సబ్ ఫీచర్

చిరునవ్వు చెదురుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేది ఆర్యోక్తి. అంటే మహిళకు గౌరవం దక్కిన చోటే దేవతలు నడయాడుతారు అని అర్ధం. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లగా పుట్టడం, పుట్టినా సురక్షితంగా మనుగడ సాగించడమే దుర్భరమైన దురవస్థ ఉంది. అందుకే బాలికల హక్కుల ఉల్లంఘన, మానవ హక్కులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి తెలియజేయడంతోపాటు బాలికలకు అవగాసన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 19న 2011లో ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11వ తేదీన 2012నుండి అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఈ దినాన్ని ది పవర్ ఆఫ్ అడలొసెంట్ గర్ల్-విజన్ 2030గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ‘ప్రజా సమూహాల్లో చైతన్యం నింపాలంటే ముందు మహిళ మేలుకోవాలి. స్ర్తి కళ్లు తెరిస్తే కుటుంబం, దానితోపాటు గ్రామం, ఆవెంటే దేశం పురోగతి బాట పడతాయి’ అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు. కౌమారదశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ దినాన్ని ఐరాస ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా బాలికలపట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేదింపులు, అత్యాచారాలు ఆమెను రక్షించడానికి కుటుంబం, మిత్రులు, సమాజం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకు విద్యే ప్రధాన ఆయుధం. భారతదేశంలో 47 శాతంమంది మధ్యవయసు బాలికల్లో (కౌమార దశలో) బరువు తక్కువ లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారు. బాలికల విద్యకోసం ఉద్యమిస్తున్న పాకిస్తానీ బాలిక చొరవ, సాహసం, చైతన్యం ఆమెకు నోబెల్ బహుమతి దక్కేలా చేసాయి. కొద్దిపాటి చైతన్యం వారిలో కలిగిస్తే నిరక్షరాస్య కుటుంబాల్లో కూడా ఎంతోమంది మలాలలు వుద్భవిస్తారు. నేటి ఆడపిల్లలకి తప్పనిసరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో వుంచాలి. సామాజిక, ఆర్థిక,రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి.
దేశమేదైనా అదే వివక్ష
ప్రపంచమంతటా బాలలు, బాలికల మధ్య వివక్ష అంతరాలు కొనసాగుతునేవున్నాయి. చైనా మొదలు అమెరికాతో సహా ఆధునిక వైపు అడుగులు వేస్తున్న భారత్‌లోనూ అమ్మాయిలపట్ల వివక్ష ఉంటుందని గ్లోబల్ ఎర్లీ అడల్సెంట్ స్టడీ పేరిట నిర్వహించిన ఒక అధ్యయనంలో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో అమ్మాయిలు పదహారేళ్ల వయసుకు చేరుకున్నప్పటికీ రెండింతలు కుంగుబాటుకు గురవుతున్నారని తేలిందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్‌హఫ్‌కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కిడ్స్ సంయుక్తంగా 15 దేశాల్లో నిర్వహించిన సర్వేలో అమ్మాయిలు శారీరకంగా బలహీనులని చిన్న వయసులోనే ముద్రపడేలా చేయడంలో తల్లిదండ్రులు, మిత్రులు, టీచర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది. పురుషులకు స్వేచ్ఛవుంటే, మహిళలకు బంధనాలున్నాయని భావన బలపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు అన్నారు.
చిన్నారులపై లైంగిక వేధింపులు
నేడు మహిళా సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మైనర్లపై అత్యాచారాలు ఆగడంలేదు. సమాజంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ కరువవుతున్నది. ఎంతోమంది ఆడపిల్లలు ఈ భూప్రపంచంపై అడుగుపెట్టకముందే ఆదిలోనే మృత్యువుకు బలవుతున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవతా విలువలు మాత్రం పెరగడంలేదు. దానికి నిదర్శనం భ్రూణ హత్యలు. 2001లో బాల్య వివాహాలు చేసుకున్న వారు 66,649 వుండగా 2011 నాటికి 29,18,774 మంది 14 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. ఇలా పసితనం ఛాయలు పోకుండానే పెళ్లి అనే బంధంలో చిక్కుకుంటున్నారు.

మధ్యలో బడిమానేసే బాలికల సంఖ్య ఎక్కువే

తెలంగాణ రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత దేశంలోని మహిళా అక్షరాస్యత కంటే తక్కువ వుంది. బాలికల్లో ఉన్నత విద్యకు చేరే వారి సంఖ్య కూడా తక్కువగా వుంటోంది. ఫ్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ తగ్గడంలేదు. బాల్య వివాహం కారణంగా రాష్ట్రంలోని 28 శాతంమంది బాలికలకు పద్దెనిమిది సంవత్సరంలోపే వివాహాలు చేస్తున్నారు. యునెస్కో వెలువరించిన ప్రపంచ విద్య నివేదిక ప్రకారం ఇండియాలో వయోజన నిరక్షరాస్యులలో మహిళలు 68 శాతం వున్నారు. పంతొమ్మిది ఏళ్లు నిండక ముందే పెళ్లిపీటల మీద ఎక్కుతున్న బాలికల సంఖ్య 41 శాతం అని జనగణనలో తేలింది. బాల్యవివాహాలు, పాఠశాలలు చేరువలో లేకపోవడం, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల కొరత, లైంగిక విచక్షణ వంటి సమస్యలు భారత్‌లో బాలిక విద్యకు శాపంగా పరిణమించింది. పోషకాహార లోపం కారణంగా రక్తహీనతతో బాధపడుతున్న బాలికల సంఖ్య దేశంలో దాదాపు డెబ్బై శాతం అన్న అంచనాలు తీవ్రంగ కలవరపరుస్తున్నాయి. మహిళా కార్మిక శక్తి, వారి ఆదాయం, అక్షరాస్యాత స్థాయి, జననాల విషయం, తదితర అంశాల్లో అధమస్థాయిలో వున్న 20 దేశాల్లో ఇండియా ఒకటి కావడం ఆందోళనకరం. మహిళలు పురుషులకన్నా ఎందుకూ తక్కువ కాదు. ‘ఆడపిల్లలు ప్రతి రంగంలో, చదువులో మొదలుకుని ఆటల దాకా, వారిదైన ముద్ర వేస్తున్నారు. వారు సాధించిన విజయాలకు, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇదే నా వందనం. లైంగికపరమైన విచక్షణకు తావులేని, బాలికలు రాణించడానికి, అన్ని అవకాశాలు లభించగల భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం’ అని గత సంవత్సరం 2016 సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఒక సందేశంలో పేర్కొన్నారు.

లింగ నిర్ధారణ, వివక్ష వల్లే ఈ దుస్థితి

ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాల్లో నలభై శాతంకి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయన్న చేదు నిజాన్ని యునిసెఫ్ బయటపెట్టింది. భారత్‌లో పంతొమ్దిది ఏళ్ల బాలికలు నలభై ఒక్క శాతానికి పైగా ఇప్పటికే బాల్య వివాహాల కోరల్లో చిక్కుకుపోయారు. పేదరికం, అవిద్య తాండవించే రాష్ట్రాలతోపాటు విద్యావంతులు అత్యధికంగా వుండే కేరళలో కూడా బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి ముగ్గురు బాల వధువుల్లో ఒకరు భారత్‌కు చెందినవారేనని అంతర్జాతీయ మహిళా సంబంధ పరిశోధన కేంద్రం స్పష్టీకరించింది.
గర్భస్త శిశువుల లింగ నిర్ధారణను నిషేధించి తద్వారా ఆడపిల్లల భ్రూణ హత్యలు నివారణ కోసం 1994లోనే చట్టం తెచ్చినా అది ఏనాడూ పకడ్బందీగా అమలైన జాడలు లేవు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం బడిలో చేరుతున్న ప్రతి పదిమంది బాలకల్లోముగ్గురు మాత్రమే ఎనిమిదో తరగతి వరకు చదువుకోగలుగుతున్నారు. ఆడశిశువుల భ్రూణ హత్యను మించిన మహాపాపం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినప్పటికీ ఆ పాపం నిత్య నిరంతరాయంగా కొనసాగుతునే వుంది. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. దేశంలో ఏటా సుమారు అయిదు లక్షల (ఆడశిశువుల) భ్రూణహత్యలు జరుగుతున్నట్టు అంచనా. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య 1991లో మగపిల్లల కన్నా 42 లక్షలుతక్కువ. కానీ 2011 నాటికి ఆ వ్యత్యాసం 71 లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగా వున్న చిన్నారుల సంఖ్య 47.2 కోట్లు. అందులో వెయ్యిమంది అబ్బాయిలకు 908 మంది అమ్మాయిలు వున్నారు.

-కె.రామ్మోహన్‌రావు