సబ్ ఫీచర్

ప్రత్యేక బలవర్థక ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పౌష్టికాహారం లభించక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ రెట్టింపు చేసిన బలవర్థక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉప్పు, గోధుమపిండిని ఇప్పుడున్నదానికన్నా రెట్టింపు పోషకాలతో అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆ సంస్థ యోచన. అయితే అది ఎవరుపడితే వారు తినడానికి కాదు. రక్తహీనత, ఐరన్, కాల్షియం లోపంతో బాధపడేవారికోసం దీనిని సిద్ధం చేస్తున్నారు. ఈ సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది ఉపయోగించడం అంత సులభం కాదు. వైద్యులు సూచించిన ఆహార పదార్థాలు, మందులు అరగించుకోలేని వారి కోసం మాత్రమే ఇవి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మన దేశంలో గర్భిణుల్లో 50 శాతం మంది రక్తహీనతతోను, 70 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఐరన్ లోపంతోను బాధపడుతున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 25శాతం మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. ఇక 18నుంచి 30 శాతం మంది చిన్నారులు ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇవన్నీ ఆహారంలో అసమతుల్యత, పౌష్టికాహారం లోపాలవల్ల వస్తున్నవే. వీటిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం భారత ఆహార భద్రత, ప్రమాణాల సరికొత్త బలవర్థక గోధుమపిండి, ఉప్పును అందుబాటులోకి తెస్తున్నది. అయితే ఇప్పటికే ఆయా పదార్థాలను అందిస్తున్న వ్యాపారవర్గాలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఉప్పులో అయోడిన్, ఐరన్, వెజిటబుల్ ఆయిల్, పాలు, విటమిన్ ఎ, డితో కలిపి బలవర్థక ఉప్పును సిద్ధం చేయనున్నారు. అలాగే గోధుమపిండి, కొన్ని రకాల బియ్యపు పిండిని ఐరన్, ఫోలిక్ ఆసిడ్, జింక్, విటమిన్ బి12, విటమిన్ ఎతోపాటు మరికొన్ని సూక్ష్మ పోషకాలను మిళితం చేస్తారు. అయితే వీటిని అందుబాటులోకి తెచ్చాక వైద్యులు లేదా పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు వినియోగించవలసి ఉంటుంది. కానీ సొంతంగా ఎవరికివారు వీటిని వినియోగించే ప్రమాదం పెరుగుతుంది. ఇది వాంఛనీయం కాదు. నిజానికి తాజా ఆకుకూరలు, పాలు, పళ్లు, పప్పుదినుసులు, చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలతో సమతుల్య ఆహారం లభిస్తుంది. కానీ ఈ సరికొత్త బలవర్థక ఆహారంలో కొన్ని రసాయనాలను కూడా మిళితం చేస్తారు. అందువల్ల ఎవరుపడితే వారు వీటిని వినియోగించడం సరికాదు. రక్తహీనత, తక్కువ బరువు, ఎముకల బలహీనత ఉన్నవారు మాత్రమే వీటిని వినియోగించవలసి ఉంటుంది. అయితే ఈ సరికొత్త బలవర్థక ఆహారాన్ని వినియోగంలోకి తీసుకురావాలా, వద్దా అన్న విషయంలో అధికారవర్గాల మధ్య ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రెట్టింపు బలవర్థక ఆహారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆహారాన్ని ఎవరికి ఇవ్వాలన్నది గుర్తించడంపై సందేహాలు ఉన్నాయి. ఆహార పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సమన్వయంతోనే ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వగలదు.

-కృష్ణతేజ