సబ్ ఫీచర్

విమానాలకు కాలుష్య కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్యావరణానికి కాలుష్యం వల్ల చేటు జరుగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. మనిషి మనుగడకు సవాలు విసురుతున్న కాలుష్యం రకరకాలుగా ఉంటోంది. వాయు, జల కాలుష్యాలు జీవరాశి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న విమానాలకు కూడా కాలుష్యంవల్ల కష్టాలు మరింతగా పెరగనున్నాయని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది. విమానయానం సందర్భంగా జరిగే చిన్నచిన్న ప్రమాదాలు మూడురెట్లు పెరగనున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. కాలుష్యం వల్ల వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని ఇది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అందువల్ల వాటిల్లో ప్రయాణించేవారు ఇప్పటికన్నా ఎక్కువసేపు, సుదీర్ఘకాలం సీట్‌బెల్టులు ధరించి ఉండాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆకాశం మేఘావృతమై, కల్లోలంగా ఉండటం తరచూ జరుగుతుందని, ఈ వాతావరణంలో విమానాలు సాఫీగా ప్రయాణించవని, కుదుపులకు గురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విమానాల్లో సామాన్లు భద్రపరిచే అరలు, డెక్‌లు దెబ్బతిని జరిగే ప్రమాదాల సంఖ్య మూడురెట్లు పెరగవచ్చని ఆ ఆధ్యయనం అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే రద్దీగా ఉండే వైమానికి మార్గాల్లో అట్లాంటిక్ మీదుగా బ్రిటన్‌కు వెళ్లే మార్గంలో ఇలాంటి ప్రమాదాలు 180 శాతం మేర పెరుగుతాయని, యూరోప్‌లో 160 శాతం మేర పెరుగుదల ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్ట్స్ ప్రొఫెసర్ పాల్ విలియమ్స్ బృందం ఇప్పటికే కొన్ని అంశాలను గుర్తించింది. ముఖ్యంగా గాలిలో ప్రమాదాల (క్లియర్-ఎయిర్ ట్రబులెన్స్ - సిఎటి)లో పెరుగుదల అందులో ఒకటి. భవిష్యత్‌లో భూతాపం కారణంగా విమానయాన రంగంలో వచ్చే మార్పులపై తొలిసారిగా జరిగిన అధ్యయనం ఇది. స్పష్టమైన, కచ్చితమైన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం సాగడం విశేషం. 2050నాటికి వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే విమానయానంలో జరిగే ప్రమాదాలు మూడురెట్లు పెరుగుతాయన్నది ఈ అధ్యయనం సారాంశం. వాతావరణంపై కచ్చితమైన అంచనాలను, సూచనలను పొందడానికి అధునాత సాంకేతిక పరికరాలను విమానాలను నడిపే బృందానికి అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని శాస్తవ్రేత్తల బృందం సూచించింది. వీలైనంత త్వరగా ఆయా విమానాల్లోని ప్రయాణికులు సీట్‌బెల్టులు పెట్టుకునే హెచ్చరిక వ్యవస్థ, సౌకర్యం ఉండేలా చూడాలన్నది మరో సూచన. సిఎటి (గాలిలో వాతావరణ కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలు) సమస్యలు పైలట్లకు కనిపించవు. విమానయానంలో ఎదురయ్యే సమస్యల్లో సిఎటి మొదటిశ్రేణి సమస్య. రాడార్‌లు కూడా సిఎటిని పసిగట్టలేవు. విమానాలు రాకపోకలు సాగించే బహుళ మార్గాల్లో అన్ని కాలాల్లో గాలుల తీవ్రత పెరిగి ఈ అల్లకల్లోల పరిస్థితులు పెరగనున్నాయన్నది శాస్తవ్రేత్త పాల్ విలియమ్స్ బృందం అంచనా. ఈ ఏడాది జూన్‌లో చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం పారిస్ నుంచి పశ్చిమ చైనాకు వెళుతుండగా ఇలా జరిగిన ఒక ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి ఎముకలు విరిగాయి. నిజానికి ప్రపంచం మొత్తమీద ఇలా విమానయానంలో జరిగిన ప్రమాదాల వల్ల గాయపడుతున్నవారి సంఖ్య వందల్లోనే ఉంటున్నప్పటికీ ఆందోళనకలిగించే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయన్నది ఓ హెచ్చరిక. ప్రయాణికులతో వెళ్లే విమానాల కనీస వేగం గంటకు 550 మైళ్లు ఉంటోంది. అయితే సిఎటిని గుర్తించగలిగే సాంకేతిక వ్యవస్థపై ఈమధ్య బోయింగ్ సంస్థ పరిశీలనలు చేసింది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో సిఎటిని కేవలం ఒక్క నిమిషం ముందు మాత్రమే గుర్తించే వీలుంది. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ఈ అధ్యయనంలోని అంశాలు ప్రచురితమయ్యాయి.

- రవళి