సబ్ ఫీచర్

సమగ్ర మూల్యాంకనమే అసలు ‘పరీక్ష’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ స్థాయిల్లో పరీక్షలు నిర్వహించడం చాలాకాలంగా జరుగుతున్నదే. వి ద్యాభ్యాసంలో ఒక్కొక్క ఘట్టం ముగిశాక పరీక్షలు జరపడం ఆనవాయితీ. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యా క కొన్ని నెలల తరువాత లేదా సంవత్సరాంతంలో పరీక్షలు జరిపినపుడు విద్యార్థులు తాము నేర్చుకున్న మేరకు ప్రశ్నలకు జవాబులు రాస్తారు. మార్కుల ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేసి పై తరగతికి పంపడం జరుగుతుంది. అంటే విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షించి వారి తెలివితేటల్ని నిర్ణయిస్తున్నారు. విద్యార్థి ఆలోచనా శక్తి, వివేచన, విచక్షణ, విమర్శన, చింతన, కల్పన, సృజనాత్మక శక్తుల్ని విస్మరిస్తున్నారు. జ్ఞాపక శక్తిలో కూడ అభ్యాసన శక్తి, ఉద్ధరణ శక్తి, జానం నిల్వ చేసుకునే శక్తి, గుర్తింపుశక్తి అనే నాలుగు విభాగాలుంటాయి. ఈ నాలుగింటిలో ఏది లోపించినా జ్ఞాపకశక్తి లోపించినట్లే.
అభ్యసన రెండు విధాలుగా ఉంటుంది. అవి.. వివేచనా పూర్వకమైన అభ్యసనం, యాంత్రికాభ్యసనం. ఈ రెం టిలో ఏవిధంగా అభ్యసనం జరిగినా నిలువ చేసుకునే శక్తి, ఉద్దరణ శక్తి, గుర్తింపు శక్తి సరిగా ఉంటే ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి ఉన్నట్లే. జ్ఞాపకశక్తిలో రెండవ భాగమైన నిలువ చేసుకునే శక్తి రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి దీర్ఘకాలికం, రెండవది స్వల్పకాలికం. కొందరు తాము నేర్చుకున్న విషయాలను చాలా కాలం గుర్తుంచుకుంటారు. మరికొందరు కొద్దికాలమే గుర్తుంచుకుంటారు. పరీక్షలకు ముందు పదిరోజులు పగలనక, రాత్రనక చదివి తాము చదివిన విషయాలను రాసి మరుసటిరోజే మరచిపోయేవారు కొందరు. ఇంకొందరిది ‘్భట్టీ పద్ధతి’, మరి కొందరిది దర్జాగా ‘కాపీ విధానం’. పరీక్ష ఎలా రాసినా సమాధాన పత్రం ఆధారంగా మార్కులు వేసి తెలివితేటలను నిర్థారిస్తారు. పరీక్షలనేవి విద్యార్థి జ్ఞానాన్ని తెలిసికొనడానికి పనికి వచ్చే సాధనాలుగానే మనం భావిస్తున్నాం, భ్రమిస్తున్నాం.
బోధనాభ్యాసన లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు, ప్ర యోజనాల మాదిరిగానే పరీక్షలను నిర్వహించడంలో కూడా మనకు కొన్ని ఉద్దేశాలున్నాయి. విద్యార్థుల జ్ఞా నాన్ని పరీక్షించడం, వారి మూర్తి మత్వాన్ని అనగా స్పష్టమైన ఆలోచనను, వివేచనా శక్తిని, విచక్షణా జ్ఞానాన్ని, విమర్శనా శక్తిని అంచనా చేయడం పరీక్షల లక్ష్యం. ఉపాధ్యాయుల, పాఠశాలల సామర్థ్యాన్ని కూడా పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. విద్యార్థుల అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఉద్దేశింపబడిన- ‘పరీక్షలు’ నిత్యం మనల్ని శాసిస్తూనే ఉన్నాయి. పరీక్షలనేవి విద్యార్థుల్ని అయోమయానికి, ఒత్తిడికి, ఆధిక్యతకు, లోకువ భావానికి, భయోత్పాదనకు గురిచేస్తున్నాయి.
ఏడాదిలో ఒకటి, రెండుసార్లు జరిపే పరీక్షలలో ఒక్కొక్క విషయంలో విద్యార్థులను పరీక్షించడానికి రెండు లేక రెండున్నర గంటల కాలాన్ని నిర్ణయిస్తాం. నెలల తరబడి బోధించిన విషయాలన్నింటినీ ఈ కొద్ది గంటల కాలంలో పరీక్షించలేము. కొందరు విద్యార్థులు ముఖ్యమైన కొన్ని విషయాలను మాత్రమే ఎన్నుకొని చదువుతారు. వాటికి సంబంధించిన ప్రశ్నలే వస్తే ఆ విద్యార్థి ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. చాలా విషయాలను క్షుణ్ణంగా చదివినా, వాటికి సంబంధించిన ప్రశ్నలు లేకుంటే ఆ విద్యార్థి తక్కువ మార్కులు పొందుతాడు. నేడు నిర్వహించే పరీక్షా పద్ధతిలో ఎన్నో లోపాలున్నాయి. మనం తయారుచేసే ప్రశ్నాపత్రం కచ్చితమైన లక్ష్యాలను కలిగి ఉండడం లేదు. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం మొదలైన లక్ష్యాలకు పరీక్షల్లో తగిన స్థానం లేకుండాపోయింది. అవకాశతత్త్వం ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఎంపిక చేసుకున్న కొన్ని ప్రశ్నలను చదివినా సునాయాసంగా పరీక్షలలో ఉతీర్ణులవుతున్నారు. మరోవైపు నైతిక విలువలు, నైతిక ప్రమాణాలు కూడా దిగజారిపోతున్నాయి. శీల లక్షణాలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. కేవలం విషయం కోసమే చదవడం వల్ల వివిధ రకాలైన మానసిక శక్తుల అభివృద్ధికి అవకాశం లేకుండా పోతుంది. విద్యార్థులకు పరీక్షలంటేనే ఒక రకమైన భయం ఆందోళన ఒత్తిడి, మానసిక భారం. దీనివల్ల కుంఠనం పెరుగుతుంది. ఉపాధ్యాయుని మానసికస్థితిని బట్టి కూడ ప్రశ్నాపత్రం దిద్దబడుతుంది. కనుక యాంత్రికత, అన్యమనస్కత, అవధాన రాహిత్యం, వ్యక్తిగత ప్రలోభం, జీవన సంఘర్షణ, డబ్బు కక్కుర్తి మొదలైన అవగుణాలు పశ్రపత్రం దిద్దేటప్పుడు ప్రభావాన్ని చూపుతాయి. ఈనాడు ప్రశ్నాపత్రం తయారీ విధానంలో, నిర్వహణ పద్ధతుల్లో, మూల్యాంకనంలో విపరీతమైన అస్తవ్యస్తత, అవకతవకలు, అవిశ్వసనీయత, అప్రమాణికత, అలసత్వం, పక్షపాతవైఖరి, వ్యక్తినిష్ట, ధనార్జన ధ్యేయం, స్వార్థపూరిత ఉద్దేశాలు, ప్రయోజనాలు చోటు చేసుకుంటున్నాయి.
అనేక లోపాలు ఉన్నందునే పరీక్షల విధానంపై అనాదిగా విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. హంటర్ కమిషన్, కలకత్తా యూనివర్సిటీ కమిషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ మొదలైనవి- ‘అభ్యసనంలో ఆటంకాలను కలిగించేవిగా పరీక్షల విధానం ఉన్నట్టు’ విమర్శించాయి. పరీక్షల విధానంలో లోపాలే బలీయమని తేలుతుంది. ఈ లోపాలను తొలగించి విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలను సరిగా అంచనా వేసి, మాపనం చేసి, మూల్యాంకనం చేసే మార్గాలను గురించి విద్యావేత్తలు ఆలోచించి కొన్ని సూచనలు చేశారు. ‘మూల్యాంకనం’ అనేది పాఠ్య ప్రణాళికాభివృద్ధిలో అంతర్గత ప్ర క్రియ. అది వివిధ అభివృద్ధి దశల్లో అంటే- ప్రణాళికాభివృద్ధి, ఆచరణ, నవీకరణలలో నాణ్యతను మెరుగుపరుస్తుంది. బోధనాభ్యసన ప్రక్రియలో అది విడదీయరాని భాగం. విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి, వర్గీకరణ కోసం మూల్యాంకనాన్ని ఉపయోగించడం కొత్తేమీ కాదు. మూల్యాంకనాన్ని విద్యార్థుల సాధనను అభివృద్ధి పరచే అంశంగా గ్రహించాలి. మూల్యాంకనం ఒక బోధనా మార్గంగా, ఉపాధ్యాయులు- విద్యార్థుల మధ్య పరస్పర చర్యకు దోహదమిచ్చి బోధనాభ్యసన సరళిని సులభతరం చేస్తుంది. అది బోధన, అభ్యసన సరళిలో శీల సంతులనాన్ని కలుగ జేస్తుంది. మూల్యాంకనం విద్యార్థుల మూర్తిమత్వం అభివృద్ధి చెందేలా దోహనం చేస్తుంది.
మూల్యాంకనం లక్ష్యాధారమైంది. ఈ లక్ష్యాలు సాంఘిక పరిస్థితుల పద్ధతుల నుండే గాక ఆర్థిక వ్యవస్థ, మానసికాభివృద్ధి, సాంస్కృతిక పరంపర, మానవ విజ్ఞాననిధి నుంచి ఉంటాయి. మూల్యాంకనం అనేది పూర్వ, ప్రస్తుత పరీక్షా పద్ధతులను పాటించడంలో లోపాలను అధిగమించడానికి ఉపాగమమని చెప్పవచ్చు. బోధనాభ్యసన పరిస్థితులు అభ్యాసకునికి విశదమైన తరువాత అభ్యసన జట్టు లక్ష్యాలను ఎంతవరకు సాధించిందో తెలుసుకునే దిశగా మూల్యాంకనం చేయడానికి ప్రయత్నం జరగాలి. అభ్యసన స్థాయిల్లో ఏవైనా లోపాలను గుర్తించినట్లయితే అవి- బోధనాభ్యసన సామగ్రి గ్రహణానికి తగిన వ్యూహాలను, కావలసిన శక్తులను వెలువరించ లేకపోయినవని భావించవచ్చు. సమగ్ర మూల్యాంకనం నిపుణతలను పొందేందుకు, సమీక్షలకు ఆధారమవుతుంది.
1986-నూతన విద్యా విధాన పద్ధతులను అనుసరించి ‘మూల్యాంకనం’ అనుభవం నూతనమైన విధానంతో ఆధునిక ధోరణిలో విస్తృతమైన పరిధిని ఆవరించి ఉంటుంది. అలాంటి మూల్యాంకనం నిరంతరంగా, సమగ్రంగా జరగాలన్నదే నూతన పోకడ. సాంప్రదాయక పద్ధతిలో జరిగే మూల్యాంకనంలో ముఖ్యమైన లోపం- అది కేవలం విద్యా విషయములతో కూడినదై ఉండడమే. మూల్యాంకన విధానంలో పాఠ్యేతరాంశాలను ఉపేక్షించడంతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కాదు. ఈ పరిస్థితి మన విద్యాసంస్థలలో అసమగ్రమైన మూర్తిమత్వాభివృద్ధికి ఫలితమని అంగీకరించాలి. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్న పరిస్థితికి దిగజారింది. సమగ్ర మూల్యాంకనం- సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య గల వ్యత్యాసాన్ని తొలగించడానికి ఉపాగమం. విద్యార్థి వ్యక్తిగత లక్షణాలు, గుణాలు, అభిరుచులు, ఆరోగ్య స్థాయి, సహ పాఠ్యాంశ క్రియలలో ప్రావీణ్యత మొదలైన అన్ని రంగాలకు సంబంధించిన మూర్తి మత్వ లక్షణాలను మూల్యాంకనం చేయడానికి మేలైన విధానం అవసరం. సమగ్ర మూల్యాంకనానికి సంప్రదాయేతర మెలకువలను ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకు పరిశీలన, తనిఖీ పట్టిక, ప్రమాణ పట్టిక, రాత, వౌఖిక పరీక్షలకు తోడుగా మానసిక పరీక్షలు, సామర్థ్య నిర్ణయ పరీక్షలు, మూర్తిమత్య పరీక్షలు మొదలైనవి. ఈ రకంగా సమగ్ర మూల్యాంకనం ద్వారా ఎప్పటికప్పుడు విలువ కట్టబడే అంశాల ద్వారా విద్యార్థుల శక్తిని, బలహీనతల్ని తెలిసికొని వాటికి పరిష్కార మార్గాలను ఏర్పాటుచేసి బోధనాభ్యసన పద్ధతులను అభివృద్ధి చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యార్థుల్లో నైపుణ్యాల స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇదే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధునిక ధోరణి.

- డాక్టర్ సరోజన బండ