సబ్ ఫీచర్

పర్యావరణంపై పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణంపై పిల్లల్లో అవగాహన పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషల్లో పాఠ్యాంశాలను రూపొందించాలి. మన దేశంలో అమలులో ఉన్న ‘పర్యావరణ పరిరక్షణ చట్టం-1986’ ప్రకారం ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను క్రమం తప్పకుండా అమలు పరచాలి. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా 1950లో ‘న్యూయార్క్ స్టేట్ కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ సైరుక్యూజ్ యూనివర్సిటీ’ పర్యావరణంపై డిగ్రీ కోర్సు ప్రారంభించింది. యునెస్కో 1971 నుంచి పర్యావరణ ఆవశ్యతకపై ప్రజలకు అవగాహన కల్పించడం, అనుసరించప చేసేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారత్‌లోను సర్వోన్నత న్యాయస్థానం పర్యావరణ అంశాన్ని దృష్టిలో వుంచుకుని- ప్రజలకు పర్యావరణంపై ప్రభుత్వాలే అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తునే ఉంది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) చొరవ తీసుకుని ప్రకృతి, పర్యావరణం కాలుష్య నివారణకు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు తప్పనిసరిగా పాఠాలు బోధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేసింది.
పర్యావరణం కలుషితం కావడానికి పారిశ్రామిక వ్యర్థాలు, కర్బన ఉద్గారాలు, గాలిలో దుమ్ము ధూళి, నీటిలో కలుషిత రసాయనాలు, నదులలోకి మురుగునీటిని తరలించడం, మితిమీరి రసాయన ఎరువులు వాడడం, వృక్షాలను నరికివేయడం వంటివి ప్రధాన కారణాలు. ప్రపంచ వ్యాప్తంగా భూ వనరులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే. భూమిలో ఉన్న ఖనిజాలు, సహజ వాయువులు, చమురు నిక్షేపాలు పరిమితికి లోబడి ఉంటాయి. అత్యాశతో వాటి ఉనికికే ప్రమాదం వాటిల్లే చర్యలు చేపడితే చివరకు మిగిలేది ఎండిపోయిన మట్టే. ఈ విషయాన్ని మానవాళి గుర్తించనందునే పర్యావరణానికి నానాటికీ హాని జరుగుతోంది.
పరిమితమైన సహజ వనరులను పొదుపుగా వాడుకునే దిశగా ప్రయత్నించాలి. ఈ విషయాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చేయాలంటే ప్రాథమిక స్థాయి నుంచే వారికి పర్యావరణం పట్ల పాఠ్యాంశాల ద్వారా అవగాహన, ఆసక్తి కలిగించాలి. పాఠ్యాంశాలతోపాటు సమాచార సాధనాల ద్వారా అవగాహన కలిగించడం ఉత్తమమైన మార్గం.
నాగరికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరగాల్సి ఉంది. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచం అంతటా పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. జలాన్ని ఒడిసిపట్టుకుని పచ్చదనాన్ని పరిపుష్టం చేయాల్సిన ఆవశ్యకత కనపడుతోంది. పర్యావరణం దెబ్బతింటే భవిష్యత్తులో ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని విద్యార్థి దశనుండే పిల్లలకు నూరిపోయాలి. దేశంలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు ప్రభుత్వాలు తగినన్ని నిధులు సమకూర్చి ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించాలి. వనం-మనం, నీరు-మీరు, మిషన్ కాకతీయ వంటి పర్యావరణ పరిరక్షణ పథకాలకు విస్తృత స్థాయి ప్రచారం అవసరం. క్షేత్రస్థాయిలో సమర్ధ నిర్వహణ, సమగ్ర పర్యవేక్షణ ఉన్నపుడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమయ్యే వీలుంది.

-దాసరి కృష్ణారెడ్డి