సబ్ ఫీచర్

సహకార రంగం బలోఫేతానికి సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహకార చట్టానికి కోతలు విధిస్తున్నారని, సహకార సంఘాల లావాదేవీలను, బ్యాంకుల కార్యకలాపాలను రిజర్వు బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేయబోతున్నదని ప్రచారం జరిగింది. అయితే సహకార రంగం ద్వారానే రైతులను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్ 21న ఢిల్లీలో విజ్ఞాన భవన్‌లో జరిగిన సహకార సమ్మేళనంలో ప్రధాని నరేంద్రమోదీ సహకార రంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సహకార ఉద్యమ నాయకులు, మహారాష్టక్రు చెందిన ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపక సభ్యుడు అయిన లక్ష్మణ్ మాధవరావు ఇనాందార్ శతజయంతి సందర్భంగా ఈ సహకార సమ్మేళనం కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహకార భారతి, నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో మోదీకి లక్ష్మణ్ గురువుగా ఉండేవారు. ఆ విషయాన్ని ప్రధాని స్వయంగా గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోపరేటివ్ సొసైటీల తరపున అతి ముఖ్యమైనవాటిని ఎంపిక చేసి ప్రతినిధులను ఈ సమ్మేళనానికి ఆహ్వానించారు. ఇందులో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కూడా ఉంది. ఆ సంస్థ తరపున నేను ఈ సమ్మేళనంలో పాల్గొన్నాను. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా సహకార రంగాన్ని విస్తరించాలన్నది ప్రధాని ధ్యేయం. 1979లో ముంబైలో సహకార భారతి పేరుతో సహకార ఉద్యమాన్ని లక్ష్మణ్ నిర్వహించారు. దేశంలోని 29వేల సహకార సంఘాలను ఆదుకుంటామని ఈ సమ్మేళనానికి హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ ప్రకటించడం ఎంతో ఆనందం కలిగించింది. సహకార రంగంపై అధ్యయనానికి, ఉద్యోగులకు శిక్షణ కోసం వచ్చే జనవరి 12న లక్ష్మణరావు ఇనాందార్ సహకార అధ్యయనం, మానవ వనరుల కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. బ్రిటిష్ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రాని రోజుల్లోనే సహకార వ్యవస్థ (1905) మొదలైంది. స్వాతంత్య్రం అనంతరం సహకార రంగంలోకి వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రవేశించాయి. ప్రస్తుతం సహకార రంగాన్ని బలోపేతం చేయాలని మోదీ సంకల్పించడం సరికొత్త ఆశలకు జీవం పోసింది. మారుమూల ప్రాంతాలలోని అతి చిన్న రైతుకు సైతం నేడు రుణం అందడానికి సహకార వ్యవస్థ కారణం. సంధి దశలో ఉన్న వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సంకల్పం ధైర్యాన్ని ఇస్తుంది. వేపపూత ఉన్న యూరియాకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వేపనూనె తయారీలో మహిళలను ప్రోత్సహించాలని సమ్మేళనం తీర్మానించింది. తీపి విప్లవాన్ని తీసుకొచ్చే తేనెటీగల పెంపకాన్ని కూడా సహకార రంగంలో చేర్చాలని కోరారు. ఈ నేపథ్యంలో రైతులు సేంద్రియ ఎరువులమీద ఎక్కువగా దృష్టి సారించి సహజసిద్ధమైన పంటలతో అధిక ఉత్పత్తితో ముందుకు సాగవలసి ఉంటుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు