సబ్ ఫీచర్

పారిపోయిన రైలు ఇంజన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టంట్ సినిమాల్లో చూస్తూ వుంటాం రైలు బండ్లు వాటంతట అవే పరుగులు తీస్తూ వుండగా, హీరో విలన్లు బ్రహ్మాండంగా తన్నుకు చస్తూ వుంటారు కాని అది స్టంటు. కాని పోయిన బుధవారం మహారాష్టల్రోని ‘వాడి’ ప్లాట్‌ఫారంమీద జరిగిన ఈ చిత్రం వార్త. నాలుగవ నంబరు ప్లాట్‌ఫారంమీద నిలిపి వేయబడి వున్న విద్యుత్ రైలు ఇంజను ఉన్నట్లుండి కదిలి పారిపోడం మొదలెట్టింది. ఏ దెయ్యమో పట్టి దాన్ని ఈడ్చుకుపోతోంది అన్నట్లు జనం హడిలిపోయారు. చెన్నై నుంచి ముంబాయి పోయే చెన్నై-ముంబాయి మెయిలు టైముకే వచ్చింది మధ్యాహ్నం మూడు గంటలకి- అక్కణ్నుంచి ముంబాయిదాకా ఎలక్ట్రిక్ ట్రాక్ లేదు. అంచేత విద్యుత్ ఇంజన్ని తీసేసి డీజిల్ ఇంజన్‌ని తగిలించారు. అంతలో విడిగా వున్న ఎలక్ట్రిక్ ఇంజను దాని డ్రైవరు దిగి అలా పోంగానే కూత పెట్టి మరీ తప్పించుకుపోయిన లేడిపిల్లలాగా పరుగు లంకించుకున్నది. జనం గగ్గోలు- స్టేషన్ మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. డ్యూటీ దిగిపోతున్న డ్రైవర్ షాక్ నుంచి తేరుకుని ఓ మోటారు బైకు ఎక్కి దానివెంట పడ్డాడు. అతనితోపాటే స్టేషను మాస్టారు కూడా బండి నేను తోలుతా నువ్వు బ్యాక్ సీటెక్కు అంటూ- వేటగాడు వెంటపడ్డట్లు ఇంజన్ వెంట పడ్డారు. వీళ్ళు రోడ్డుమీద- అది పట్టాలమీద ముప్ఫై కిలోమీటర్ల వేగంతో ఛేజింగ్ మొదలైంది. ముందు స్టేషన్‌లకి ఆర్తనాదాలు పంపించారు. లైన్ క్లియర్ ఇవ్వండి బాబోయ్ అని. ఎక్కడి రైళ్ళను అక్కడే ఆపెయ్యండి అంటూ- అయితే ముందు స్టేషన్ ఔటర్ దగ్గరకి వచ్చేవేళకి కొంచెం స్పీడు తగ్గించింది పారిపోతున్న తుంటరి ఇంజను. దాని డ్రైవరు దాని సైడు కడ్డీ అందుకుని కొంత దూరం వ్రేలాడి ఎట్టకేలకు లోపలకి లంఘించాడు. మరో పెద్ద రైలు ఎదురుగ్గా రాబోతూ ముందు స్టేషన్‌లో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆగింది కనుక జననష్టం ఆస్తి నష్టం తప్పేయి. అతడు తంటాలు పడి ఇంజాసుర్ను ఆపగలిగాడు. అంతా ఇంజన్‌తో సహా ఉస్సురంటూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవరు హీరో అయిపోయాడు. కాని విలన్ ఎవరు? సదరు ఇంజనాసురుడు ఏలా పారిపోదలచాడు అన్నది జవాబు రాని ప్రశ్న! కమిటీ వేస్తున్నారులెండి. అయితే ఇంజన్‌ని పట్టుకున్న డ్రైవర్‌కి మాత్రం రివార్డు ఇవ్వాల్సిందేనంటున్నారు స్టేషన్ సిబ్బంది.