సబ్ ఫీచర్

క్రీడలకు ప్రోత్సాహం ఇదేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ స్థాయి పోటీలలో మన దేశం నుంచి జుంబో జుట్టు పాల్గొనడం, అరకొరగా పతకాలు సాధించడం- అటు మీడియా నుంచి ఇటు రాజకీయ పార్టీలవరకు అందరూ గగ్గోలు పెట్టడం. పాలక పక్షం విమర్శల తాకిడినుంచి బయటపడటానికి సమగ్ర క్రీడా విధానంను ప్రవేశపెడుతున్నామని, భవిష్యత్‌లో మన క్రీడాకారులు అద్భుతంగా అంతర్జాతీయ పోటీలలో రాణిస్తారని సుద్దులు చెప్పడం. కొంతకాలానికి మరో సమస్య రాగానే క్రీడల గురించి మరచిపోవడం మన దేశంలో అనాదిగా ఒక తంతు మాదిరిగా సాగుతున్నది. క్రీడల అభివృద్ధి విషయంలో మాత్రం నేతల మాటలు ‘కోటలు దాటుతాయి- చేతలు మాత్రం గడప దాటడంలేదు’. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు తగిన గుర్తింపు తెచ్చిన ఘనత భారత ప్రధాని నరేంద్ర దామోదర్ మోదీకే దక్కుతుంది. విసుగు, విరామం లేకుండా ఆయన ఒకవైపు పర్యటిస్తూనే మరోవైపు అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దగలుగుతున్నారంటే, అది కేవలం ఆయన చేస్తూన్న యోగా ద్వారా మాత్రమే సాధ్యం అవుతున్నది.
యోగాలో పలు పతాకాలు సంపాదించినప్పటికీ, ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం లభించక, జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తూన్న ఒక యువతి ఉదంతం ఇది. నక్సల్స్ ప్రభావిత రాష్టమ్రైన చత్తీస్‌గడ్‌లో డర్రా అనేది ఒక గ్రామం. రాష్ట్ర రాజధాని అయిన రాయపూర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. డర్రాకు చెందిన డామిని సాహూ (19) పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వికలాంగుడు. అంగవైకల్యం కారణంగా ఆయన పనులు ఏమీ చేయలేడు. తల్లి కూలీ పనులకు వెళ్లి, కుటుంబ పోషణ భారం వహిస్తున్నది. నల్గురి సంతానంలో దామిని పెద్దది. ఏడు సంవత్సరాల వయసులోనే దామినికి యోగా పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆమె అప్పటినుంచి క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తూ వస్తున్నది. గత మేలో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సౌత్ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె మన దేశం తరఫున పాల్గొని మూడు బంగారు, ఒక రజత పతకం సాధించింది.
ఖాట్మండు వెళ్లడానికి అవసరమైన డబ్బుకోసం స్థానిక శాసనసభ్యుడు, మంత్రి అయిన అజమ్ చంద్రార్కర్‌ను సంప్రదించగా ఆయన రిక్తహస్తం చూపించారు. దీంతో ఆమె వడ్డీకి డబ్బు తీసుకొని పోటీలలో పాల్గొంది. గత జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా అయినా తనకు ప్రభుత్వం నుంచి సాయం లభిస్తుందని ఆశపడిన దామినికి అడియాసలే ఎదురైంది. దీంతో దామని కుటుంబంకోసం భవన నిర్మాణ కూలీగా మారింది. రోజువారీ కూలీగా ఆమెకు 120 నుంచి 150 రూపాయలు లభిస్తూన్నాయి. జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తూన్నప్పటికీ ఆమె యోగాభ్యాసంకు మాత్రం స్వస్తి పలుకకపోవడం గమనార్హం.
మన దేశంలో ‘దామిని’ వంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇస్తే, అంతర్జాతీయ క్రీడాపోటీలలో పతాకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

-పి.్భర్గవరామ్