సబ్ ఫీచర్

ఇంతకూ తప్పెవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి కారణమేమిటన్న ప్రశ్న సహజంగా తెరపైకి వస్తుంటుంది. అదే రాజకీయాల్లో అయితే తప్పు పదవి ఇచ్చిన వారిదా? తీసుకున్నవారిదా? అన్న చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు-ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంలో సరిగ్గా అలాంటి చర్చనే జరుగుతోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏరికోరి తీసుకున్న కృష్ణారావును అవమానకర పరిస్థితిలో తొలగించిన అనంతర పరిణామాలు వివాదానికి గురయ్యాయి.
ఐవైఆర్ పదవీ విరమణకు ముందే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఊపిరిపోశారు. బాబు కూడా ఆయనకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. దాని మార్గదర్శకాల నుంచి తన జీతం, సౌకర్యాలు, హోదా, అందులో ఎవరుండాలన్న అంశాన్నీ ఆయనే ఖరారు చేసుకున్నారు. రిటైరవకముందే ఆయనకు కావలసిన పదవి కోరుకోమనీ చంద్రబాబే ఆఫర్ ఇచ్చారు. ఐవైఆర్ కోరికను మన్నించిన బాబు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చారు. ఇక్కడ ఓ సంగతి ముచ్చటించుకోవాల్సిన అవసరం ఉంది. బాబు ప్రభుత్వంలో పార్టీకి పనిచేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చినా, అవి ఉత్తర్వురూపు దాల్చడానికి నెలల సమయం పడుతుంటుంది. సదరు చైర్మనే్ల సీఎంఓ, లేదా సంబంధిత శాఖ కార్యదర్శుల చుట్టూ తిరిగి, ఉత్తర్వులు తెప్పించుకోవాల్సిన దుస్థితి.
అలాంటిది కృష్ణారావుకు తనకేం కావాలో కోరుకునే స్వేచ్ఛతోపాటు, తానే ఆ జీవోలను తెప్పించుకునే వెసులుబాటు ఇచ్చి, తన పదవికి సంబంధించిన జీఓను రిటైరయ్యే ముందురోజు నాటికి ఆగమేఘాల మీద తెప్పించుకునేంత స్వేచ్ఛ కూడా ఇచ్చారన్నది నిర్వివాదం. కృష్ణారావు కంటే నెలరోజుల ముందు వికలాంగ సంస్థ చైర్మన్‌గా నియమితులైన కోటేశ్వరరావు అనే టిడిపి నేత, తన ఉత్తర్వు తెప్పించుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అదే కృష్ణారావు ఉత్తర్వులను పదవీ విరమణ రోజు సాయంత్రానికే తెప్పించుకోగలిగారు. ఇవన్నీ బాబు ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛకు ఓ నిదర్శనం.
ఆ తర్వాత కార్పొరేషన్‌కు గుర్తింపు తెచ్చేందుకూ ఐవైఆర్ కష్టపడ్డారు. వెయ్యి కోట్ల బడ్జెట్ ఉన్న కాపు కార్పొరేషన్ చేయలేని పనులు, రాని ప్రచారం రెండొందల కోట్లే దక్కిన బ్రాహ్మణ కార్పొరేషన్‌తో చేయగలిగారు. చాలామంది నిరుద్యోగులకు రుణాలు, విద్యార్ధులకు ఉచిత విద్య వంటి అనేకానేక కార్యక్రమాలను ఆ సామాజికవర్గంలోకి తీసుకువెళ్లారు. నిజానికి ఎన్టీఆర్ హయాం నుంచీ టిడిపికి దూరంగా ఉన్న సామాజికవర్గాల్లో బ్రాహ్మణ వర్గం ఒకటి. కొన్ని దశాబ్దాలు గ్రామీణ వ్యవస్థను శాసించిన కరణం, మునసబు వ్యవస్థను రద్దు చేసిన టిడిపిని ఆ వర్గం సంప్రదాయంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్, ఆ తర్వాత బిజెపికి మద్దతుదారుగా మారింది. అప్పట్లో మంత్రి కరణం రామచంద్రరావు, వేణుగోపాలచారి వంటి ఒకరిద్దరు తప్ప, టిడిపిలో బ్రాహ్మణులకు పెద్దగా ప్రాధాన్యం, ప్రాతినిధ్యం అంటూ లేదు. కారణమేమిటన్నది పక్కకుపెడితే ఇప్పటికీ ఆ పార్టీలో ఆ వర్గానికి రాజకీయ ప్రోత్సాహం లేదు. వైశ్యులకే కొద్దిపాటి ప్రాధాన్యం ఉంది.
కార్పొరేషన్ ఆవిర్భావం తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. లబ్ధిదారులైన ఆ సామాజికవర్గంలో గతంలో టిడిపిపై ఉన్న వ్యతిరేకత స్థానంలో సానుకూలత ఏర్పడింది. చంద్రబాబు వల్లే ఈ పథకాలు తమకు అందుతున్నాయన్న విషయం చాలామందికి తెలియకపోయినా, దానిని కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కృష్ణారావు అండ్ అదర్స్ ఆ మేరకు ప్రచారం చేయకపోయినా, టిడిపి ప్రభుత్వం వల్లే తాము లబ్థిపొందుతున్నామన్న భావనయితే వారిలో ఉంది. అంటే ఇక్కడ బాబుకు వ్యక్తిగత మైలేజీ రాకపోయినా ప్రభుత్వానికైతే మంచి పేరే వస్తోంది. తాజా వివాదం వల్ల అది దూరమయ్యే ప్రమాదం వచ్చింది.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, ఐవైఆర్ నుంచి ప్రభుత్వం అంతకుమించిన ఫలితాలు ఆశించినట్లు కనిపిస్తోంది. అంటే మిగిలిన కార్పొరేషన్ల మాదిరిగా బాబు కేంద్రంగా పథకాల ప్రచారం జరగాలన్నది కావచ్చు. అలా కోరుకోవడాన్ని తప్పుపట్టలేం. అది కృష్ణారావుకు నచ్చలేదు. అప్పటికీ కార్పొరేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో బాబును ప్రస్తుతిస్తూనే వచ్చారు. బహుశా ఆ మోతాదు పాలకులకు, వారికి చాడీలు చెప్పే భజంత్రీలకూ సరిపోయి ఉండకపోవచ్చు. మరోవైపు చాలీచాలని బడ్జెట్ కూడా ఐవైఆర్ అసంతృప్తికి మరో కారణం. వీటికితోడు ఆయన సహజ స్వభావం కూడా పదవీచ్యుతికి కారణంగా కనిపిస్తోంది.
సీనియర్ ఐఏఎస్, పాలనకు సారథ్యం వహించిన అధికారికి ఆ కార్పొరేషన్ చిన్నదే. దానికితోడు బడ్జెట్ కోసం వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ తన స్థాయి వ్యక్తి తిరగడాన్ని నామోషీగానూ భావించి ఉండవచ్చు. పైగా కృష్ణారావు ఎప్పుడూ పాలక పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం నియమించిన చైర్మన్‌గా కాకుండా, బ్యురోక్రాట్‌గానే భావించుకున్నారు. అసలు చిక్కులు అక్కడ నుంచే మొదయిలనట్లు తుది ఫలితంలో అర్థమయింది. రిటైరైన అధికారికి ఓ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయన కూడా దాన్ని ఇష్టపడే తీసుకున్నారు కాబట్టి.. కచ్చితంగా ఆయన కూడా మిగిలిన నాయకుల కిందే లెక్క. వర్ల రామయ్య, అనూరాధ, జూపూడి ప్రభాకర్, ఇప్పుడు ఆనందసూర్య మాదిరిగా ఐవైఆర్ కూడా పార్టీ ప్రభుత్వం నియమించిన నాయకుడే! కాదని ఆయన భావించినా రాజకీయ నాయకత్వం దృష్టిలో ఆయన కూడా పార్టీవాదే. ఇప్పుడు పరకాల ప్రభాకర్ హోదా మీడియా సలహాదారయినప్పటికీ, ఆయన కూడా పార్టీ మనిషి కిందే లెక్క. కాదంటే కుదరదు. అందుకే ఆయన మహానాడులో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
తనకు పార్టీ ప్రభుత్వ విధానాలతో సంబంధం లేదని, తనకూ వ్యక్తిగత అభిప్రాయాలున్నందున ప్రభుత్వం వాటిని పట్టించుకోకూడదనుకుంటే పొరపాటు. సోషల్ మీడియాలో ఐవైఆర్ షేర్, లైక్ చేసిన కామెంట్లు, ఇతరత్రా వ్యవహారాలన్నీ ఆయన వ్యక్తిగతమైనవే కావచ్చు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను తాను వినియోగించుకోవడంలో ఆయనకు తప్పనిపించకపోవచ్చు. కానీ ప్రభుత్వంలో భాగంగా ఉంటూ ఆవిధమైన స్వేచ్ఛ ఆక్షేపణీయం. అంతగా ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు నచ్చనప్పుడు రాజీనామా చేసి బయటకు వెళ్లాల్సింది. ఐవైఆర్ సుదీర్ఘకాలం వివిధ శాఖల్లో పనిచేశారు. ఆయన శాఖలో పనిచేసే కిందిస్థాయి అధికారి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఐవైఆర్ సహించి, అది సదరు అధికారికున్న భావ ప్రకటనాస్వేచ్ఛ అనుకుని వదిలేస్తారా? లేదా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్య తీసుకుంటారా? కచ్చితంగా చర్య తీసుకోవాలి!ఎందుకంటే సదరు అధికారి నిబంధనలు అతిక్రమించారు కాబట్టి!! ఇప్పుడు కృష్ణారావు విషయంలోనూ సర్కారు అదే పనిచేసింది. ఆయన కార్పొరేషన్‌కు జవసత్వాలు తెచ్చి, ఆ వర్గం జీవన ప్రమాణాలు మెరుగుపరిచినందువల్ల, ఆయన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనను సమర్ధించడం సరైనది కాదు.
అయితే- ఆయనను తొలగించిన విధానమే ఆక్షేపణీయం. పిలిచి రాజీనామా తీసుకోవడమో, లేక వివరణ అడగటమో చేసి ఉంటే గౌరవప్రదంగా ఉండేది. అందుకు భిన్నంగా కక్ష సాధించినట్లు ఆయనను తొలగించి, వెంటనే మరొకరిని నియమిస్తూ ఉత్తర్వులివ్వాల్సిన యుద్ధప్రాతిపదిక దృశ్యాలేవీ కనిపించలేదు. కేవలం ఆయన ధిక్కారాన్ని మీడియా రాజగురువులు అక్షరాల రూపంలో అందించిన ఆదేశాలను మన్నించాలి కాబట్టి, ఐవైఆర్‌ను తొలగించినట్లు కనిపిస్తోంది.
అసలు రిటైరైన వారికి పదవులివ్వడమే బాబు తప్పు. పార్టీలో జెండా మోసిన వారికి కాకుండా, అధికారులైతే ఉద్ధరిస్తారనుకునే బాబు ఆలోచనకు ఇదో గుణపాఠం. బ్యురోక్రాట్ల ఆలోచనా విధానానికి, రాజకీయ పార్టీల విధానాలకు ఎక్కడా పొంతన ఉండదు. పార్టీ గీతలో పనిచేయడం అధికారులకు అసాధ్యం. అయితే ఇప్పుడున్న అధికారులు ఆ పనిచేయడం లేదా? అన్న ప్రశ్న రావచ్చు. వారంతా ప్రభుత్వంలో ఉన్న వారి సామాజిక వర్గమే కాబట్టి భరించి, సర్దుకుపోతారు. మరి ఇక్కడ తప్పు ఎవరిది? పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రిదా? తీసుకునే అధికారులదా?
ఇవన్నీ బ్రాహ్మణ వర్గంపై ప్రభావం చూపుతాయన్నది భ్రమ. కాపుల మాదిరిగా ప్రభుత్వాన్ని మార్చే శక్తి గానీ, విజయాన్ని నిర్దేశించే సంఖ్య గానీ లేకపోవడమే కారణం. కాకపోతే, ఐవైఆర్ లేవనెత్తే ప్రశ్నలు, ప్రస్తుతం ప్రభుత్వం, సమాజంలో కనిపిస్తున్న వాస్తవాలపై చర్చ జరుగుతుందంతే! మంత్రివర్గ విస్తరణ తర్వాత సర్కారుపై వ్యతిరేక గళం విప్పిన వారంతా కమ్మ వర్గ నేతలే. కేశినేని నాని రవాణాశాఖ కమిషనర్‌పై దూకుడు తర్వాత, ఆ శాఖలో అవినీతి జరుగుతోందంటూ రోడ్డెక్కారు. కాపులకు టిడిపి అన్యాయం చేసిందని ఎమ్మెల్యే బొండా ఉమ దునుమాడారు. విశాఖలో భూకబ్జాలు జరుగుతున్నాయని మంత్రి అయ్యన్న ఆరోపించారు. దళితులకు గౌరవం లేదని టిడిపి ఎంపి శివప్రసాద్ ఆరోపించారు. వీరందరికీ లేని క్రమశిక్షణ ఒక్క ఐవైఆర్ నుంచే కోరుకోవడం ఏమిటన్నదే ప్రశ్న.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144