సబ్ ఫీచర్

మీరాభక్తి.. ఆధ్యాత్మిక శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ భగవానుడిపై మీరా భక్త్భివం అజరామరం. అలాంటి భక్తురాలిపై నృత్యనాటకం ప్రదర్శించటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అంటారు ప్రఖ్యాత నృత్యకారిణి చిత్రా విశే్వశ్వరన్. మీరా భక్తితత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ కళాకారిణిని మీరాభాయి పాత్ర చిన్ననాడే కదిలించిందని చెప్పవచ్చు. దక్షిణ భారత హిందీ విద్యార్థినిగా విశే్వశ్వరన్ మీరాభాయి భక్తి పాటలను, కవితలను, పద్యాలను చదవటంతో ఈ పాత్రను ఆమెను కదలించింది. స్వామి దయానంద సరస్వతి సేవాసంస్థ మీరాభాయి నృత్యనాటకాన్ని రూపొందించమని కోరటమే ఆలస్యం ఆ పాత్రకు విశే్వశ్వరన్ ప్రాణం పోశారు. ముంబయికి చెందిన సంగీత దర్శకురాలు జయశ్రీతో కలిసి ఈ నృత్య నాటకాన్ని రూపొందించినట్లు విశే్వశ్వరన్ చెబుతున్నారు. మీరా నృత్యనాటకం దేశ విదేశాల్లో ఎంతోమందిని ఉర్రూతులూగిస్తుందని అంటారు. మా ఇద్దరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక మజిలీ వంటిందని పేర్కొంటూ మీరా సబ్జెక్టు పాతదైనప్పటికీ నేటికీ కొత్తదనాన్ని సంతరించుకునేటట్లు ఒకరి సంగీతం, మరొకరి నృత్యాభినయం కలిసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూపొందించటం జరిగింది. చిత్రా విశే్వశ్వరన్ దృష్టిలో సంగీతం, నృత్యాభినయానికి భాషా సరిహద్దులు లేవని అంటారు. ఇప్పటి వరకు ఈ నృత్య నాటకం అమెరికా, బ్రిటన్ దేశాలలో 18 ప్రదర్శనలు ఇచ్చామని అన్నారు.
చైత్యన్య స్ఫూర్తి..
రాజ కుటుంబంలో పుట్టిన మీరా భోగభాగ్యాలను వదలి ఆమె ప్రయాణం ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగిందని, రాజవంశంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. అత్తింటివారి రాచరికం ఆమెను సంతోపపెట్టలేదు. కేవలం కృష్ణుని నామస్మరణే ఆమెలో చైతన్యం తీసుకువచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త వస్తువులు పట్ల యువత ఆకర్షితులవుతున్న తరుణంలో మీరా వంటి భక్తితత్వాన్ని అనుసరించటం దుర్లభమని విశే్వశ్వరన్ అభిప్రాయం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మీరా సంగీత, నత్య, ధియేటర్ కళాకారులకు ఆమె పాత్ర అనుసరణీయమని విశే్వశ్వరన్ అభిప్రాయం. ఆధునిక నృత్యకారులు బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నారు. వారే నృత్య, సంగీత, స్కిృప్ట్ రైటింగ్ వంటివి అన్నీ ఒక్కరే చేస్తున్నారు. కాని ఈ విద్యలన్నీ వారు గురువు ద్వారా పొందటం లేదు. చాలామంది ఇంటర్నెట్ పరిజ్ఞానంపై ఆధారపడుతున్నారు. గురువు ద్వారా పొందిన విజ్ఞానం ఆత్మానందాన్ని కలిగిస్తుందంటారామె. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల చేసిన నృత్య ప్రదర్శనలు మధురానుభూతిని మిగిల్చాయని అంటారు.