సబ్ ఫీచర్

రుణమాఫీలో యుపి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి పని చేయడానికైనా దీక్ష వహిస్తే ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని నిరూపించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి మేలు చేయాలన్నా, అది అమలు సాధ్యం కాదని తడుముకోకుండా చెప్పడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. వ్యవసాయ రుణాల మాఫీ విషయానికి వస్తే బ్యాంకు యాజమాన్యాలు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇటువంటి పరిస్థితులలో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వైపు చూడకుండా, తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వ్యవసాయ రుణ మాఫీ హామీని అమలు చేయడానికి ఆదిత్యనాథ్ శ్రీకారం చుట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఉత్తరప్రదేశ్‌లో లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు తీసుకొన్న రైతులు సుమారు 86 లక్షలమంది ఉన్నారు. ఈ రుణాలు చెల్లించడానికి మొత్తం 36,500 కోట్ల రూపాయలు అవసరం. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రుణ మాఫీ కోసం ముఖ్యమంత్రి ఈ మొత్తాన్ని కేటాయించారు. అదే సమయంలో లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు తీసుకొన్న రైతులకు రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం, బంగారు నగలు, ఆస్తులను వేలం వేయడం వంటి పనులు చేయవద్దంటూ ఆయన బ్యాంకులను కోరారు. రుణమాఫీ పథకం కింద 86 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ వ్యవసాయ రు ణాలు రద్దుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్ట్ఫికెట్లను అందజేస్తున్నారు. రుణమాఫీ సర్ట్ఫికెట్ల పంపిణీ చేయడం కోసం జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను ఏర్పాటు చేశారు. యుపి సిఎం విప్లవాత్మక నిర్ణయం తీసుకోగా, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్న విషయం సర్వ విదితమే. దేశంలో ఒక్కసారిగా 36,500 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో రైతులు రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రైతాంగం మాత్రం తొలకరి పనులకు సమాయత్తం అవుతున్నది. దీనికి కారణం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిపాలనా సామర్థ్యమే.
గత సంవత్సరం 8.04 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుత సంవత్సరంలో 32.16 లక్షల మెట్రిక్ టన్నుల గోధులను సేకరించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో గోధుమలు, చెరకు ప్రధాన వాణిజ్య పంటలు. గత రెండు నెలల్లో 22,190 కోట్ల రూపాయల రుణ బకాయిలను చెరకు రైతులకు చెల్లించారు. దీంతో దాదాపు రైతులు అందరూ దాదాపుగా సంతోషంగా ఉన్నారు. దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతుల సంక్షేమం కోసం కృషి చేయడానికి కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమేనని యోగి ఆదిత్యనాథ్ తన చేతల ద్వారా నిరూపించారు. వ్యవసాయ రుణ మాఫీపై మీనమేషాలు లెక్కిస్తున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఉత్తరప్రదేశ్ చరిత్రలో చౌదరి చరణ్‌సింగ్ తరువాత రైతు పక్షపాతిగా యోగి ఆదిత్యనాథ్ నిలుస్తారు.

చిత్రం.. యోగి ఆదిత్యనాథ్

-పి.్భర్గవరామ్