సబ్ ఫీచర్

కొరడా దెబ్బలకి రోగాలు దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెబ్బకి దెయ్యం ఝడుస్తుంది అని ఒక నానుడి వుంది. దెయ్యాలే కాదు మొండి రోగాలు కూడా పోతాయి అని నమ్మే వేలాది భక్తులు పోయిన వారం తమిళనాడులోని తిరుచ్చి దరి, పవిత్ర వెళ్ళపెట్టి నామక్కల్‌లోని యాచప్పన్ గుడికి పెళ్లాల్ని, పిల్లల్ని తీసుకుని మరీ వచ్చారు. గుడికి వెలుపల ప్రాంగణంలో కనీసం రెండు వేలమంది స్ర్తిలు కనె్నపిల్లలు స్కూలు పిల్లలు కూడా ఐదు గంటలు క్యూలు కట్టి పడిగాపులు పడ్డారు. అక్కడ లోపల భయంకరాకారులైన మగ పూజారులు పెద్ద కొరడాలు బెత్తాలు పట్టుకుని ఉన్నారు. వారి ముందు ఈ ఆడవాళ్లంతా మోకరిల్లారు. పూనకమ్ పూని వున్న ఆ గణాచారులు కొరడాలు బెత్తాలు పట్టుకుని వీరంగం వేస్తూ వున్నారు. వారి ముందు అలసి సొలిసిపోతున్న స్ర్తిలు, బాలలు మోకరిల్లగా ఆ ముష్కరులు చాచి కొరడా దెబ్బలు కొట్టారు. చిన్నపిల్లలకి చేతుల మీద బొబ్బలెక్కేలాగా ఏడుస్తూ బెత్తం దెబ్బలు కొట్టారు. మగాళ్లు కుటుంబాలలోని పెద్దలు హాహాకారాలెత్తుతున్న తమ ఆత్మీయుల ఆర్తనాదాలను భక్తిశ్రద్ధలతో అనుభవించారు. పోలీసులు ఇంచక్కా బందోబస్తు చేశారు. ఎటువంటి పీడా పిశాచమైనా పారిపోవాల్సిందే- ఆడాళ్ళు రోదిస్తూనే దెబ్బలు తింటూ చెప్పారు.. ఇది రెండోసారి లేదా ఇది మూడోసారి రావడం. వాళ్ళకి, వాళ్ళవాళ్లకి కూడా నమ్మకం. బుద్ధి చదుకొనని పిల్లలు ఈ గుడికొచ్చి కఛీ దెబ్బలు తింటే ఫస్టు క్లాసులో పాసవుతారని నమ్మకం! రజస్వల కాలేదని, పెళ్లి సంబంధాలు రావటం లేదని, పిచ్చిగా ప్రవర్తిస్తుందని- ఇలా, మొక్కుకొని ఆచప్పాన్ దగ్గరికి ఆడాళ్ళను తీసుకొచ్చే మగాళ్లకిది బాగానే వుంది. వారు తండ్రి లేదా మామ లేదా తాత అయినా వారి రోగాలకి ఎట్లాంటి శిక్షా లేదు.

తాబేళ్లు అంటే మాటలు కాదు..

చీనా వాళ్ళు మన కూర్మావతారాలంటే పడి చస్తారు. ఏ రకం తాబేళ్లయినా రెడీ అంటూ కొనేస్తారు (కాని మనవాళ్ళు అమ్మరు)- నగలు, దిష్టిబొమ్మలు, నాటుమందులు అవీ చెయ్యడానికి తాంబేలు డిప్పలు- స్టార్ హోటళ్లలో డబ్బు గుమ్మరించి లొట్టలు వేస్తూ తినడానికి తాబేలు మాంసం వాళ్లకి కావాలి. మొన్న ఆదివారం, బెంగుళూరు డిఆర్‌ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ వారు దాడి చేసి రెండు కార్లు పట్టుకున్నారు. నల్ల నగదు దొరకలేదు- నల్ల డబ్బు తెచ్చి ఇచ్చే సరుకు తాబేళ్ల రూపంలో దొరికింది. ఏడు సంచులలో ఒక వెరుూ్య మీద పనె్నండు రకరకాల తాబేళ్లు దొరికాయి. స్మగ్లింగ్‌కి సూత్రధారి అయిన బడాచోర్ ఆచూకీ సైతం దొరికింది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలోనయితే ఆరువేల పదిహేను వందలు మాత్ర మే కానీ రూపాయలలోనయితే నాల్గు కోట్లు. రత్నఖచితంగా కనబడి మెరిసే తాబేళ్లు మన దేశంలో దొరుకుతాయి. మన సముద్రం అందుకేగా రత్నగర్భ అయింది. పాపం వాటికి చైనా అయినా చెన్నై అయినా ఒక్కటే- కొత్తిమీర ఆకులు పడేస్తే చాలు.

-వీరాజీ