సబ్ ఫీచర్

హరిత ప్రియులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవల్లిక, మాధవ, నిఖిల్..హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురూ పర్యావరణ ప్రియులు. సినిమాలు, షికార్లు, చాటింగ్‌లతో కాలం వెళ్లబుచ్చకుండా విలువైన సమయాన్ని మొక్కల పెంపకానికి వెచ్చిస్తున్నారు. ‘లోకక్షేమం’ ఫౌండేషన్‌లో వలంటీర్లయిన ఈ ముగ్గురు చేస్తున్న చిరు ప్రయత్నానికి వేలాది మొక్కలు చిగురిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణకు హరితహారం వేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నాటించిన మొక్కలను సంరక్షించేవారే కరువయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా తారలంతా మొక్కబడిగా మొక్కలు నాటి వెళ్లిపోయారు. ఆ తరువాత అవి ఎలా ఉన్నాయో చూసేవారే లేరు. నీళ్లు లేక రోడ్లు, వీధుల వెంట వేలాడుతున్న ఈ మొక్కలను బతికించేందుకు వీరు పడిన తాపత్రయం వల్ల నేడు చిగురులు అద్దుకుంటున్నాయి. మొక్క దశలో ఉన్నపుడు వాటికి నీటిని అందించాలి. వాటంతట అవే పెరగవు. అందుకే ఈ ముగ్గురు హరితాహారంలో నాటిన మొక్కలను బతికించాలని సంకల్పించారు. వర్షాలు కురిసే సమయానికి అవసరమైతే యూరియాను సైతం అందించటానికి సిద్ధమవుతున్నారు. మొక్కలకు నీళ్లు పోయాలంటే సమయాన్నయితే వెచ్చించగలం. కాని ఎంతో కొంత వ్యయం అవుతుంది. దీనికోసం ఈ ముగ్గురూ తాము వలంటీర్లగా పనిచేస్తున్న ‘లోకక్షేమం’ ఫౌండేషన్ సహకారంతో 2016 నవంబర్‌లో తమ పనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ‘మొక్క ల సంరక్షకులు’అని పేరు పెట్టారు. దీని కోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పుడమి తల్లి కోసం రోజుకు రెండు రూపాయలు చొప్పున సంవత్సరానికి రూ.750లు అందజేస్తే చాలు ప్రతి దాత కూడా ఓ మొక్క సంరక్షకుడిగా మారి పుడమితల్లికి పచ్చదనాన్ని అద్దవచ్చంటారు. మాకొచ్చిన ఈ చిన్ని ఐడియా వల్ల హైదరాబాద్ నగరంలో నాటిన వేలాది మొక్కలను సంరక్షించగలమనే నమ్మకం ఉందంటున్నారు. ఈ పథకానికి రూపకర్త తల్లూరి నిఖిల్ అయితే సిఎ చేస్తున్న మాధవ ఆర్థిక వనరులు సమకూర్చే పనికి చేయూతనందిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన దాతలందరికీ అర్థ సంవత్సరం బాలెన్స్ షీట్ అందిస్తారు. ఇక ప్రవల్లిక తాము చేసే ప్రాజెక్టు పనులకు సంబంధించిన వీడియోలు తీసి ఇతర వలంటీర్లకు చూపించి మరింత మందిని ఈ పనిలో మమేకం చేసే విధంగా అడుగులు వేస్తుంది. వేలాది మొక్కలను సంరక్షించటం అంటే మాటలు కాదు. ఎలా వలంటర్లీను కూడగడతారని అడిగితే సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిదేది ఉండదంటారు. యువతీ యువకులతో ఓ టీమ్‌ను ఏర్పాటుచేసుకుని ముందుకు సాగుతామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు మాకు చేయుతతో పాటు ఆశీస్సులను అందించేందుకు సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ అయిన ఉద్యోగులు వస్తే ఆహ్వానం పలుకుతామని అంటున్నారు. భావితరాలకు నిండు పచ్చదనాన్ని అందించేందుకు ఈ ముగ్గురు చేసే చిరు ప్రయత్నం మరింతమందికి స్ఫూర్తినిస్తే పుడమి తల్లి పులకరించక తప్పదు.