సబ్ ఫీచర్

ఇదేనా సాధికారత? సవాళ్ల ఎదురీతలో ఆధునిక మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నది నిర్వివాదాంశం. వాళ్ళు అడుగుపెట్టని రంగమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలలోనైతేనేమీ, వ్యాపార రంగంలోనైతేనేమి, సినిమా రంగంలోనైతేనేమి- మొత్తం ప్రపంచానే్న ఏలేస్తున్నారు. ఏ కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఎక్కువగా మహిళలే కన్పించడం సర్వసాధారణమైపోయింది.
అలాగే విద్యారంగంలో కూడా అబ్బాయిలకంటే అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. ఫలితాలు వెలువడినప్పుడు బాలికలదే పైచెయ్యి అన్న వార్తలు వెలువడుతుంటాయి.
అంతా బాగానే ఉంది కాని మరో కోణం నుంచి చూస్తే నేటి మహిళలకు సుఖశాంతులు దూరమయ్యాయేమోననిపిస్తుంటుంది. దాంతోపాటు సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇంటా బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
కొన్నిచోట్ల అయితే భర్త నిరుద్యోగి. ఏ పని చెయ్యడు. భార్య అన్ని విషయాలు చూసుకోవాలి. కట్టుకున్న భర్త బాధ్యతారహితంగా తిరుగుతుంటే ఆ బాధ్యతలను తన నెత్తిన వేసుకుని ఇంటి భారాన్ని మోస్తుంటుంది భార్య. పూర్వం మన అమ్మల కాలంలో భర్త సంపాదించి పెడితే ఇంటిని చక్కబెట్టుకుంటూ ఇంటి పట్టున ఉంటూ, ఎండ దెబ్బ సైతం తమపై పడకుండా నీడ పట్టున శాంతి సౌఖ్యాలతో ఉండేవారు.
కాని ఇప్పుడో.. ఉరుకులు పరుగుల జీవితమైపోయింది. మగవారితో సమానంగా చెమటోడ్చి సంపాదనకు సిద్ధపడుతున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలలో తలదూర్చి ఎన్నో అవమానాలను పొందుతున్నారు. అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రమాదాలు మరో ఎత్తు.
తాము పనిచేసే కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురికావడం, మరెన్నో అవమానాలను ఎదుర్కొనడం, ఒంటరిగా బస్సుల్లో, ఆటోల్లో, ద్విచక్రవాహనాల్లో వెళ్తున్నపుడు అత్యాచారాలకు, అకృత్యాలకు గురికావడం జరుగుతోంది.
ఆఫీసులో అలుపెరుగక పనిచేసి ఇంటికి వస్తే ఇంట్లో భర్త, అత్తమామల వేధింపులు. తమ వ్యాపార ప్రకటనల కోసం స్ర్తి అంగాంగ ప్రదర్శనలతో లబ్ధిపొందడం, ఫ్యాషన్ షోల పేరిట స్ర్తిల అందమైన శరీరాలను వివిధ భంగిమల్లో ప్రదర్శించడం- మహిళా సాధికారత అంటే ఇదేనా? మన భారతీయ సంస్కృతిని విడనాడి పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం భావ్యమేనా?
ఇలా ఆధునిక మహిళకు సమస్యలు ఎక్కువనే చెప్పాలి. ఆమె ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నా దానికి తగ్గట్టు సమస్యలు ఉండనే ఉంటాయి.
అన్నిటికి ఆధారం ఆడదే అన్నట్లు కొంతమంది మగవాళ్ళు పూర్తిగా బాధ్యతలను అప్పగించేస్తుంటారు. ఆర్థికపరమైన స్వేచ్ఛను కూడా ఇచ్చేస్తుంటారు. కాని వాళ్ళు చేసింది మేలు అనుకుంటే పొరబాటే. జీతం తెచ్చి భార్య చేతికి అందించి తరువాత తమ ఇష్టారాజ్యంగా తిరుగుతుంటారు. ఇంటి గురించి, పిల్లల చదువుల గురించి అస్సలు పట్టించుకోరు.
ఒక్కోసారి ద్విచక్రవాహనాల్లో స్ర్తిలు తమ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను ఎన్నో అవస్థలు పడుతూ స్కూళ్ళకు, ట్యూషన్‌లకు తీకువెళ్తుండడం చూస్తుంటాం. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తుంటారో అర్థంకాదు. ప్రస్తుతం స్ర్తిలు తమ సుకుమారత్వాన్ని కోల్పోయారేమోననిపిస్తుంటుంది. మహిళలు సాధికారతను సాధించి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అభివృద్ధి సాధిస్తున్నారని ఆనందించాలో, ఇంటి గడప దాటి బయటకొచ్చిన ఆడవాళ్ళు మరెన్నో సమస్యలను సవాళ్ళను ఎదుర్కొంటున్నారని బాధపడాలో అయోమయంగా వుంది.

-పి.షహనాజ్