సబ్ ఫీచర్

ఐరాస.. సాఫల్య వైఫల్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థయే ఐక్యరాజ్యసమితి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. ప్రస్తుతం 193 దేశాలు సమితిలో సభ్య దేశాలుగా వున్నాయి. ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబర్ 24న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చూడడం దీని ప్రధానోద్దేశ్యం. అంతేకాక అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందింపచేయడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేట్టు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం ఐక్యరాజ్యసమితి ప్రధాన ఆశయాలు. అయితే ఆ లక్ష్యాలను సాధించడంలో బాగా వెనకబడి వుంది. కొరియాల మధ్య యుద్ధాన్ని నివారించడంలో కూడా సమితి విఫలమైందని పరిశీలకుల అభిప్రాయం. ఆరవసారి ఉత్తరకొరియా అణుపరీక్షలు నిర్వహించడాన్ని భారత్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది. హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన విషయం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేసింది.
ఉగ్రవాద దాడులు జరుగుతున్నా ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేక పోతోంది. దాంతో ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ దేశాల కార్యాచరణపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి అవసరం ఔచిత్యం ఇప్పటికీ వుందనే చెప్పాలి. ప్రపంచంలో ఇప్పటికీ అణుముప్పు పొంచి ఉంది. ఆఫ్రికాలో తెగలు, మత, ప్రాంతీయ విభేదాలు కొనసాగుతునే వున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాల్సి వుంది. మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలి. భారతదేశం ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రంలో పొందుపరిచిన సూత్రాలను పూర్తి నిబద్ధత ప్రకటించి వాటి అమలుకు హృదయపూర్వకంగా సహకారాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నియమించిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు భారతదేశం క్రియాశీల పాత్ర పోషిస్తోంది. 2010 నుండి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. పశ్చిమాసియాలో పరిస్థితి అగ్నిగుండంగా మారటానికి ఇజ్రాయిల్ విధానాలే కారణాలు. వివిధ దేశాలమధ్య శాంతి సామరస్య సాధనకు సమితి విభాగాలు కృషి చేస్తున్నా వాటివల్ల పెద్దగ ప్రయోజనం ఒనగూరలేదు. అలాగే సమితి ఆధ్వర్యంలో వివిధ దేశాలకు పంపబడుతున్న శాంతి దళాలవల్ల కూడా ఆయా ప్రాంతాల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదు. ఐక్యరాజ్యసమితి కొత్త సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గుటిర్రెస్ నియమితులయ్యారు. ఈయన 9వ ప్రధాన కార్యదర్శి. ఇంతవరకు పనిచేసిన వారిలో ట్రిగ్వేలీ, హోమర్ ఫీల్డ్, యుధాంట్, కర్ట్ వాల్దీమ్, జేవియర్ పెరేజ్ డిక్యులర్, బేక్రోస్‌ఘలీ, కోఫి అన్నన్, బాన్‌కీమూన్ ముఖ్యులు. 2017ను ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజమ్ ఫర్ డెవలప్‌మెంట్‌గా ప్రకటించింది. ఈ విధంగా ఐక్యరాజ్యసమితి చేపట్టే కార్యక్రమాలకు సభ్య దేశాలు సహకరిస్తే ప్రపంచశాంతి నెలకొంటుంది.

-కె.రామ్మోహన్‌రావు