సబ్ ఫీచర్

విటమిన్ సితో కేన్సర్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిమ్మజాతి పండ్లలో అధికంగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యానికి అది ఎంతో ఉపకరిస్తుందని అందరికీ తెలిసినదే. కానీ లుకేమియా వంటి కేన్సర్‌ను నిరోధించే విషయంలో విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. తాజా అధ్యయనం ఈ విషయాన్ని రూఢీ చేసింది. ‘సెల్’లో ప్రచురితమైన ఓ నివేదికలో ఈ విషయం పొందుపరిచారు. జన్యుపరమైన లోపాల కారణంగా మూలకణాలు అపరిమితంగా పెరగడం వల్ల వచ్చే లుకేమియా కేన్సర్‌తో విటమిన్ సి పోరాడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. మనిషి శరీరంలోని టెట్ మిథిల్‌సైటోసిన్ డిక్సోజినేజ్ 2 (టిఇటి2) జన్యువులో లోపాలు తలెత్తి లుకేమియా కేన్సర్ వస్తుంది. ఇది రోగికి చాలా అసౌకర్యాన్ని, అస్వస్థతను కలిగించే పరిణామం. విటమిన్ సి వాడటం వల్ల టిఇటి2 జన్యువు ఎటువంటి లోపాలకు గురికాకుండా చూస్తుందని, లుకేమియాకు కారణమైన కేన్సర్ కణాల వృద్ధిని నెమ్మదింప చేస్తుందని తేలింది. కేన్సర్ రోగులకు విటమిన్ సి వాడాలని సూచించడం సాధారణమని, ఇది కేన్సర్ వ్యాప్తిని అడ్డుకుంటుందని, ముఖ్యంగా జీర్ణకోసం, పెద్దపేగులు, ఉదరం, నోరు వంటి భాగాల్లో వచ్చే వ్యాధులను విజయవంతంగా అడ్డుకుంటుందని సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీకాంత్ తెలిపారు. అయితే ఎముకల మూలుగలో వచ్చే కేన్సర్, లుకేమియావంటి వాటిని నిరోధించడంలోనూ సి విటమిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని ఇటీవలికాలంలో నిర్వహించిన పలు పరిశోధనల్లో తేలిందని ఆయన చెప్పారు. కీమోథెరపీతోపాటు సి విటమిన్, నోటిలో వేసుకునే కేన్సర్ నిరోధక ఔషధాలు ఇస్తే లుకేమియాను నిరోధించడంలో చక్కగా పనిచేశాయని మరో అంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. కేవలం విటమిన్ సి ఒక్కటే ఇస్తే సరిపోదన్నది ఆయన అభిప్రాయం. జంతువుల్లో కేన్సర్ కణాల వ్యాప్తిని విటమిన్ సి అడ్డుకుంటున్న విషయం రూఢీ అయిందని అధ్యయనంలో తేలింది. అయితే నరాలలోకి విటమిన్ సి ఔషధాలు ఇవ్వడాన్ని యుఎస్‌ఫుడ్ అండ్ డ్రగ్స్ సంస్థ అనుమతించడం లేదు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాలన్నది ఆ సంస్థ అభిప్రాయం. ముఖ్యంగా రోగి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు పరిపూర్ణంగా జరగాలన్నది ఆ సంస్థ సూచన. సాధారణంగా కేన్సర్ రోగులకు ఆహారంలో సి విటమిన్ ఉండేలా చూస్తామని, లేదా కొంత మేర ఔషధాలతోపాటు వాడేందుకు సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో కణుతుల అభివృద్దిని విటమిన్ సి అడ్డుకుంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని, కానీ క్లినికల్ అనుభవంలో అంత గట్టిగా చెప్పే ఆధారాలు లేవని మరో సీనియర్ అంకాలజిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం కేన్సర్ రోగులు, వైద్యుల్లో సరికొత్త ఆశలు రేపుతోంది.

-రవళి