సబ్ ఫీచర్

ఆస్తుల ప్రకటనలో ఐఎఎస్‌ల వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క ష్ట్ఫేలి’ అన్న నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా ఐఎఎస్ అధికారుల (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)ను చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడి, ఇష్టంతో చదివితే గాని ఐ.ఎ.ఎస్.కు ఎవరూ ఎంపిక అవ్వరు. ఒక్కసారి ఐ.ఎ.ఎస్.కు ఎంపికైతే చాలు, వారు పదవీ విరమణ చేసేంతవరకు విస్తృత అధికారాలతో పాటు రాజభోగాలు అనుభవించవచ్చు. మన దేశంలో ‘ఐ.ఎ.ఎస్.’ అనే మూడు అక్షరాలు అత్యంత శక్తివంతమైనవి. యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేది వీరే. ప్రభుత్వం ప్రవేశపెట్టే చట్టాలు, పథకాల రూపకల్పన, వాటి అమలులో వీరే కీలక పాత్ర వహిస్తారు. అటువంటి మహోన్నతమైన ఐ.ఎ.ఎస్. అధికార గణం గాడి తప్పుతోందా? అనే సందేహం నేడు పలువురికి కలుగుతోంది. కొద్దిమంది అధికారుల కారణంగా ఈ రకమైన అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల అవినీతి, అక్రమాలపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.
అవినీతి నిర్మూలన కోసం ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్ని ఉద్యమాలు జరిగినా అవినీతి వటవృక్షంలా విస్తరిస్తూనే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం అత్యంత కీలకమైనది. ఈ కార్యనిర్వాహక వర్గానికి పథ నిర్దేశం చేసేది ఐ.ఎ.ఎస్. అధికారులే. వీరు ఎంత నీతి, నిజాయితీలతో పనిచేస్తే ప్రభుత్వ యంత్రాంగం అంత సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రజాప్రతినిధులతో అత్యంత సన్నిహితంగా మెలిగేది కూడ వీరే. ‘ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు’ అన్న మాటలు కొందరు ఐ.ఎ.ఎస్. అధికారుల విషయంలో నిజమవుతున్నది. దేశంలో రాజకీయ అవినీతి ప్రబలిపోయిందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఐ.ఎ.ఎస్.లు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండటంతో కొందరు ఉన్నతాధికారులకు సైతం అవినీతి జాడ్యం పట్టుకొందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన ఐ.ఎ.ఎస్. అధికారులే సదరు నిబంధనలను పాటించక పోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం- దేశంలో ఆస్తులు ప్రకటించని ఐ.ఎ.ఎస్. అధికారులు 37 శాతం ఉండటమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న ఐ.ఎ.ఎస్. అధికారులు అందరూ తమ ఆస్తుల వివరాలను విధిగా ప్రభుత్వానికి అందజేయాలి. ఈ నిబంనధన 2010 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిబంధనకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది కూడ ఐ.ఎ.ఎస్. అధికారులే కావడం గమనార్హం. తాము రూపొందించిన నిబంధనలను తాము అనుసరించాల్సిన అవసరం లేదని కొందరు అధికారులు భావిస్తున్నట్లు ఉంది.
దేశవ్యాప్తంగా మంజూరైన ఐ.ఎ.ఎస్. పోస్టులు మొత్తం 6500. కాగా, ప్రస్తుతం 5004 మంది పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన వ్యవహారాలను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్’ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన ఒక నివేదికలో 2010 నుంచి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందచేయని ఐ.ఎ.ఎస్. అధికారుల వివరాలను అందచేసింది.
ఈ నివేదిక ప్రకారం తమ స్థిర, చరాస్తుల వివరాలను అందచేయని ఐ.ఎ.ఎస్.ల సంఖ్య ఈ విధంగా ఉంది. 2010లో 2,418మంది, 2011లో 2,015 మంది, 2012లో 1,764 మంది, 2013లో 1,527 మంది, 2016లో 1,856 మంది వారి ఆదాయ వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం ప్రకటించలేదు. రాష్ట్రాల వారీగా చూస్తే ఆస్తుల వివరాలు అందచేయని ఐ.ఎ.ఎస్.లు అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. రాజస్థాన్‌లో 153 మంది, మధ్యప్రదేశ్‌లో 118 మంది, పశ్చిమ బెంగాల్‌లో 109 మంది, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 104 మంది, కర్నాటకలో 82 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 81 మంది, తమిళనాడులో 50 మంది, కేరళలో 38 మంది, తెలంగాణలో 26మంది ఉన్నారు. తమ అక్రమ సంపాదన విషయం బయటపడుతుందన్న భయంతోనే కొందరు ఐ.ఎ.ఎస్.లు తమ ఆస్తుల వివరాలు ప్రకటించడానికి వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఐ.ఎ.ఎస్. అధికారులు నిబంధనలను పాటించి ఆస్తిపాస్తుల వివరాలు ప్రకటిస్తే అవినీతిపై పోరాటానికి వారు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు.

- పి.్భర్గవరామ్