సబ్ ఫీచర్

విజయానికి ఐదు సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగుల నుంచి మంచి నైపుణ్యమైన పనిని ఆశించటం సహజం. ఏళ్ల తరబడి ఒకటే పని అని నిరుత్సాహపడుతుంటారు. ఇలాంటివారిని నైపుణ్యంగా తయారుచేయాలంటే ప్రేరణ కల్పించటం అవసరం. ప్రేరణ ఎవ్వరూ ఇవ్వరు. ఎవరికివారు సంపాదించటమే. ఇందుకు నిత్యం పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. సానుకూలదృక్పథంతో నడుచుకుంటే ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతారు. పని చేసే చోట ఇతర ఉద్యోగుల నుంచి ఆదరణ, అభిమానం చూరగొనాలంటే.. వృత్తిలో విజయపథంలో పయనించాలంటే ఐదు సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంది. అతివలు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో తమను తాము తీర్చిదిద్దుకోవాలంటే తప్పనిసరిగా వీటిని పాటస్తే మరింత రాణించగలరు. అవేమిటో తెలుసుకుందాం..
* మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించటం. ఇది కేవలంలో ఆహార్యంలోనే కనిపించటం కాదు. చక్కటి డ్రెస్స్ చేసుకున్నంత మాత్రాన రాదు. దీనితో పాటు తోటి ఉద్యోగులతో మాట్లాడే విధానంలో చక్కగా ఉండాలి. సౌమ్యత, స్పష్టత ఉండాలి. బాడీ లాంగ్వేజీ బాగుండాలి. మీరు మాట్లాడే భాష సరళంగానూ, అలాగే ముఖంలోని హావభావాలు కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టు ఉండాలి. ఇలా ఉండే మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాలలో తమదైన శైలిలో దూసుకుపోగలరు.
*ఎవ్వరు చెప్పినా శ్రద్ధగా వినటం. ఈ కళ మిమ్మల్ని పదిమందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. చేసే పని మీద శ్రద్ధ, దృష్టిపెట్టడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు పదిమందితో చర్చలు జరుగుతున్న సందర్భంలో మీరు శ్రద్ధగా వింటుంటే మీరు మరింత పనిలో నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి సహాయపడుతుంది.
*వృత్తిలో మీరు మాట్లాడే పదజాలాన్ని ఎప్పటికప్పుడు సమీక్షచేసుకోండి. మాట్లాడేటపుడు కొత్త పదజాలాన్ని ఉపయోగించటానికి నిత్యం ప్రయత్నించండి. నాలెడ్జ్‌ను పెంపొందించుకోవటానికి సదా తీవ్రంగా కృషిచేయండి. మీరు ఏ భాషలో మాట్లాడతారో అందులో కనీసం రోజుకు ఐదు కొత్త పదాలు నేర్చుకోవటానకి ప్రయత్నించండి. పదాలు, వాటి అర్థాలు తెలుసుకుని మాట్లాడండి. ఇందుకోసం వీలైనంత ఎక్కువ సమయం చదవండి.
*శరీర సంజ్ఞలను గ్రహించండి. నయనానందకరం అని ఊరికే అనలేదు. కళ్లతో మాట్లాడే భాష మిమ్మల్ని అందరూ గౌరవించేలా చేస్తుంది. కళ్లతో మాట్లాడే భాషతోనే ఎంతోమందిని మీకు దగ్గర చేస్తుంది. అలాగే కరచాలనం కూడా దూరమైన బంధాన్ని దగ్గర చేస్తుంది.
*వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎంతమేరకు కావాలో ఆమేరకే సమకూర్చుకోండి. ఆశగా..ఆబగా అంతా నాకే దక్కాలని భావించవద్దు. జీవితంలో అధికంగా ఏది ఉన్నా అది విషంతో సమానం అని స్వామి వివేకానంద చెప్పినట్లు ఏమేరకు అవసరమో ఆమేరకే తీసుకుంటే తోటి ఉద్యోగులు కూడా మీతో పాటు సమానంగా రాణించటానికి మీరు దోహదం చేసినవారవుతారు. అపుడే అందరిలో మీరు ప్రత్యేకంగా రాణించగలరు.