సబ్ ఫీచర్

సెలబ్రిటీస్‌కు ఆదర్శం కోహ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’’ అనే నానుడిని అనుసరించడంలో మన సెలబ్రిటీలది అందెవేసిన చెయ్యి. ఏ రంగంలో అయినా తగిన గుర్తింపు రాగానే వారితో తమ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు రూపొందించి, అమ్మకాలను పెంచుకోవడం కోసం బహుళజాతి, కార్పొరేట్ సంస్థలు ప్రయత్నించడం సర్వసాధారణం. అందువల్లనే మన సెలబ్రిటీలు కూడా తాము నటిస్తున్న వ్యాపార ప్రకటనలు ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి అనే విషయం ఆలోంచరు. డబ్బులు ఇస్తే ఏ వ్యాపార ప్రకటనలలో అయినా వారు నటించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్న భారత క్రికెట్ రథసారథి విరాట్ కోహ్లి, మిగిలిన సెలబ్రిటీలకన్నా వ్యాపార క్రపటనలో నటించే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాంట్రాక్టులపై సెలబ్రిటీలు సంతకాలు చేసేముందు ఆ ప్రకటనల వలన ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందనే విషయానికి ఎటువంటి అపాధాన్యత ఇవ్వరు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శీతల పానీయాలు (బేవరైజ్డ్ డ్రింక్స్)కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దీని కారణంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శీతల పానీయాల విక్రయాలు పెరగడంలేదు. దీంతో శీతల పానీయాలు తయారుచేసే బహుళ జాతి కంపెనీలు, తమ అమ్మకాలను పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నిన్నమొన్నటివరకు విరాట్ కోహ్లి కూడా ఒక ప్రముఖ శీతల పానీయంకు సంబంధించిన వ్యాపార ప్రకటనలో నటించారు. ఆయనతో కుదుర్చుకొన్న ఒప్పందం గడుపు ఇటీవల పూర్తి అయింది. కాంట్రాక్ట్ పొడిగింపు కోసం శీతల పానీయం తయారీ సంస్థ విరాట్ కోహ్లిని ఇటీవల సంప్రదించింది. తాను శీతల పానీయం వ్యాపార ప్రకటనలో నటించనని ఖరాఖండీగా చెప్పారు. తాను శీతల పానీయాలు తాగనని, వ్యాపార ప్రకటనలో నటించడం ద్వారా ప్రజలను సదరు శీతల పానీయాలు త్రాగమని ఎలా చెబుతానంటూ ఆయన కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో ఖంగుతినడం వారి వంతు అయింది.
మన దేశంలో సౌందర్య సాధనాలు (వివిధ రకాల క్రీమ్‌లు, పౌడర్లు, సబ్బులు, నూనెలు)కు సంబంధించిన వ్యాపార ప్రకటనలలో మనకు అందరూ సెలబ్రిటీలే కనిపిస్తారు. మన దేశంలో సౌందర్య సాధనాల వ్యాపారం సాలీనా వేల కోట్ల రూపాయలల జరుగుతుంది. విరాట్ కోహ్లి మాదిరిగా మిగిలిన సెలబ్రిటీలు కూడా వ్యాపార ప్రకటనలలో నటించే సమయంలో సామాజిక బాధ్యతను గుర్తుతెచ్చుకుంటే, ప్రజలకు ఎంతో మేలు చేసినవారు అవుతారు. మన సెలబ్రిటీలు అందరూ విరాట్ కోహ్లిని వ్యాపార ప్రకటనలలో నటించే విషయంలో ఆదర్శంగా తీసుకొంటే, ప్రజలకు ఎంతో మేలు చేసినవారు అవుతారు.

- పి.్భర్గవరామ్