సబ్ ఫీచర్

దీపాల ఇంట సిరుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ రోజున మహాలక్ష్మీ పూజలు నిర్వహించుకోవడానికి ఒక పురాతన కథ వుంది. దుర్వాస మహర్షి ఒక రోజు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహమన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడట. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుందట. ఈ సంఘటనను చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడట. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని వేడుకుంటాడట. పరిస్థితిని గమనించిన మహావిష్ణువు దేవేంద్రునికి, ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి రూపంగా తలచి పూజించాలని సూచిస్తాడట.
దేవేంద్రుడి ప్రార్థనకు మెచ్చి మహాలక్ష్మి తిరిగి సర్వసపందలు త్రిలోకాధిపత్యాన్ని ప్రసాదిస్తుందట. ఆ సమయంలో తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే వుండటం న్యాయమా అని, నీ భక్తులను కరుణించివా అని ఇంద్రుడు ప్రశ్నిస్తాడట. దీనికి లక్ష్మీదేవి సమాధానమిస్తూ, నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంలో దర్శనమిస్తానని, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు తనని ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వరాలు ఇస్తానని తెలియజేసిందట. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. లక్ష్మి సాత్వికతకు, సమృద్ధికి సంకేతం. దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారద్రోలి తన కిరణాలతో జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆవేళ సర్వశుభాలు, సంపదలు, ప్రసాదించే లక్ష్మిదేవిని పూజించే ఆచారం అనాదిగా వస్తుంది. ఎందుకంటే దీపావళి నాడు నూనెలో (ముఖ్యంగా నువ్వుల నూనె) లక్ష్మిదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మరూపంగా నిండి ఉంటారు. పగలు నిద్రపోయేవారింట, ఇరు సంధ్యలో నిదురించే వారిపై ఆమెకు దయ కలుగదు. గడపను కాలితో తొక్కినా, దానిపై నిలబడినా ఆమె సహించదు. శంభాలు, దర్భలు, కర్పూరం, పట్టువస్త్రాలు, పువ్వులు నేలమీదపడితే ఆమె సహించలేదు. దారిద్య్ర నాశనం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం శ్రీసూక్తంలోని ‘‘హిరణ్య వర్ణం హరిణీం, సువర్ణ రజిత స్రజామ్, చంద్రాం హిరణ్మరుూం, లక్ష్మీం జాతవేదో మమావహ’’2 అనే శ్లోకం పఠించాలని పెద్దలు చెబుతారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు విన్పించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్ర వైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద మంగళకర వస్తువులు ఉండే ఇండ్లలో వేద ఘోష వినిపించే ప్రదేశాల్లో స్ర్తి సుఖ సంతోషాలతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుడినీ, తులసిని పూజించే చోట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి. దీపావళి పర్వదినం ఆర్థిక సంవత్సరానికి ఆరంభ సూచకంగా భావించి వ్యాపారులు నూతన పుస్తకాల్లో లెక్కలు రాసి, లక్ష్మీ కటాక్షంరావాలని కోరుకుంటారు. ‘‘అజ్ఞాన తిమిరంహంతుం, శుద్ధజ్ఞాన ప్రకాశికా, సర్వైశ్వర్యా ప్రదాతేస్తు తృత్కళాయం నిధీయతే’’2 అన్నట్లు ఈ రోజు దీపాల వరుసలు వెలిగించి, కాంతి రూపంలో లక్ష్మీదేవి మన గృహలలో నిలిచి శుభాలు చేకూరుస్తుందని అందరి నమ్మకం. ఈ రోజు బాణసంచా కాల్చడంవల్ల వాటి వెలుగులో శబ్ద తరంగాల్లో దారిద్య్ర దుఃఖాలు తరిమివేయబడి లక్షీ కటాక్షం వస్తుందని పెద్దలు చెబుతారు.
దీపాగ్రే వర్తతే లక్ష్మీః దీప మధ్యేచ పార్వతీః
దీపాంతే శారదా ప్రోక్తః దీపం శక్తిమయం విదుః
దీపం అగ్రభాగం లక్ష్మి, మధ్యభాగం, దీపం కింది భాగాన సరస్వతీ ఉంటుందని, దీపం త్రిశక్తిమయం అని అర్థం. దీపం అంటేనే లక్ష్మీదేవి చిరునవ్వులు. దీపాలతో ఏ ఇల్లు కళకళాడుతుందో ఆ ఇంట సిరులపంట పండుతుంది. దీపాన్ని వెలిగించి పూజిస్తే త్రిశక్తులతో పాటు త్రిమూర్తులను కూడా పూజించినట్టేనన్నారు పెద్దలు.

-కె.రామ్మోహన్‌రావు