Others

అరుదైన గౌరవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇన్నాళ్లకు భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ఐటిఎల్‌ఒఎస్)లో తొలిసారి ఓ భారతీయ మహిళ జడ్జిగా నియమితురాలైంది. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఆమే డాక్టర్ నీరుచదా. విజయలక్ష్మి పండిట్ తరువాత ఇలాంటి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా నీరుచదా చరిత్రపుటల్లోకి ఎక్కారు. మహిళల హక్కులు కోసం తన విజ్ఞానాన్ని, గళాన్ని వినిపించే నీరుచదా తన డాక్టరేట్ పట్టా కూడా మహిళల సమానత్వ అవకాశాలపైనే పరిశోధన చేసి పొందటం గమనార్హం. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళలకు మంచికంటే చెడే ఎక్కువుగా జరుగుతోందని విశ్వసించే ఆమె మహిళల హక్కుల కోసం గొంతెత్తారు. మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు ఇస్తే సమానంగా ప్రతిభ చూపగలరని ఆమె విశ్వసిస్తుంటారు. అలాగే అతివలకు న్యాయపరమైన, సాంస్కృతికపరమైన ఆటంకాలను తొలగిస్తే అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటారని నీరుచదా నొక్కివక్కాణిస్తున్నారు. ఢిల్లీలోని మిచిగన్ యూనివర్శిటీలో లా పట్టా తీసుకున్న నీరుచదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు. మనదేశానికి చెందిన విదేశీ న్యాయ వ్యవహారాలను ఆమె ఎంతో నైపుణ్యంతో చక్కదిద్దారు. 2012లో కేరళలో ఇద్దరు ఇటాలియన్ల చేతిలో కాల్చి చంపబడిన మత్స్య కార్మికుల కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం తరుపున వాదించారు. ఒక్క భారతదేశానికే కాదు దక్షిణాసియాకే లీగల్ అడ్వజరీగా తన సేవలు అందించారు.