సబ్ ఫీచర్

మన్నిస్తేనే మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవుడంటే? దేవుణ్ణి చూసొచ్చిన వాళ్లెవరైనా మనకి చూపించడానికి యత్నంచేసి చూపించగలిగారా? ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో అందరూ అనుకునే ప్రశ్నలే..! చివరకి పొందే సమాధానం, దేవుడంటే నమ్మకం. కొన్ని పూజలు, వ్రతాలూ నిర్వహించడంవలనో, పురాణాలూ, ప్రవచనాలూ విని జీర్ణం చేసుకోవడంవల్లనో లేదా స్వయంగా చదివి తెలుసుకోవడంవల్లనో కలిగే కొన్ని దృష్టాంతాలవల్ల వాటిని అన్వయించుకుని ఆ నమ్మకంతో నిర్విచారంగా నిజాయితీగా మనగలుగుతున్నాడు మనిషి. దేవుడంటే రాముడా? దేవుడంటే కృష్ణుడా? అమ్మవారా? ఎవరు? అని ప్రశ్నించేవారికి శాస్త్రప్రకారంగా దైవలీలలని సోదాహరణంగా, వేదాల్లోంచీ ఉపనిషత్తుల్లోంచీ బోధిస్తూ ఒక నియమావళి ప్రకారం జీవిత విధానాన్ని నిర్దేశించింది సనాతన ధర్మం. ఆదిగా అనాదిగా వాటికి సంబంధించిన కావ్యాలూ, ప్రవచనకర్తల ఉపన్యాసాలవల్ల మానవులు హాయిగా జీవిస్తున్నారు. శ్రవణం, పఠనం, గ్రహణం- అన్నీ కూడా జ్ఞానాన్ని సంతరించుకోవడానికి మార్గాలే అని ఏనాడో వంద వేల సంవత్సరాల క్రితమే మత పెద్దలు, పీఠాధిపతులు, పండితులు నమ్మారు. వారు నమ్మిన సిద్ధాంతాలను సోదాహరణంగా నిరూపిస్తూ, మానవ జాతి మనుగడకు సరైన మార్గబోధనకూ తోడ్పడుతూ వచ్చారు. అసలు భగవంతుడికి ఏ రూపం? నిర్వికారుడు, నిరామయుడు అని కదా అంటారు. అయినా కొన్ని సందర్భాలలో దేవుడు దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణ కోసం, అనేక అవతారాలెత్తాడని, వాటి ద్వారా ఎన్నో సందేశాలు ఇచ్చారు. అది కూడా మానవాళిని జాగరూకం చేసి ఉత్తమమైన మార్గంలో నడిపించడానికే!
అంతేకానీ ఈమధ్యన కొన్ని మాథ్యమాలు కొన్ని అనవసర ప్రసంగాలూ, నిర్వచనాలు చేయిస్తూ మానవులు దశబ్దాలుగా నమ్ముతూ వస్తున్న వారి మనోభావాలను దెబ్బతీస్తూ, లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారు. పురాణ స్ర్తిలమీదా, పురుషులమీదా అక్కరలేని విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు. అసలే, కులమూ, మతమూ విలయ తాండవం చేస్తున్న విధ్వంసాలు సృష్టిస్తున్న ఈ సమయంలో, ఈ రకమైన వాదాలు అవసరమా? దీనివల్ల వాటిని నమ్ముకున్న వారి భావాలపైన జెల్లకాయ కొట్టినట్టే! ప్రజల్లో అసహనం రెచ్చిపోతుంది. విధ్వంసాలూ, అల్లకల్లోలాలూ, అల్లర్లూ రెచ్చిపోతాయి. సాధారణ ప్రజా జీవితానికి ఆటంకాలు సంభవిస్తాయి. దానివల్ల ఏం లాభం? సాయిబాబా హిందువైతేనేమీ, ముసల్మానయితే ఏమి? అతని బోధలు అందరూ పాటిస్తున్నారు. సత్ఫలితాలను పొందుతున్నామని సంతోషిస్తున్నారు. అది ముఖ్యం కానీ, అతని కులం, గోత్రం కాదు కదా? వినాయకుడి తల గురించి, వినాయకుడు దేవుడే కాదడనీ, వెంకటేశ్వరస్వామికి బీబీ నాంచారమ్మ భార్య కాదా? అంటూ రకరకాల వివాదాలు, ఈ రోజున అవసరమా? ఈ పరిశోధన ఎందుకోసం? ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళు దేవుళ్లో కాదో, మాంసం తిన్నారో, కల్లు తాగారో, ఆ విషయాల చర్చతో, వాళ్లని ఆరాధించేవారిని చిన్నబుచ్చడమో, రెచ్చగొట్టడమో, ఏ పీఠాధిపతి కానీ, ఏ మత పెద్ద కానీ చెయ్యొచ్చా. ఒకపక్క మనిషి జీవితాన్ని ఎన్నో సమస్యలు పీడిస్తూ వుంటే వాటిని సరిదిద్దే విధానంగా ఈ పెద్దలు ప్రయత్నిస్తే బాగుంటుంది కానీ, ఏ ధర్మమైనా, ఏ సిద్ధాంతమైనా, మనిషి మనుగడకీ, ప్రశాంతతకీ భంగం కలిగిస్తూ వుంటే, అసలే మూఢ నమ్మకాలతో, అవిద్యతో అలమటిస్తున్న మామూలు మనుషులకు ఇది ప్రమోదహేతువు కాదూ?
అందుకే నా విన్నపం ఏమిటంటే, ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఎవరి పూజలు వాళ్లవి. ఎవరి ఇష్టాలు వాళ్లవి- అనవసరమైన వాగ్వివాదాలతో రెచ్చగొట్టి, అశాంతిని సృష్టించి ఆనందించడం మంచిది కాదు. శాంతిని నెలకొల్పే మార్గాలను వివరించండి. ఎవరి నమ్మకాలను వారికొదిలెయ్యండి. ఎవరి మతం వాళ్లకి వొదిలెయ్యండి. అందరూ ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, సంతోషంగా జీవించడమే కదా ముఖ్యం! ఆ దిశగా ప్రయాణం చెయ్యడమే కదా ధర్మం. ఆలోచించండి పెద్దలందరూ. నేను పండితురాలను కాను కానీ ప్రజల సంక్షేమం కోరుకునేదాన్ని. అందుకే ఈ అభ్యర్థన. ఒకరి పండగలని ఒకరు విమర్శించుకోవడం, పండగపూట వాళ్ల మనసుల్లో చిచ్చుపెట్టడం దేనికి? యుద్ధాలూ, భూకంపాలూ రెచ్చిపోతున్న ఈ తరుణంలో, పెద్దలు చెయ్యవలసిన పనేనా ఇది? ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు మన్నించుకుంటూ సాగిపోవడమే శ్రేయస్కరం అని నా ఉద్దేశ్యం.

- శారదా అశోకవర్థన్