సబ్ ఫీచర్

ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. పెరిగిన కాలుష్యం, స్మోకింగ్ లాంటి దురలవాట్లు వీటికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాన్సర్‌కు కూడా కారణం అవుతున్నాయి. అయితే కొన్ని ముందుజాగ్రత్తలు మరియు కొన్ని వ్యాయామాలతో వీటిని ఒక మేర నియంత్రించుకోవచ్చు. కొన్ని ఊపిరితిత్తులను దృఢపరిచే వ్యాయామాలు చూద్దాం.
కడుపులోనుండి శ్వాసించడం
దీర్ఘశ్వాస తీయడంవలన లంగ్ పూర్తిగా విచ్చుకొని వాటి సామర్థ్యం పెరిగేలా చేస్తుంది. దీన్ని బెల్లి బ్రీతింగ్ అని కూడా అంటారు. భుజాలను రిలాక్స్ చేస్తూ కూర్చోవడం లేదా పడుకోవడం చేయండి. ఇపుడు ఒక అరచేతిని మీ పొట్టపై, ఇంకొక అరచేతిని ఛాతిపై ఉంచి దీర్ఘంగా శ్వాస తీయండి. శ్వాస తీస్తున్నపుడు గాలి స్ట్రెయిట్‌గా కడుపులోకి వెళ్ళేలా చూడండి. అపుడు పొట్ట బయటికి వచ్చి చెయ్యి పైకి లేస్తుంది. కొన్ని సెకండ్ల తరువాత పెదాలను మూసి గాలిని మెల్లిగా వదిలేయండి. అరచేతితో కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ. ఇలా నాలుగైదు సార్లు చేయండి.
పెదాలను మూసి శ్వాసించడం
పెదాలను మూసి ఉంచి రెసిస్ట్ చేస్తూ గాలి పీల్చడంవలన కూడా లంగ్స్ సామర్థ్యం మెరుగుపడుతుంది. రిలాక్స్‌గా కూర్చొని ముక్కు గుండా గాలిని పీల్చండి. పౌటింగ్‌లా పెదాలను పెడుతూ గాలిని మెల్లిగా నోటినుండి వదలండి. ఇలా చేయడంవల్ల ఎయిర్‌వేస్ ఎక్కువసేపు తెరువబడి ఉండి ఊపిరితిత్తులు సులువుగా ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటుంది. ఇది ఎక్కడైనా ఎపుడైనా చేయవచ్చు.
నీటిలో చేయగల వ్యాయామాలు
నీటిలో చేసే వ్యాయామాల వల్ల శరీరంపై చాలా ఒత్తిడి పడుతుంది. దీనితో ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇది లంగ్స్ దృఢపడడానికి దోహదపడుతుంది. స్విమ్మింగ్‌తోపాటు ఇంకా కొన్ని వ్యాయామాలు నీళ్ళల్లో చేయవచ్చు. వీటిలో స్ట్రెచింగ్ మరియు వెయిట్ ట్రైనింగ్ ప్రధానమైనవి. మెడ వరకు నీటిలో దిగి ఈ వ్యాయామాలు చేయాల్సి వుంటుంది.