప్రయోజనాలకు వ్యాపారుల పరం చేయకుండా నిరోధించాల్సి వుంది. భూముల లభ్యత, కేటాయింపు ఒకరకమైన ప్రశ్నలు లేవనెత్తగా గృహ లబ్ధిదారుల గుర్తింపు మరో ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. దీంట్లో లబ్ధిదారుల గుర్తిం పు కీలకమైన అంశం. ఎవరిని అర్హులుగా గుర్తించి నిర్ధారించాలో, కొన్ని పౌర సంఘాలు ఏ ప్రాతిపదికా లేకుండా మురికివాడల్లో నివసించే వారందరికీ ఇళ్లు కేటాయింపునకు అర్హులుగా గుర్తించాలనే డిమాండ్ చేస్తున్నాయి.
మురికివాడల్లో శక్తివంతమైన భూ మాఫియా తిష్టవేసింది. అర్హుల గుర్తింపునకు ఏదైనా ప్రాతిపదికతో ఒక ప్రభుత్వ ఏజెన్సీకి ఇచ్చి వోటరుకార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు వంటి గుర్తింపు పత్రాలను తప్పనిసరి చేస్తే ఈ పథకం అమలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మురికివాడల్లో ప్రజలకు దశాబ్దాలుగా ఇవి అందుబాటులో లేవు. దీనికి సంబంధించి 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై మున్సిపల్ తోడ్పాటుతో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్‌సెంటర్ (స్పార్క్) ప్రశంసనీయమైన విధి నిర్వహించింది. మురికివాడల నివాసితుల గుర్తింపునకు పదహారునుండి పదిహేడు గుర్తింపు పత్రాలను ఏర్చి పరిశీలనకు తగినవిగా పేర్కొంది. ఇవేవీ లేకున్నా ఇరవై మంది నివాసితులు ఒక కుటుంబాన్ని ఆ ప్రదేశంలో కొంతకాలంగా నివసిస్తున్నట్టు ధృవీకరించినా వారిని అర్హులుగా గుర్తించవచ్చు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, పౌర సంఘాల ప్రతినిధులు నిర్వహించిన సర్వే ఫలితంగా నిర్ధారణ సాధ్యమైంది. అర్హులను గుర్తించడానికి కొన్ని నిబంధనలు సడలింపు అవసరం.

-గుండు రమణయ్యగౌడ్