సబ్ ఫీచర్

సాంస్కృతిక ఐక్యతే భారత్‌కు పునాది ( నేడు అంబేద్కర్ జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మించేనాటికి భారత్‌పై ఆంగ్లేయ ప్రభుత్వపు ఉక్కుపిడికిలి బిగించి ఉంది. భారతీయ మేధావులపై ఆంగ్లేయ చరిత్రకారుల ఆలోచనా ప్రభావం కమ్ముకుంది. భారతదేశం ఒక దేశం కాదని అనేక జాతుల సమూహమని, ఒక ఉపఖండం అని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఆంగ్లేయ పరిపాలన కారణంగా ‘‘్భరత్ ఒక నూతనంగా ఏర్పడుతున్న దేశం’’ అని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం గమనార్హం. భారతదేశంలో ఒక సంస్కృతి లేదని, అనేక సంస్కృతులతో కూడిన ‘‘ఒక మిశ్రమ సంస్కృతి ’’ మాత్రమే అక్కడ ఉన్నద ని ఆంగ్లేయ చరిత్రకారులు పేర్కొన్నారు. క్రైస్తవ మత ప్రచారకుడు కాల్ద్వెల్ ‘‘ఆర్య-ద్రావిడ’’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ దేశంలో ద్రావిడులు మూలవాసులని, ఆర్యులు విదేశాలనుంచి ఈ దేశంపై దాడి చేశారని ఆర్య-ద్రావిడ యుద్ధాలలో ఉత్తరాన ఆర్యులున్నారని, దక్షిణాది ప్రజలందరూ ద్రావిడులని, ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అగాధాన్ని సృష్టించడం కోసం ఆంగ్లేయ చరిత్రకారులు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు ఏమిటో పరిశీలిద్దాం.
డాక్టర్ అంబేద్కర్ విద్యార్జనకై కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లి 1917లో ‘‘్భరతదేశం లో కులాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు- వ్యాప్తి’’ అన్న అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించా రు. ఆ పత్రంలో, ‘‘వివిధ తెగలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవిస్తున్నప్పటికీ వీరందరికి ఉమ్మడిగా ఉన్న ఒకే సంస్కృతితో జీవిస్తున్నారు. ఈ సాంస్కృతిక ఏకత్వమే దేశ ప్రజల మధ్య సమైక్యతకు ఆధారం అవుతున్నది. ప్రపంచంలో ఏ దేశంలోను లేని ఒకే సంస్కృతి భారత్‌లో కనబడుతుంది. ఈ సాంస్కృతిక ఐక్యతే భారతదేశానికి మూలాధారమైంది,’’ అని పేర్కొంటూ భారత్‌లో మొదట్లో ఒక కులం మాత్రమే ఉండేదని, నేడు కులవ్యవస్థ సాంస్కృతిక అఖండత్వాన్ని ముక్కలు చేస్తున్నదని పేర్కొన్నారు. నేసల్ ఇండెక్స్ ద్వారా భారతదేశంలోని అన్ని కులాల వారి మూలాలు ఒకటేనని వారు నిరూపించారు. ఇదే విషయాన్ని జీన్స్ విశే్లషణ ద్వారా భారతదేశంలోని వివిద కులాల తెగల మూలాలు ఒకటేనని నిరూపించబడింది.
‘‘శూద్రులు ఎవరు?’’ అన్న గ్రంథంలో ‘‘వేదాలలో 31 సార్లు ఆర్య శబ్దం వినియోగించబడింది. ఎక్కడా ఆర్య శబ్దాన్ని జాతివాచకంగా ఉపయోగించలేదు. ఆర్యజాతి అనే కల్పనను వేదాలు ఎరగవు. ఆర్యజాతి భారతదేశంపై దండెత్తి వచ్చిందని, ఇక్కడి దేశస్థులైన దాసులు, దస్యులను ఓడించిందని చెప్పడానికి వేదాలలో ఆధారాలు లేవు. ఆర్యులకు, దాసులకు, దస్యులకు ఉండే భేదం జాతిపరమైన భేదం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దాసులు, దస్యుల రంగుకు ఆర్యుల రంగుకు తేడా ఉండేదని వేదాలు చెప్పడంలేదు. ఆర్య-ద్రావిడ సిద్ధాంతం ఋజువులు లేని సిద్ధాంతమని, ఆంగ్లేయ చరిత్రకారులు కల్పించిన అభూత కల్పన’’ అని వారు స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రథమ ప్రపంచ సంగ్రామం తర్వాత టర్కీలో ఆనాడు ఉన్న ముస్లీం ప్రపంచ పెద్ద (ఖలీఫా) వ్యవస్థను ఆంగ్లేయులు రద్దు చేశారు. అంతవరకు ప్రపంచలోని ముస్లింలందరికి మతపరంగా, రాజకీయంగా ఆయనే తిరుగులేని నాయకుడు. టర్కీలో గల కేమల్‌పాషా వంటి అభ్యుదయ భావాలు కలిగిన ముస్లిం నాయకులు ఈ వ్యవస్థ రద్దును సమర్థించారు. ప్రపంచలోని వివిధ దేశాల్లోని ముస్లిం నాయకులు టర్కీలోని ఖలీఫా వ్యవస్థ రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. 1920లో జరిగిన ఈ ఉద్యమాలనే ఖిలాఫత్ ఉద్యమంగా చరిత్రలో పేర్కొంటారు. బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని ఎదిరించలేని ఖిలాఫత్ ఉద్యమ నాయకులు, ఖలీఫా వ్యవస్థతో ఏమాత్రం సంబం ధం లేని అమాయక హిందువులపై కేరళలోని మలబారు జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేశారు. వేల సంఖ్యలో హిందువులు మరణించారు. హిం దూ స్ర్తిలు అవమానాలకు గురయ్యారు. ఆనాటి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి టంగుటూరి ప్రకాశం పంతులు మలబారు ప్రాంతంలో పర్యటించి అక్కడ జరిగిన దుర్ఘటనలపై నివేదిక ఇస్తూ, ‘‘గాంధీజీ మలబారు దుర్ఘటనలను తక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు’’ (ఆత్మచరిత్ర)
స్వాతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, ఖిలాఫత్ ఉద్యమం ప్రధానమైనదికాగా స్వరాజ్య సాధన తరువాయి అంశమైంది. మెప్లా తిరుగుబాటు సందర్భంగా కేరళలోని మలబారు జిల్లాలోని హిందువులపై రక్తాన్ని మరిగించే కిరాతక సంఘటనలు జరిగాయి. ఈ దుర్ఘటనలకు ముస్లిం లే బాధ్యులని గాంధీజీ పేర్కొనకపోవడాన్ని, డాక్టర్ అంబేద్కర్ విమర్శించారు (వాల్యూం 8, పుట 157, 158).
మొట్టమొదటి సారిగా 1890లో శ్రీ దాదాబాయి నౌరోజీ ఆంగ్లేయ పరిపాలనా కాలంలో భారతదేశం ఆర్థికంగా ఎలా దొపిడీ చేయబడిందీ సోదాహరణ పూర్వకంగా వివరించారు. ఇదే మార్గంలో బాబాసాహెబ్ ఆర్థిక రచనలు కొనసాగాయి. బాబాసాహెమ్ గొప్ప ఆర్థికశాస్తవ్రేత్త. భారతదేశ సమస్యలను అధ్యయనం చేసి తెలియజెప్పడానకి ఆయన యత్నించారు. రూపాయి సమస్య (-్యఇళౄ యచి గఖఔళళ), ప్రాచీన భారతీయ వాణిజ్యం (శషజళశఆ నిశజూజ్ఘశ ళ్యౄౄళూషళ), బ్రిటిష్ ఇండియాలో సామ్రాజ్యపు రాబడి యొక్క ప్రాంతీయ వికేంద్రీకరణ (ఔ్య్పజశషజ్ఘ జశ్ఘశషళ నిౄఔళూజ్ఘ నిశష్యౄళ జశ ఱజూఆజఒ్ద నిశజజూజ్ఘ) మొదలైన గ్రంథాల ద్వారా, భారతదేశంలో వ్యవసాయాన్ని గురించి వ్రాసిన అనేక వ్యాసాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఆయన అధ్యయనం దళితుల సమస్యలకే పరిమితం కాలేదు. ప్రాచీన భారతీయ వాణిజ్యము (శషజళశఆ నిశజూజ్ఘశ ళ్యౄౄళూషళ) అనే గ్రంథంలో ప్రాచన కాలం నాటి భారతదేశాన్ని వర్ణిస్తూ వారిలా అంటారు. ‘‘్భరతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. భారత వ్యవసాయానికి వెనె్నముక ఆవు. గోపూజ వెనకాల ఆర్థిక దృక్పథం ఉంది. హిందువులకు ఆవుపట్ల గల భక్తిని విదేశస్థులు ప్రత్యేకంగా విదేశీ క్రైస్తవ మిషనరీలు ఒక చేదు గుళికగా భావించారు. మాంసం కోసం ఆవును చంపితే వ్యవసాయాభివృద్ధికి ఎంతో కష్టం కలుగుతుంది.’’
1920 నుండి అంబేద్కర్ తనువు చాలించే వరకు భారతదేశంలో, ప్రపంచంలో మార్క్సిజపు అనుకూల గాలులు బలంగా వీస్తున్నాయి. ఆ సమయంలో 1956లో తన జీవితపు చరమాంకంలో పై అంశంపై అంబేద్కర్ రెండు విశే్లషణాత్మక ప్రసంగాలు చేశారు. మార్క్సిస్టు పరిపాలనవల్ల రష్యా లో, చైనాలో ప్రజల కనీస అవసరాలు తీర్చబడుతున్నాయి. దీనిని నేను సమర్థిస్తున్నాను. కాని కమ్యూనిస్టు వ్యవస్థలో మనిషి మానసిక, బౌద్ధిక అవసరాలు తీర్చబడే వ్యవస్థ లేదు. రాజకీయ ఒత్తిడి ద్వారా వచ్చిన అభివృద్ధి ఎక్కువకాలం నిలబడదు. బౌద్ధ ధర్మంలో శారీరక, మానసిక, బౌద్ధిక వికాసానికి అవకాశముంది.స్వచ్ఛందంగా రాజకీయ ఒత్తిడి లేకుండా పనిచేసే అవకాశం కల్పించబడింది. ఇలా అనేక రకాలుగా చూస్తే మార్క్సిజం కంటే బౌద్ధ ధర్మం తద్వారా ఏర్పడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఎంతో మెరుగైనవి అని-డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఈ ఏడాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయింతి ఉత్సవాలను దేశం మొత్తం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ విషయాలపై వారి ఆలోచనలు అధ్యయనం చేద్దాం.

- కె. శ్యాం ప్రసాద్ కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక