సబ్ ఫీచర్

ప్రాణాలు తీస్తున్న ‘సంస్కృతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో తుపాకుల సంస్కృతి సాధారణ పౌరుల భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో అపరిమిత స్వేచ్ఛ, విచ్చలవిడి సంస్కృతి తాజా పరిణామాలకు కారణమవుతోంది. ప్రపంచ జనాభాలో అగ్రరాజ్య జనాభా కేవలం 4.4 శాతం. అయితే అధికారికంగా తుపాకులను కలిగి ఉన్నవారి సంఖ్య ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో సగంమందికి ఉండాల్సినన్ని పౌరులు ఉపయోగించే తుపాకులు ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలో ఉన్న మొత్తం తుపాకుల్లో అక్కడి జనాభాలో 3 శాతం మంది వద్ద ఉన్నాయంటే నమ్మాలి. తుపాకులతో జరిపిన కాల్పుల్లో నలుగురికి మించి మరణిస్తే అమెరికాలో మాస్ షూటింగ్‌గా పరిగణనిస్తారు. ఆ లెక్కన 2012 నుండి ఇప్పటివరకు 1500 సామూహిక కాల్పుల సంఘటనలు నమోదైనాయి. ఏటా ఒక్క అమెరికాలోనే 3వేలమంది బుల్లెట్లకు బలవుతున్నారన్నది కఠిన నిజం. వీటిలో మూడొంతులు తుపాకులతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలే. తాజాగా లాస్‌వెగాస్‌లో సంగీత కచేరికి వచ్చినవారిపై ప్యాడక్ అనే ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పెద్దసంఖ్యలో శ్రోతలు గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా అక్కడ పేరుమోసిన సెలబ్రిటీలు తుపాకీ సంస్కృతిపై గళం విప్పారు. నిజానికి గత ఎన్నికల్లో గన్ కల్చర్‌ను డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ తుపాకుల సంస్కృతికి గట్టిగా మద్దతు తెలిపారు. అయితే తాజా సంఘటనపై ఆయన తీవ్రంగానే స్పందించారు. ఉగ్రవాదానికి మతం, కులం, వర్ణం, ప్రాంతం, పార్టీలు అన్న తేడా ఉండదని, ఈ మారణహోమాన్ని అడ్డుకునేందుకు పార్టీల అభిప్రాయ బేధాలు విడనాడి ప్రజల రక్షణకు కదలి రావాలని ప్రముఖులు పిలుపునివ్వడం తాజా పరిణామం. పాప్ రారాణి లేడి గగా చేసిన ఈ ట్వీట్‌కు ఆమెను ట్విట్టర్‌లో అనుసరిస్తున్న 71 మిలియన్ల మంది స్వాగతించారు. లాస్‌వెగాస్‌లో దుర్ఘటనతో తన మనసు చెదిరిపోయిందని మాంచెస్టర్‌కు చెందిన సంగీత కళాకారుడు గ్రాండే వ్యాఖ్యానించాడు. గతంలో ఆ నగరంలో ఐసిస్ తీవ్రవాదులు చేసిన దాడిలో 22మంది మరణించిన విషయం తెలిసిందే. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సులువైన నిబంధనలతో జారీ చేస్తున్న తుపాకులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని, లాస్‌వెగాస్ సంఘటనలో నిందితుడికి లభించిన గన్ లైసెన్సు అందుకు ఉదాహరణ అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ విమర్శించారు. ‘హియరింగ్ ప్రొటక్షన్ యాక్ట్’ ప్రకారం సైలెన్సర్ తుపాకులను కొనడం, లైసెన్సు పొందడం అక్కడ అతి సులువు. నిప్పులు కక్కే ఆయుధాల కొనుగోలుకన్నా సైలెన్సర్ తుపాకులు కొనడం అమెరికాలో సులభం. అక్కడి చట్టాలు అలా ఉన్నాయి. అయితే తుపాకులకు లైసెన్సులు ఇవ్వడానికి నిబంధనలు కఠినతరం చేయాలన్నది డెమోక్రాట్ల డిమాండ్. కానీ రిపబ్లికన్లు ఇప్పుడున్న చట్టాన్ని కఠినతరం చేయడానికి ససేమిరా అంటున్నారు. గడచిన మూడేళ్లుగా అమెరికాలో తుపాకులు సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. వారి సంస్కృతే వారికి ముప్పుగా మారడం విషాదం.

-రవళి