సబ్ ఫీచర్

చిరునవ్వు.. చెదరనివ్వకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందహాసం వౌనంగా మాట్లాడుతుంది. మానసిక సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది.
మంచి మనిషి అధరాలపై మందహాసం ఆవిరైపోని మనోహర కర్పూర సౌరభం.
అధరము కదిలియు కదలక
మధురములగు భాషలుడిగి వౌనవ్రతుడౌ
అధమము చిరునగవెరుగని
అధికార మదాంధుఁజూడ నరుగకుమెపుడున్
అంటాను నేను చిరునవ్వు కోవెల లెంకగా (సేవకునిగా).
చిరునవ్వు ఒ క సిరిమల్లెపువ్వు. అది పరాత్పరుని నవ్వు. మనిషికి మురువు (అందం) ప్రసన్న మానసతకు తెరవు
‘ద్యిజూళశ ఒఖౄఇళూఒ రీజఒఒ క్యఖూ ళకళఒ
డౄజళఒ ఘత్ఘీరీళ క్యఖ త్దీళశ క్యఖ జఒళ’’ అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల గీత రచయిత థామస్ డెక్కర్- ముద్దులు మూటగట్టే ఒక పసిబాలకు జోలపాడుతూ.
తాను జోలపాడుతుంటే తన ఒళ్ళోని బుల్లిపాపకు కన్నులు అరమూతలేసుకుపోతున్నాయి. ‘‘కమ్మని కునుకు నీ కన్నును ముచ్చటగా ముద్దుపెట్టుకుంటోంది. కాసేపట్లో నీవు నిదురలేస్తావు. ఆ లేస్తున్నప్పుడు లేలేత నవ్వు కూడా ఒకటి చిందిస్తావు. అసలు ఒక చిరునవ్వే ముందు లేచి, ఆ తరువాత నిన్ను లేపుతోందేమో అన్నంతగా ఆ చిరునవ్వు ముచ్చట గొలుపుతుంది’’ అంటూ ఒక్క దృశ్యానుభూతిలో తేలిపోడు థామస్ డెక్కర్ కేవలం ఈ ఒక్క రెండు మృదుభావాత్మక పంక్తులలోనే.
సృష్టిలోని జీవజాలం మొత్తంలో చిరునవ్వు కలిమి, సౌభాగ్యం (అదృష్టం) కేవలం మనిషికి మాత్రమే సొంతం, సంప్రాప్తం, సాధ్యం.
‘డౄజళ ష్యఒఆఒ శ్యఆ్దజశ. నిఆ జఒ ఆ్ఘన ఛిళళ. ఱళఒజజూళఒ, జఆ జౄఔ్య్పళఒ క్యఖూ చ్ఘిషళ ప్ఘఖళ (చిరునవ్వుకు చిల్లుకానీ ఖర్చులేదు; పైసా పన్నులేదు; పైగా ముఖానికి ముచ్చట అద్దుతుంది’’) అంటుంది ఒక ఆంగ్ల సూక్తి.
ఎన్ని కష్టాలు రానీ, నష్టాలు కానీ మందహాసం మాత్రం మందగించకూడదు. చిరునవ్వును చెరగనివ్వకూడదు. ఒక్క చిరునవ్వుతో చుట్టూ ఉన్న ప్రపంచానే్న మార్చగలమేమో! కానీ ప్రపంచంవల్ల మన చిరునవ్వు మాయమైపోకూడదు. అదే స్థితప్రజ్ఞత అంటే. మనిషి అందానికి అంగాంగ శోభకన్నా నిర్మల మందహాసం నిలువెత్తు దర్పణంగా నిలవాలి.
చిరునవ్వు కరువైన చింతాక్రాంతుడు కనిపిస్తే నీ దగ్గరున్న ఒక చిరునవ్వైనా నిర్మల హృదయంతో అతనికి ఒక కానుకగా ఇవ్వు.
‘ ఒౄజజశ ఛ్ఘిషళ జఒ ఘ ఇళ్ఘఖఆజచిఖ చ్ఘిషళ. ఒౄజజశ దళ్ఘూఆ జఒ ఘ ద్ఘఔఔక దళ్ఘూఆ (మంధహాసవదనం మనోహరం. దరహాస హృదయం ఆహ్లాద నిలయం)’’ అన్నాడు ప్రఖ్యాత సామ్యవాదనేత డాక్టర్ టి.పి.చియా.
చిరాకుపడుతున్న శ్రీవారిని ఒక్క చిరునవ్వుతో ప్రసన్న వదనుణ్ణిగా చేసుకుంటుంది సతీమణి. తాను ఆఫీసుకు పోయేముందు ఎందుకో అలిగివున్న అర్థాంగిని ఆరు అంగలు ముందుకువెళ్లి, అంతలోనే తిరిగి వచ్చి వరండాలోంచి లోపలకి చూచి లాలనగా ఒక్క చిరునవ్వు ఫ్లాష్ కొడితే అలిగిన అర్థాంగి అంతలోనే అన్నీ మరచిపోయి ఆనంద చంద్రకళలు ఆరబోసి చూపిస్తుంది.
తన చేత కేకలు వేయబడిన తన క్రింది ఉద్యోగి తన ఛేంబర్‌లోంచి తల దించుకొని వెళుతుంటే అతని భుజం తట్టి, వెనుకకు పిలిచి అధికారి ఒక చిరునవ్వు నవ్వితే ఆ చిన్నబుచ్చుకున్న చిరుద్యోగి మరుక్షణంలోనే ఊరట ఉప్పొంగులు, ఆనందపు అంచులు చూస్తాడు.
మందహాసం ఒక మనోహరగానం. హృదయం చెక్కే శిల్పం. మనసుగీసే చిత్రం. పదాలు లేని కవిత్వం. పెదాలు చూపే మనోహర మాయాఛాయా చిత్రం. మందహాసానికి ఇంత మహత్తర శక్తి ఎక్కడిది? దాని ఆత్మస్వరూపం ఏమిటి? మందహాసం భగవతీ స్వరూపం. అంబ మరోరూపం.
‘‘దరహాసోజ్జ్వలన్ముఖి (చిరునవ్వుల ప్రభల నెలవు అంబ ఆసనం), దరస్మేర ముఖాంబుజ (అరవిరిసిన అంబుజంలాగా చిరునవ్వుతో ఉండే ముఖం లలితాదేవిది)’’ అంటాయి లలితా సహస్రనామాలలోని 103వ, 924వ అభిధానాలు. సగటు మానవుని నిత్య జీవితంలో చిరునవ్వు నిరంతర సహచరి. కన్నీరు కార్చని రోజులు ఉండవచ్చుగానీ రోజులో ఒక్కసారైనా చిరునవ్వు నవ్వని రోజు ఉండదేమో! పలకరించే ముందు మందహాసం చేస్తాం. వచ్చినవారిని సాగనంపేటప్పుడు మందహాసం చేస్తాం. ఏదైనా బహుమతి ఇచ్చేటపుడు, పుచ్చుకొనేటప్పుడు, ఎదటివాడిని మెచ్చుకునేటప్పుడు, ఎందుకైనా మొహమాటపడేటప్పుడు, స్వచ్ఛ స్నేహానికి ఆరాటపడేటప్పుడు, వధూవరులు జీలకర్ర, బెల్లం పెట్టుకొనేటప్పుడు, బిందెలో ఉంగరం వెతికి పట్టుకొనేటప్పుడు- ఇలా ఒకటేమిటి? అసంఖ్యాక సందర్భాలలో మందహాసం మనకంటే ముందుగా అందగిస్తుంటుంది ముఖంలో తోసుకుంటూ ముందుకొచ్చి. చరిత్రలో కొందరు జాణలు ఒక్క చిరునవ్వుతోనే మహాసామ్రాజ్యాలను వశం చేసుకున్నారు. పురాణాలలో కొందరు అచ్చరలు మహా మహా మునీంద్రునే పాదాక్రాంతులను చేసుకున్నారు. కానీ అలాంటి మిటారి చిరునవ్వులు కాదు మానవతా సౌందర్యానికి హుందాతనాన్నిచ్చేవి. ఒక దక్షిణామూర్తి రూపంలో, ఒక ఆదిశంకరుల దృక్కులలో, ఒక రామకృష్ణ పరమహంస వాక్కులలో, ఒక వివేకానందుని స్ఫూర్తిదాయక ఉపన్యాసాలలో, ఒక అరవిందుని ‘సావిత్రి’లో, ఒక ‘సర్వేపల్లి’ సాంస్కృతిక- తాత్త్విక వచనాలలో తొంగిచూసే పరమ ప్రశాంత సముదాత్త సమ్మందహాసం వంటిది మాత్రమే మనిషికి అందం; మానవతకు ఆహార్యం. ప్రతి మనిషి మల్లెలాంటి మందహాసం
కావాలి యావజ్జాతి జన హృదయోల్లాసం

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం