సబ్ ఫీచర్

వ్యవసాయాభివృద్ధే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడున్న పరిస్థితుల్లో ఇండియా వంటి వ్యవసాయ దేశాల్లో పేదరిక నిర్మూలనకు వ్యవసాయ అభివృద్ధే మేలైన మార్గమని 2008 ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఇతర ఆదాయ మార్గాలతో పోల్చితే వ్యవసాయం పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో రెండు రెట్లు అధిక సానుకూలమైందని ఆ నివేదిక నొక్కి చెప్పింది. గ్రామాల్లో 80 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారని 2012 అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది గ్రామీణుల ఉపాధి వనరులను త్వరితగతిని పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నది. ఇటీవలి కాలంలో గ్రామీణ ఆదాయ వనరులు పెరిగిన మాట నిజం. కాని అవి వాస్తవ ఆదాయ వనరులు పెరుగుదలని చెప్పలేం. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెరుగుదలతో ఆదాయాలు స్వల్పంగా పెరిగాయి. అదే కాలంలో ఇతర వస్తు సామగ్రి, చదువు, ఆరోగ్య ఖర్చులు కూడా అంతకన్నా అధికమయ్యాయి. కనుక ఆదాయ పెరుగుదలతో చేకూరిన లాభం ఏమీలేదు. నగర జీవుల ఆదాయాలు ఇప్పటికీ గ్రామీణుల కంటే 3రెట్లు అధికమని అంచనా.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గతంకంటే చాలా బలహీనంగా వుంది. జనాభా పెరిగి వ్యవసాయ కమతాల విస్తీర్ణం తగ్గింది. ఇది వ్యవసాయ కుటుంబాల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ కమతాల సగటు విస్తీర్ణం ఎకరం లోపే వుంది. 68వ రౌండ్ సాంపిల్ సర్వే ప్రకారం 2004-2012 మధ్యకాలంలో 36 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేసారు. వీరందరూ అసంఖ్యాక అసంఘటిత శ్రామిక సేనలో చేరారు. ఈ రెండు రంగాల మధ్య జరిగిన కదలిక అసంఘటిత రంగంలో పోటీని తీవ్రతరం కావించింది. ఫలితంగా శ్రామికుల దినసరి వేతనాలు తగ్గాయి. పని దొరికే రోజులూ తగ్గాయి. మరోవైపు వ్యవసాయ శ్రామికశక్తి బాగా తగ్గిపోయింది. మునుపెన్నడూ లేనంత తక్కువ మంది నేడు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న గట్టి సవాలు ఉద్యోగ కల్పన. ఉద్యోగార్థులు 2.23 శాతం పెరుగుతూ వుంటే ఆర్థిక వ్యవస్థ ఉద్యోగ కల్పనా సామర్థ్యం 1.40 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. అంతేకాదు ఉద్యోగ కల్పనాశక్తి క్రమంగా క్షీణిస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాదాపు ఏడాదికి 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి అందించి కొంతమేరకు ఊరట కలిగించింది. పదేళ్ళ కాలంపాటు ఈ కార్యక్రమం గ్రామీణులను ఆదుకొన్నప్పటికీ 2012 తరువాత ఈ పథకం ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పని దినాలు, ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్యా తగ్గింది. గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సవాళ్ళను వేగంగాను, సమర్ధవంతంగాను పరిష్కరించాల్సి వుంది. వ్యవసాయాభివృద్ధి చేయాలి. వ్యవసాయేతర వృత్తులను బలపరచాలి. ఈ రెండు రంగాలు పుంజుకొని నిలకడగా గ్రామీణాభివృద్ధి జరగడానికి ప్రభుత్వ పెట్టుబడి, చొరవ తప్పనిసరి. మొత్తం సాగుభూమిలో సగం ప్రాంతానికి మాత్రమే నీటి వసతి వుంది. మిగిలిన సగం వర్షాధార వ్యవసాయమే. వర్షపాతంలో హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులతో మెట్టవ్యవసాయం కుదేలైంది. వాటర్‌షెడ్ కార్యక్రమం ద్వారా వర్షాధార సాగును లాభసాటిగా మార్చవచ్చునని అనుభవాలు చాటిచెబుతున్నాయి. మెట్ట్భూములలో 40 శాతం ఆహార ధాన్యాలు, పప్పులు, చిరుధాన్యాలు, నూనెగింజలు పండిస్తున్నారు. ఇవి దేశ ఆహార భద్రతకు, పోషకాహార లభ్యతకు చాలా ముఖ్యం. వాటర్‌షెడ్ గ్రామాల్లో తాగునీటి కొరతనూ తీర్చుతుంది. వ్యవసాయాభివృద్ధికి భూసారం మరోముఖ్యాంశం. సహజ సేంద్రియ పదార్థం లోపించి దేశవ్యాప్తంగా చాలాచోట్ల భూమి నిస్సారమైంది. సేంద్రియ ఎరువులు, కీటక నాశనులను ప్రోత్సహించాలి. వ్యవసాయంపై జిడిపిలో 1.7 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీన్ని కనీసం 5 శాతానికి పెంచాలి. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయేతర వృత్తుల శిక్షణకు అనుసంధానించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార ధాన్యాలు శుభ్రపరచి, విలువ పెంచి అమ్మకాలు చేయించడం నేటి అవసరం. అలాగే వివిధ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను గ్రామాల్లో నెలకొల్పాలి. మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, వౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామ వికాసం వేగవంతవౌతుంది. దేశం నిలకడైన అభివృద్ధిమార్గంలో పయనిస్తుంది.

- వి.వరదరాజు