సబ్ ఫీచర్

మట్టి పాత్రల మర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం అంటే లోహపాత్రల వాడకం వాడుకలోకి రాకముందు ప్రపంచమంతా మట్టిపాత్రలనే వంట పాత్రలుగా వాడేవారు. ఇప్పుడైతే మట్టిపాత్రలంటే చులకనభావం ఉండొచ్చు ఏమో కానీ, వాస్తవానికి మట్టిపాత్రలలో వంటకాలు తయారుచేయడం మంచి ఆరోగ్యానికి మహాద్వారం లాంటిదని ఆరోగ్య పర్యవేక్షకుల సలహా.
ఇపుడిప్పుడే కొన్ని నగరాలలో కొందరు మట్టిపాత్రల వాడకం పట్ల ఆసక్తి చూపుతుండటం విశేషం. మంచి ఎక్కడున్నా గ్రహించే తత్త్వం ఉన్నవారికి మట్టిపాత్రలలో ఆరోగ్యం గురించి తెలిసే ఉంటుంది.
అసలు కొన్ని రకాల కూరలను మట్టి కుండలలో ఉడికిస్తే సహజ రుచి పెరిగిపోయి ఆ వంటకం కమ్మగా ఉంటుందన్నది వీరి నమ్మకం. మట్టిపాత్రలు విరివిగా వాడుకలో ఉన్న కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం అన్నమాట, చేపల పులుసు స్పెషల్ వంటకంగా తయారుచేసేవారట. మట్టి కుండలలో స్టీమ్ చేయడంవలన పోషకాలలో కూడిన రుచి అదనంగా చేరుతుందని, ఆ రుచి అమృతంలా వుంటుందని చెప్పుకునేవారు.
మట్టి పాత్రలలో పదార్థాలను ఉడికించటం వలన అదనపు ఫ్యాట్ వుండదు. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిల్ని మెయిన్‌టెయిన్ చేసే వీలుంటుంది.
ఆహారాన్ని మట్టి పాత్రల్లో స్టోర్ చెయ్యడం వలన ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం ఉండదు. వేడి, చల్లని వాతావరణంలో సైతం ఇన్సులేటర్లుగా ఈ మట్టి పాత్రలు పనిచేస్తాయి.
మట్టి పాత్రల్లో పదార్థాలు నెమ్మదిగా రోస్ట్ అవుతాయి కాబట్టి పోషకాలని, ఫ్లేవర్‌ని ఏ సమయంలోనైనా సమృద్ధిగా పొందవచ్చు.
అదనపు నీరు ఉడికించే సమయంలో డ్రెయిన్ అవుతుంది. దీనివల్ల అసలు ఆహారాన్ని మెయిన్‌టెయిన్ చెయ్యడానికి కుదురుతుంది. మట్టికుండలో తోడుపెట్టిన పెరుగు కేకులాగా చాలా గట్టిగా ఉంటుంది. మట్టిపాత్రల్లో పలు వంటలు చేయడంవల్ల కావాల్సిన పోషకాలు దక్కుతాయి. పరిశుభ్రత పాటించే వీలుంటుంది.
మట్టితో గ్లేర్డ్, అన్‌గ్లేర్డ్ పాత్రలు రెండూ తయారవుతాయి. పాతకాలానివి అడుగు భాగంలో మాత్రమే గ్లేజ్ అవుతూ క్లీనింగ్‌కు సులువుగా ఉండేవి. అయితే అన్‌గ్లేర్డ్ పాత్రల్ని ఎక్కువ లిక్విడ్‌లో నానబెడితే రంధ్రాల నుంచి ఎక్కువ స్టీమ్ ఉత్పత్తి చేసేవి, మాంసం వంటివి త్వరగా ఉడుకుతాయి.
మొదటిగా మట్టిపాత్రల్ని కొన్న తర్వాత నీళ్ళల్లో నానబెట్టాలి. నీటిని ప్రతిరోజూ మార్చాలి. ఇలా మూడు లేదా నాలుగు రోజులపాటు చెయ్యాలి.
మట్టిపాత్రలో వండే తొలి ఆహారం అన్నం అయితే మంచిది. బియ్యం కడిగిన నీటిని ఉంచుకుంటే తదుపరి అన్నం ఉడికించిన తర్వాత పాత్రను ఆ నీటితో కడగటానికి ఉపయోగించవచ్చు.
మట్టిపాత్రలో ఆహారాన్ని తక్కువ సెగపై ఉడికించాలి. దీనివలన మాడిపోవటం, పాత్రలు గీతలు పడటం, పగిలిపోవటం లాంటివి జరగవు.
మట్టిపాత్రలలో పదార్థాలను కలియబెట్టడానికి ఉడెన్ స్పూన్లు లేదా స్పాటు లాలను మాత్రమే వాడాలి. లోహపు గరిటెను వాడకూడదు. వీటివలన మట్టిపాత్రలు పగులబారే అవకాశాలు ఉంటాయి.
పాత్రల వాడకం చాలా జాగ్రత్తగా హాండిల్ చేయగలగాలి. ఇది అనుభవంమీద అలవడుతుంది. ఒకసారి ఆ వంటకాలను రుచి చూస్తే కానీ మట్టిపాత్రల మర్మమేమిటో వంటబట్టదు. ట్రై టు ట్రై.

- హిమజారమణ