సబ్ ఫీచర్

మాతృభాషను మృతభాష చేయకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 25.10.2016 తేదీతో తీసుకువచ్చిన జి.ఓ.నెం.262 జనంలోకి రాగానే ఒక్కసారి కలవరం మొదలైంది. ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు తల్లిదండ్రుల కోరిక మీదే ఆంగ్ల మాధ్యమంలోనే అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ విద్యాబోధన జరుగుతుందన్నది ఆ ప్రభుత్వ ఆజ్ఞాపత్రం సారాంశం! ‘తెలుగు మాధ్యమంలో చదివితే పిల్లల భవిష్యత్తు శూన్యం. అందుకే ఆంగ్ల మాధ్యమాన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచే ప్రవేశపెడుతున్నాం’ అని సంబంధిత మంత్రివర్యులు పాత్రికేయులకు చెప్పడం తెలుగు వాళ్ళందర్నీ హతాశుల్ని చేసింది. తెలుగుదేశంలో తెలుగు ఏమైపోతుందనే కంగారు మొదలైంది.
దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే గిడుగు రామమూర్తి పంతులు లిపిలేని ‘సవర భాష’ ఒక క్రమంలో ఉండకపోవడంతో సవరలు అనాదిగా నాగరికుల చేతుల్లో మోసపోతున్నారని గ్రహించారు. మాతృభాషలో ముందు మన గురించి మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇతర భాషల ద్వారా మిగతా ప్రపంచాన్ని తెలుసుకోవచ్చని మొదటి ఆధునిక భాషా శాస్తవ్రేత్త గిడుగు చెప్పిన మాటల్ని మననం చేసుకున్నారు. ఎవరికైనా మాతృభాషలో ప్రాథమిక విద్యనభ్యసించి ఒక భాషా స్వరూపం తెలుసుకుంటే, ఆ పునాది మీద ఎన్ని భాషల అంతస్థుల భవనాన్నయినా నిర్మించుకోవచ్చని తెలుగువాళ్ళందరూ గ్రహించారు. ప్రాచీన హోదాను పొందిన మాతృభాషని క్రమంగా నీరుగార్చే విధానాల్ని ఎండగట్టారు.
అయిదేళ్ళ వరకూ ఇంట్లో మాట్లాడడం, ఎవరైనా మాట్లాడితే విని అర్థం చేసుకునే మాతృభాష తెలుగని, పాఠశాలలోకి అడుగుపెట్టిన మొదటి అయిదేళ్ళలో ప్రాథమిక స్థాయిలో- రా యడం, చదవడం నేర్చుకోవడంతో మొదట మాతృభాష పట్ల మమకారం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆంగ్ల మా ధ్యమాన్ని ప్రవేశపెట్టండి. పిల్లలు అర్థం చేసుకుంటారు. లేకపోతే, అంత చిన్న వయసులో పాఠశాలలోకి అడుగుపెట్టడంతోటే ఆంగ్ల మాధ్యమంతో పిల్లల్లో ‘డ్రాపవుట్స్’ ఎక్కువవుతాయంటూ తెలుగు వాళ్ళందరూ ఏపి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు, కొందరు ఆవేశంతోనూ, ఆలోచనతోనూ ముందుచూపుతోనూ! పాఠశాలలోకి రాగానే ఆంగ్ల మాధ్యమనేసరికి అటు తెలుగు సరిగ్గా రాదు, ఇటు ఆంగ్లమూ సరిగ్గా రాదు, సంకరభాష తప్ప! అన్నవిషయం అందరికీ అర్థమైంది. అంతేకాదు, చిన్నప్పటి నుంచి ఆలోచనలు తెలుగు భాషానుసారం కలుగుతాయని, అందుకనే ఆ తర్వాత మరే భాషలో మాట్లాడాలన్నా ముందు మాతృభాషలో అనుకుని, తర్వాత ఆ భాషలోకి అనువదించుకుని మాట్లాడతామని! అందుకైనా తెలుగురావాలన్న విషయం, మాతృభాషలోనే మన సృజనాత్మకత, సంస్కారం, సాంప్రదాయాలు లాంటివి ఉంటాయని, మాతృభాష మాయమైతే వీటన్నింటినీ కోల్పోతామనే ప్రజల బాధ ప్రభుత్వం అర్థం చేసుకొందేమోనన్న ఆశకి ఊతం ఇస్తూ పురపాలక శాఖ మంత్రి ఇంగ్లీష్ మాధ్యమంలో చేరడానికి వ్యతిరేకిస్తున్న పిల్లలకు, తెలుగు మాధ్యమం ద్వారా విద్యాబోధన చేయడానికి అవసరమైన పుస్తకాల్ని సిద్ధం చేయమని కోరుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టెక్స్ట్‌బుక్ ప్రెస్ డైరెక్టర్‌కి రాసిన ఉత్తరం ఆనందాన్ని కలిగించింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించడం లేదన్న విషయం తెలుగువాళ్ళందరకూ కొంత ఊరట కలిగించింది.
బోధనా భాషగా ఒకటవ తరగతి నుంచి తొలగిస్తే- తెలుగుభాషమీదే ఆధారపడ్డ చాలా వృత్తులు కనుమరుగైపోతాయనే భయానికి తాత్కాలికంగా దూరమయ్యారు ప్రజలు. అంతేకాదు, అందరూ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి వెళ్లిపోరుగా సంపాదనకి! రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళెందరో మాతృభాషకి అన్యాయం చేయవద్దంటున్నారు. కానీ ఆంగ్లాన్ని గాని, మరే భాషనిగాని వద్దని నిరసించడం లేదుగా!
పిల్లలూ..! మీకెన్ని భాషలు వీలైతే అన్ని భాషల్ని నేర్వండి. కానీ మాతృభాషను నేర్చుకోవడం మాత్రం మానకండి. అలా చేస్తే అమ్మ దగ్గర పెరగకుండా మరొకరి దగ్గర పెరిగినట్లే! అంత తేడా ఉంటుంది! మూలాలు తెగిపోకుండా పెరగండి. మూలాలు తెగితే దారం తెగిన గాలిపటం ఎలా ఎగురుతుందో మన జీవితం అలాగే సాగిపోతుంది!
కొసమెరుపేమిటంటే.. ఈ కొత్త తెలుగు పుస్తకాల్ని పాఠశాలలోనే ఉంచుతారట! ఆంగ్ల మాధ్యమ పుస్తకాల్ని తెలుసుకోవచ్చట! మాట్లాడడం మాత్రమే మాతృభాషలో తెలుసుకుని, చదవడం, రాయడం తెలీకుండా పాఠశాలలోకి అడుగుపెట్టిన పిల్లలు మాతృభాషా పుస్తకాల ద్వారా ఆంగ్ల భాషలోని పుస్తకాల విషయాలనెలా అర్థం చేసుకుంటారో..? అలా చేసుకుంటారని భావిస్తున్న పెద్దలే చెప్పాలి.
మరోమాట- 1835 ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలో బ్రిటీష్ పార్లమెంట్‌లో ‘్భరతదేశాన్ని వశపరచుకోవాలంటే ఆ దేశానికి వెనె్నముకలా వున్న సంస్కృతి, ఆధ్యాత్మికతలు అడ్డు నిలుస్తాయి. అందుకని వాళ్ళ విద్యా విధానాల్ని మార్చి, వాళ్ళ భాషలకన్నా ఆంగ్ల భాష గొప్పదనే భావన కలిగించాల’ని అప్పట్లో చెప్పారన్నమాట నిజమో కాదో గాని, ఇప్పట్లో దానిని నిజం చేయబోతున్నారు! ఇది నిజం!

-వేదగిరి రాంబాబు