సబ్ ఫీచర్

ఇన్ని పార్టీలు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో కాలం శ్రమకోర్చి, త్యాగాలుచేసి, లాఠీ దెబ్బలు తిని, జైళ్ళపాలై స్వాతంత్య్రం సాధించుకున్నామని సగర్వంగా చెప్పుకుంటున్న సమరయోధులైన వయోవృద్ధులు ప్రస్తుత దేశ పరిస్థితి చూసి మేము ఆశించిన భారత్ స్వరూపం ఇదేనా అని విలవిల్లాడుతున్నారు.
దేశంలో 2వేలకు పైగా ఏర్పడిన ఈ చిల్లర రాజకీయ పార్టీలవల్ల దేశానికి ఒనగూడిందేమిటి? అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా లాంటి దేశాలలో లేని బహుపార్టీ వ్యవస్థ మన దేశానికి అవసరమా? దేశ అస్థిరతకు దారితీసే వేలకొద్ది పార్టీలా మనకు కావలసింది? ఇదేనా ప్రజాస్వామ్యమంటే? ఇలా ఎన్నో ప్రశ్నలు మస్తిష్కంలో మెదులుతున్నాయి.
భావ సారూప్యతలేని, స్వార్థప్రయోజనాలకోసం, కులం, మతం, ప్రాంతీయం, వారసత్వం, తెగ అడ్డుపెట్టుకొని అనైక్యతాభావాలు, వైషమ్యాల బీజాలు నాటి, తమ పబ్బం గడుపుకోవడానికి విస్తృత సంఖ్యలో ఈ చిల్లర పార్టీలు ఏర్పడి ప్రభుత్వ అస్థిరతకు దారితీస్తున్నాయి. ఈ బహురూపి దగాకోరు పార్టీల ప్రభావం వలన జాతీయ పార్టీలు సుపరిపాలన అందించలేక పోతున్నాయి. నాకిది, నీకది చందంగా పరస్పర ప్రయోజనాలు ఆశించే ఈ బహుపార్టీలు చట్టబద్ధపాలనను చట్టుబండలు చేస్తున్నాయి. దేశం ఈసురోమంటోంది. బహుముఖ పార్టీ వ్యవస్థ సరియైనదికాదని ప్రజాస్వామ్య పవిత్రతకు భంగం కలుగుతుందని ప్రాంతీయతత్వం, కుల తత్వం, పెచ్చరిల్లి జాతీయభావం అడుగంటిపోతుందని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. కాని మన దేశం మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. అభద్రతా భావం కలిగించి తాము భద్రంగా వుండటమే వీటి ఆశయం. ప్రభుత్వాలనే మార్చగలవు. ఇది వీటికి కొట్టిన పిండి. ఈ పొత్తుల ప్రభావంవలన అవినీతిని అంతం చేయడమేగాని వూడిగం మాత్రం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. దేశానికి భజనపరులు కాదు కావలసింది.
‘మితిమీరిన పులుసుకూర విస్తరి మింగెన్’
కనుక ఈ మితిమీరిన రాజకీయ పార్టీల వ్యవస్థకు తిలోదకాలు ఇవ్వవలసిన తరుణం ప్రజలను జాగృత పరచవలసిన సమయం, ఆసన్నమైందని సమర్ధులైన మేధావులు, రాజకీయ విజ్ఞులు గుర్తించాలి. ఈ చారిత్రక సత్యాన్ని విస్మరించి నిస్సహాయులుగా చూస్తు, దురదృష్టకరమని సరిపెట్టుకుంటూ ప్రేక్షకులుగా ఎందుకొచ్చిన తిప్పలు అని వూరకవుంటే ఘోర తప్పిదమే అవుతుంది.
ఈ రాజకీయ కాలుష్యాన్ని చూడలేక స్వాతంత్ర సమరానికి అండగా నిలచిన వయోవృద్ధులందరూ మానసికంగా బాధపడుతున్నారు. వయోవద్ధులే కాదు ‘వీరా నా సుపుత్రులు’అని భరతమాత కూడా ఘోషిస్తున్నది. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది. బంధుప్రీతి, స్వార్థం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయ. ఇవన్నీ బహుళ పార్టీ వ్యవస్థ వల్ల కలుగుతున్న అనర్ధాలు. ఓట్లు జాతిహితం, దేశ హితం కోసం కాకుండా కులం, మతం అనే విధంగా విడిపోతున్నాయ. గెలుపే లక్ష్యంగా పోటీ చేసే రాజకీయ పక్షాలు ప్రజల్లో కుల, మత తత్వాలను రెచ్చగొడుతున్నాయ. ఫలితంగా విస్తృత దేశ ప్రయోజనాలు మరుగునపడిపోతున్నాయ. అందువల్ల...
బహుపార్టీ విధానం మనకు అసలే వద్దు
రెండు లేక మూడు పార్టీలే ముద్దు
కీలుబొమ్మలాటలా వుండరాదు మన దేశ రాజకీయ పరిస్థితి
ఓటర్లూ! భోళాతనం విడనాడండి
కన్నకలలు సాకారం చేయండి.

- కటకం పిచ్చయ్య