సబ్ ఫీచర్

అమూల్య బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నడు లేనివిధంగా ఈసారి ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో సరికొత్త ఒరవడి సృష్టించిన భారతీయ మహిళా క్రికెట్ టీమ్‌కు ఎల్లడెలా ఆదరణ, ప్రశంసల జల్లు కురిసింది. ఎంతోమంది తమ అభిమానాన్ని ఈ టీమ్ క్రీడాకారిణుల పట్ల చాటుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన
జయా బాహీటి అనే ఈ చిత్రకారిణి కూడా తన కుంచెతో గౌరవాన్ని చాటిచెప్పారు. ఇందుకోసం కాన్వాస్‌పై అద్భుత బహుమతిని సృష్టించారు. మహిళా క్రికెట్ టీమ్‌లో తన సత్తా చాటుకుంటున్న ముంబయికి చెందిన స్మృతి మందన అంటే జయా బాహీటికి ఎంతో ఇష్టం. ఆమె కోసం ఓ ప్రత్యేక పెయింటింగ్ వేశారు. సృజనాత్మకతకు నిలువుటద్దంగా నిలిచే ఈ పెయింటింగ్ వేయటం కోసం ఆమె మూడు రోజులు ఆలోచించారు. స్మృతీ మందన కళ్లలో కనిపించే స్ఫూర్తి ఎంతోమందికి ఔత్సాహిక క్రీడాకారుణిలకు ప్రోత్సాహనిస్తుందంటారు జయా బాహీటి. తాను వేసిన పెయింటింగ్‌లోనూ అదే స్ఫూర్తి కనిపిస్తుందని జయా చెబుతున్నారు. ఈ చిత్రంలో హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచే చార్మినార్, వివిధ సమాధులను పొందుపరిచారు. ఇందులో ఓ బ్యాట్‌ను, బంతిని జోడించారు. బంతి ఎర్రగా ఉదయించే సూర్యుడి వలే ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే క్రికెట్ ఆడేటపుడు మందన కూడా తన బంతి ఎలా మెరిసిపోతుందోనని చూపేంచేదని, అందుకే బంతిని సూర్యుడిని ప్రతిబింబించేలా చిత్రీకరించానని చెబుతున్నారు. జయా బాహీటి తన చిత్రాలలో ఎక్కువగా వికసించే కమలాన్ని చూపిస్తోంది. అలాగే ఈ చిత్రంలోనూ ఈ పువ్వు కనిపిస్తోంది. ఇందులో త్రిశూలాన్ని కూడా జయ చిత్రీకరించారు. ఇది స్మృతీ మందన పోరాటానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ పెయింటింగ్ స్మృతీ మందనాకు తప్పక నచ్చుతుందని జయ విశ్వాసం.

చిత్రాలు.. స్మృతీ మందనపై గౌరవంతో వేసిన పెయంటింగ్ ఇదే..