సబ్ ఫీచర్

అవినీతి ‘్భ’కంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల పేర్లు దేశమంతా మార్మోగుతున్నాయి. భూ కుంభకోణాలతో ఆంధ్ర, తెలంగాణ ‘చంద్రులు’ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏ పిలో అయితే ‘ఈ కీర్తి ప్రతిష్ఠలు’ దిల్లీదాకా వెళ్లాయని రెండు రాష్ట్రాల మీడియా రాజగురువులుంగారే సెలవిచ్చా రు! తెలంగాణ కూడా అందుకు మినహాయింపు కాదు. కా కపోతే ఆ విషయాలు పేపర్లో రాస్తే మళ్లీ రాజగురువుల వారికి తెలంగాణలో తెరువుండదు. ‘బాబు’ ఎంతైనా ‘మనవాడే’ కాబట్టి ఏమన్నా పట్టించుకోరు. ఏపిలో అవినీతికి కిందిస్థాయికి విస్తరిస్తే, తెలంగాణలో నలుగురికే పరిమితమైందన్నది నిష్ఠుర నిజం.
విపక్షంలో ఉన్నప్పుడు వెలుగుచూసిన ప్రతి కుంభకోణంపైనా సీబీఐ దర్యాప్తు డిమాండు చేసిన నేటి పాలక పార్టీలు- నేడు ‘సీబీఐ డిమాండు’ అన్న మాట వినిపిస్తేనే హడలిపోతున్నాయి. తెలంగాణలో మియాపూర్ భూ ములు, ఎంపిల అక్రమ భూ కొనుగోళ్లు, ఏపీలో విశాఖ భూముల్లో జరిగిన గోల్‌మాల్ వంటివి ఇద్దరు చంద్రుల ప్రతిష్ఠకూ కచ్చితంగా మచ్చనే. రానున్న రెండేళ్లలో ఎన్నికలు ఉంచుకుని ఇలాంటి అవినీతి మకిలి అంటించుకోవడం వల్ల, తటస్థులు-విద్యావంతులకు రెం డు పార్టీలూ దూరమవటం ఖాయం. ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు అవి ఇచ్చే ‘ప్రకటనల తాయిలాల’కు లొంగిపోయి నిజాలను వెలుగులోకి తీసుకురాకపోవచ్చు. లేదా తామే రాజగురువులయిండి, తమ శిష్యులను ఇరుకున పెట్టడం వారి మార్గదర్శకత్వానికి ఇబ్బంది కావచ్చు. లేదా రెండు ప్రభుత్వాల నుంచి కారుచౌకగా సర్కారు భూములు, అప్పనంగా ప్రసార-ప్రచార హ క్కులు తీసుకున్న మొహమాటంతో.. ఇద్దరు ‘చంద్రులు’ తప్ప మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముద్దాయిలేనన్న ముసుగుతో ప్రజల దృష్టి పథం నుంచి ముఖ్యమంత్రులను రక్షించే ప్రయత్నాలు చేయవచ్చు.
కానీ, ఇంకా అంతోఇంతో ధైర్యం ఉన్న మీడియా సంస్థలు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న నిజాలను అడ్డుకోవడం పాలకులకు సాధ్యమయ్యే పనికాదు. సోషల్ మీడియా చుట్టూ పరిభ్రమించేవాళ్లంతా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసేంత పనిమంతులేమీ కాదు. నిజానికి ఇలాంటి వర్గం ఉపన్యాసాలు, చర్చలు, రాతలు, వివిధ మాధ్యమాల్లో చర్చలకు పరిమితమవుతారే తప్ప, అవన్నీ ఆచరణలో చూపించడానికి ముందుకురాని బద్ధకస్తులు. కానీ, ఈ వర్గం ఇతరులను ప్రభావితం చేయడంలో ముందుంటుంది. మరొకరిని చెడగొట్టేందుకు అక్కరకొస్తుంది. కొత్త ఆలోచనలు రేకెత్తించి ఎవరో ఒకరి పుట్టిముంచడం వరకూ పనికొస్తుంది. ఆ విషయాన్ని నేతలు గ్రహిస్తే మంచిది! ప్రజలు అన్నీ వింటున్నందున వారు అమాయకులనుకుంటే అది భ్రమే. ఇక్కడో వి షయం నిజాయితీగా చర్చించుకోవడం నైతిక బాధ్యత కూడా! జనం కూడా అవినితిపరులై చాలాకాలమైంది. డబ్బులివ్వనిదే పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లబోమని భీష్మించిన గ్రామస్థుల వైనం మీడియాలో చూసి తరించాం. ఇక ‘ఓటుకు నోటు’ తీసుకునే వా రికి అవినీతి గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఆ ధైర్యమే ఇప్పుడు పాలకుల, పార్టీల బరితెగింపు, విచ్చలవిడి అవినీతికి కారణమవుతోంది. ఎన్నికల్లో జనాలకు ఇవ్వాలి కాబట్టి డబ్బు సంపాదించాలని రాజకీయ పార్టీలు, ఆ వాదనతో అడ్డంగా బుకాయించినా ఇవన్నీ గమనించే తటస్థులు, విద్యావంతుల వర్గమంటూ ఒకటుంటుంది. అదిగో.. ఆ వర్గమే ఎవరి కొంపైనా ముంచేది! వైఎస్,చంద్రబాబుల పోరులో ఒక్క శాతం తేడాతోనే వైఎస్ అధికారంలోకొచ్చారు. మొన్న ఐదున్నరలక్షల ఓట్ల తేడాతోనే బాబు బయటపడేందుకు ఈ తటస్థ-విద్యావంతుల వర్గమే కారణమని మర్చిపోతే ఎవరి పతనం వారు స్వాగతించినట్లే లెక్క!
ఇక విశాఖ భూ కుంభకోణాలు చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఏపిలో ప్రజాప్రతినిధులు అధికారులపై ఇష్టారీతిన దౌర్జన్యాలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అడ్డగోలు దోపిడీ కనిపిస్తోంది. కోరుకున్న కంపెనీలకే అన్ని ప్రాజెక్టులూ దక్కుతున్న వైనం దాచినా దాగనిది. ఎమ్మెల్యేలు, వారి బంధుగణాలు దోచుకుంటుంటే, కిందిస్థాయి అధికారులు కూడా వారితో పోటీలు పడి మేస్తున్నారు. ఇవన్నీ మొత్తంగా ప్రభుత్వంపై అవినీతి ముద్రకు కారణమయ్యేవే! విశాఖ భూముల్లో అవినీతి, రికార్డుల ట్యాంపరింగ్ ఇప్పటిది కాదు. కాంగ్రెస్ హయాం నుంచీ ఉన్నదే. అయితే, బాబు వస్తే అలాంటి అరాచాలకు తెరదించుతారన్న ఆశతోనే ప్రజలు ఆ పార్టీని గద్దెనిక్కిస్తే, ఇప్పుడూ అదే జరుగుతోంది. మరి మార్పు ఎక్కడ? అప్పుడు కాంగ్రెస్‌లో సూత్రధారులు, పాత్రధారులంతా ఇప్పు డు టిడిపిలో చేరి ప్రభుత్వంలో ఉన్నారు. పార్టీలు మారాయే త ప్ప ముఖాలు అవే!
విశాఖలో భూ దందాలపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నది విపక్షం కాదు, అధికార పక్షమే. మంత్రి అయ్యన్న భూ దందాలపై గళం విప్పడం, ఆ పార్టీకి మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా అక్రమాలపై ఎలుగెత్తడం ఒక్కటి చాలు.. విశాఖలో ‘్భ’చోళ్లున్నారని చెప్పడానికి! సరికొత్త అసెంబ్లీ భవనంలో జగన్ చాంబరుకు చిల్లు పడితేనే సీఐడిని పురమాయించిన ప్రభుత్వం, విశాఖలో మేల్కొని ‘సిట్’ వేయడం విమర్శలకు అర్హమైనవే. కేవలం కొంతమంది తాసీల్దార్లు,చిన్న స్థాయి అధికారులపై వేటు వేసి చేతులు దులిపేసుకుని అందరి దృష్టి పక్కకు మళ్లించవచ్చన్నది భ్రమ. పెద్దగద్దల సాయం లే కుండా చిన్నచేపలు వేల కోట్లు దిగమింగాయంటే నమ్మటానికి ప్రజలేమీ వెర్రిబాగులవాళ్లేమీ కాదు.
సీబీఐ, సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని ‘మిస్టర్ క్లీన్’ గా చెప్పుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎంకు లేఖ రాసి, బంతిని బాబు కోర్టుకు నెట్టేసి నిశ్చింతగా ఉన్నారు. అసలు ఆ కుంభకోణాన్ని బయటపెట్టిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా అదే డిమాండ్ చేయడం, వైసీపీ కూడా సీబీఐ దర్యాప్తే సరైనదని వాదించడం బట్టి.. విశాఖలో భూ దందా అనుమానాలను ధ్రువీకరించడమే. మరి స్వపక్షం, విపక్షం, మిత్రపక్షమంతా ఏకమై సీబీఐ విచారణ కావాలంటే ప్రభుత్వం వెనుకంజ వేయడం అనవసర అనుమానాలకు ఊపిరిపోసినట్లే. ప్రభుత్వంలోని పెద్ద-చిన్న నేతల పాత్ర లేనప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నదే అందరి సందేహం! ఇదేదో ఇద్దరు మంత్రుల మధ్య అధిపత్య పోరు అన్న ముసుగేస్తే జనం అదే నిజమని నమ్ముతారనుకోవడం భ్రమ. ముందు బహిరంగ విచారణ అని చెప్పి, తర్వాత ‘సిట్’ అంటే పాలకులే తత్తరపాటుకు గురవుతున్నారన్న సంకేతాలివ్వడమే కదా? సీబీఐ విచారణకు ఆదేశించడం వల్ల బాబు ప్రతిష్ఠ పెరుగుతుందే తప్ప తరగదు. ఏమీ లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని ఉండదు కదా? అటు కేసీఆర్ పాలనలో జరుగుతున్న భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ కావాలని తెలంగాణ టిడిపి నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తుంటే, అదే పనిని ఆ పార్టీ నేతలు ఏపిలో చేసి ఆదర్శంగా నిలవచ్చుకదా? బాబు వస్తే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాం గ్రెస్ మాదిరిగా భూకబ్జాలు, కిరాతకాలు జరగకుండా ఆయన అనుభవం అక్కరకొస్తుందన్న నమ్మకంతోనే కదా జనం జగన్ వైపు ఆకర్షితులైనా, ఆయనను కాదని బాబుకు పట్టం కట్టింది? ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కంటే భిన్నంగా లేకపోగా, అంతకుమించి దారుణంగా ఉన్నాయని భావిస్తే ప్రత్యామ్నాయం వెతుక్కునేందుకు ప్రజలకు పెద్దగా సమయం పట్టదని గ్రహించాలి.
తెలంగాణలో కేసీఆర్ జమానాలో జరుగుతున్న భూ కుంభకోణాలు కూడా ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేవే. ఇప్పటివరకూ బయటివారికి తెలంగాణలో అవినీతి లేదు. కేవలం ‘ఆ నలుగురే’ సర్వం నడుపుతున్నారన్న ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు వేల కోట్ల రూపాయల భూ కుంభకోణాలు, నిందితులను ‘ప్రగతి భవనే’ కాపాడుతోందన్న ఆరోపణలు కేసీఆర్ ప్రతిష్ఠకు మచ్చనే. ఆరోపణలు చేసిన వారిపై ఎదురుదాడి చేసి నోరుమూయించినా, ప్రజలు కళ్లు మూసుకుంటారనుకోవడం భ్రమ. నిందితులు ఉపయోగించే కార్లు ఎక్కడెక్కడికి వెళుతున్నాయో రేవంత్‌రెడ్డి నెంబర్లతో సహా చెప్పినా ఉలుకు పలుకు లేదు.
నిజంగా భూ దందాలో ఏమీ లేకపోతే సీబీఐ విచారణకు వెరపెందుకు? గోల్ట్‌స్టోన్ ప్రసాద్ రచించిన ‘్భ’ కైలాస్‌లో ఏ పాత్ర లేకపోతే సీబీఐని పిలవచ్చుకదా? ఉద్యమ సమయం నుంచీ ఇప్పటివరకూ ప్రసాద్ చేసిన ‘దిల్లీ సేవ’లకు ప్రతిఫలంగానే ఆయనను కాపాడుతున్నా రా? పేరుకు ఆంధ్రుడైనా ఉద్యమ సమయంలో మీడియా పెద్దలతో కలసి ఉద్యమానికి ఊతమిచ్చి, రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ‘్భం’దాం చేద్దామనుకున్న నిందితుల కల బంగారు తెలంగాణలో సాకారమైంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామన్న ‘ఇద్దరు చంద్రులు’ ఇప్పుడెందుకు ఆ పనిచేయడం లేదు? చేయకపోగా ఆ అవినీతిపరులకే కొత్త ముసుగేసి పనులు ఎందుకు ఇస్తున్నారు? ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, వాకాటిని బాబు సస్పెండ్ చేస్తే.. అదే పని మహమూద్, డి.శ్రీనివాస్, కేకే విషయంలో కేసీఆర్ ఎందుకు చేయడం లేదు? *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144