సబ్ ఫీచర్

చైనా బొమ్మలకు శృంగభంగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా వెళ్లకుండానే, దీపావళి సందడి, సందు మొగన ‘్ఢం ధామ్’ చప్పుళ్ళు మొదలు అవుతాయి. అది ఏమి విడ్డూరమో చైనా అంటే మనకి అరికాలి మంట నెత్తికెక్కుతుందా? పండుగలు అనేసరికి దీపంబుడ్లు, బాణసంచా ముఖ్యంగా లక్ష్మీదేవి, గణేష్ ఇత్యాది దేముడి బొమ్మలు వాళ్ళవే కావాలి- అందంగా సరసమైన ధరలకి దొరుకుతాయిట. కానీ ఈసారి, అసలయిన చోట అరుణాచల్‌ప్రదేశ్‌లోనే చైనా లక్ష్మికి జనాలు మొండి చెయ్యి చూపెడుతున్నారు. అసలు అరుణాచల్ ‘మాది అంటూ బుకాయిస్తున్న’ చైనాకి గుణపాఠం చెప్పాలని అరుణాచల్ యువత- ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో అతి చక్కని ‘లక్ష్మీదేవి గణేష్ ప్రభూ’ల బొమ్మలు చైనా విగ్రహాలకు తీసిపోని కళా నైపుణ్యంతో తయారుచేస్తున్నారు. వాళ్ళ బొమ్మలు నిషేదాన్ని ఎంత కాదన్నా; దొడ్డిదారంట వచ్చినా, ధరలు అందుబాటులో వుంటాయి అంటున్నారు మనవాళ్ళు. అరుణాచల్‌ప్రదేశ్ విగ్రహాలకు ‘అరుణాచల్ లక్ష్మి’ అని పేరెట్టారు. అరుణాచల్ ప్రజకి చైనా వాడికి బద్ధవైరమున్నది. ఈ రాష్ట్రం చైనాలోదేనంటాడు డ్రాగన్‌వాడు. ఇవాళ అరుణాచల్‌కి సొంత ఐడెంటిటీ దేశంలో ఒక భాగంగా కావాలి. ఈ అరుణాచల్ లక్ష్మి బొమ్మల్ని రాష్ట్ర హోం మంత్రిగారు మొన్న మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సగర్వంగా ఆవిష్కరించాడు. నినాదం ఏమిటీ అంటే? ‘అరుణాచల్ లక్ష్మి ఘర్ లే చలో జ్యాదా ధన్ పావో’- మన లక్ష్మి మీ ఇంటి ధనలక్ష్మి అని అర్థం. ఈసారి, చైనా బొమ్మలకి డిమాండ్ పడి తీరుతుందని దేశం మొత్తంమీద టోకు వర్తకం చేసే ఢిల్లీ బొమ్మల బడా వ్యాపారులు చెప్పారు. విరిగినా చెడినా వీటికి బదలా ఇవ్వాలి అంటే అవి దేశవాళీ బొమ్మలయితేనే అది సాధ్యం- వీటిని అడ్డదారంట - లంచాలు పెట్టి తెచ్చి భయం భయంగా వ్యాపారం చెయ్యడం రిస్క్, వద్దు అనుకుంటున్నాం. మన వాళ్ళు కూడా చీనా దేశపు నైపుణ్యం సంపాదించారు అన్నాడు ఆ వ్యాపారి కుమారుడు. మొబైల్స్ కాదుగా ఇవి? మన లక్ష్మీ బొమ్మలు మనవే అనుకుంటే చాలు. వాడుకోవడంలో దేశభక్తి కూడా వుంది, సంస్కృతి వుంది అని చాలామంది అనుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి దీపావళి కొనుగోళ్ళు దెబ్బతింటే చైనాకి శృంగభంగమే అయినట్లు- ఏటంటారు?

ముమ్మారు ముంచి తీశారు అంతే!

ముంబాయిలోని చోటా కాశ్మీర్ సరస్సుకి దగ్గరగా వున్న గోరేగాంవ్ ఆరె మిల్క్ కాలనీ విద్యార్థులు అంతా కలిసి ఒక చిన్న తొమ్మిది అడుగుల వ్యాసం, రెండు అడుగుల లోతుగల కొలను నిర్మించారు. గణేష్ నిమజ్జనం కోసం దీన్ని వాడి మొత్తం 72 విగ్రహాలని నిమజ్జనం చేశారు. ముమ్మారు ముంచారు- విగ్రహం తడిసేదాకా- ఆనక బయటికి తీసి పూజ చేసి- ఆ విగ్రహాలను ‘నవీ ముంబయి’లో వున్న బొమ్మల కార్ఖానాకి పంపించేశారు. మళ్లీ కొత్తవిగా చేసి ఏడాదికి మార్కెట్‌లోకి తెస్తారు. లాంఛనం ముఖ్యం. భక్తి ముఖ్యం- పొల్యూషన్ కాదు అన్నారు వాళ్లు. మొత్తం మాలిన్యం అంటే- దేముడిమీద నుంచి తీసిన పూలూ పత్రీ అంతా ‘రీసైక్లింగ్’కి పంపేశారు. మన భవితకి ఇటువంటి యువతే కదా కావాలి!