సబ్ ఫీచర్

మహిళల పట్ల ఇంకా అదే మైండ్ సెట్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం వెంట నడిచే మనిషి తన జీవన విధానంలోను, ఆలోచనా విధానంలోను , భావజాలంలోనూ, అభిప్రాయాలలోనూ కాలానుగుణ మార్పులు, సరికొత్త చేర్పులూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ ఉంటాడు. కానీ కొంతమంది అలా కాదు..ఎన్నో ఏళ్ల క్రితం అప్పటి సమాజంలో వున్న బూజుపట్టిన పాత పద్ధతులను, ఆచారాలను, అభిప్రాయాలనే పట్టుకుని వేలాడుతూ వాటినే ఆచరిస్తూ నూతిలో కప్పల్లా అదే ప్రపంచం అనుకుంటుంటారు. విశాల విశ్వంలోకి అడుగుపెట్టి కాలం ఎంత ముందుకు పోయిందో..మనుషులు ఎంత కొత్తగా, వైవిధ్యం, విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా మహిళల విషయంలో అలాంటి వాళ్ల ఆలోచనా ధోరణి ఇప్పటికీ సంకుచితమే!

కొన్ని దశాబ్దాల కిందటి గత సమాజం పురుషాధిక్య సమాజం..పితృస్వామ్య వ్యవస్థ కలిగినటువంటిది. స్ర్తికి చదువు, తెలివితేటలు అవసరం లేదని...వంటింటికి, పడకింటికి తప్ప సమాజానికి ఏవిధంగానూ ఆమె అవసరం లేదని చాలామంది అభిప్రాయపడేవారు. పనిమనిషి...్భగవస్తువు అంతే ఆమె పరిధి. అదే కాదు..ఆడది అంటే శారీరకంగా బలహీనురాలని, అబల అనీ. కొన్ని పనులను ఆమె చెయ్యలేదని అనుకునేవారు. మహిళల గురించి అందరూ అలాంటి అభిప్రాయాలను, ఉద్దేశాలనే మైండ్‌లో ఫిక్స్‌చేసుకుని వాటిని ఇప్పటివరకు అలాగే స్థిరపడి పోయేలా చేసారు.
అంతేకాదు-పురుషాధిక్య సమాజంనుంచి, సంప్రదాయపు సంకెళ్లనుంచి, ఆత్మన్యూనతా భావంనుంచి, బయటపడి తమ ఉనికిని ఘనంగా చాటుకుంటూ స్ర్తి పురుష సమానత్వం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ల ఆలోచనలు, అభిఫ్రాయాలు అభిరుచులు మారిపోయాయి. మీసం మెలేసే, తొడగొట్టే మగవాళ్లను చూసి ‘ఏంటి మీ గొప్ప?’ అని అడుగుతున్నారు. ప్రేమ పేరిట ‘కన్నుగొట్టే మగాడ్ని’...‘పోకిరీ’ అని చీదరించుకుంటున్నారు. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి..అత్యాచార ప్రయత్నం చేయబోయిన మృగాళ్లను అక్కడికక్కడే బుద్ధి చెప్పడం...పోలీసు కంప్లయింట్ ఇవ్వడం వంటివి ధైర్యంగా చేస్తున్నారు. తమమీద జరిగే అకృత్యాలకు, దాడులకు అత్యాచారాలకు వున్న చట్టాలు సరిపోవనుకున్నప్పుడు ‘నిర్భయ’ లాంటి కొత్త చట్టాలను కూడా తెచ్చి కటకటాలలోకి తోయించగలం అని రేపిస్టులను హెచ్చరించడమే కాక దొరికిన కేసును దొరికినట్టు కోర్టు బోనులో ఎక్కిస్తున్నారు.
ఏది ఏమైనా స్ర్తిలపట్ల పురుషుల్లోనూ, స్వయంగా సాటి స్ర్తిలలోను స్థిరపడిపోయిన పురాతన సంకుచిత భావజాలం తొలగిపోయి సరికొత్త ఆదర్శ భావాలు, విశాల దృక్పథం ఏర్పడాలంటే చట్టం, పోలీసులు, జైళ్లు వీటికన్నా ముందు ముఖ్యంగా మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి. అందరి ప్రవర్తనలో మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ల కొడుకుకు స్వేచ్ఛనిచ్చి ఎలా పెంచుతున్నారో కూతుర్నీ అలాగే తన ఇష్టానికి అనుగుణంగా పెంచాలి. మగపిల్లలకు కౌమార దశనుంచే ఆడవాళ్లను గౌరవించడం..ఆడపిల్లల పట్ల స్నేహ భావంతో మెలుగుతూ వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తూ వుండడం వంటివి నేర్పాలి. అలా చేయగలిగితే పిల్లలు మంచి భావాలతో, విశాల దృక్పథంతో, మానవత్వపు విలువల ఎరుకతో మంచి మైండ్‌సెట్‌ని అలవరుచుకుంటూ మానసిక ఆరోగ్యంతో ఎదుగుతారు.
అయినప్పటికీ ఎదిగీ ఎదగని అపరిపక్వ మనసుతో, వయసు తొందరలో పిల్లలు ఏ తప్పు చేయకుండా వాళ్లమీద ఒక కనే్నసి వుంచాలి. మిగతా పిల్లలు చెడ్డవాళ్లయితే కావచ్చు నాకొడుకు మాత్రం బంగారం అని ఎక్కువ సమయం బయట గడిపే మగపిల్లల మీద గుడ్డిన మ్మకం పెట్టుకోకుండా వాడి ప్రతి కదలికను గమనిస్తూ చిన్న తప్పు చేసినా హెచ్చరిస్తూ మరోసారి పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్తపడాలి. ఆడపిల్లలు సైతం పురుషాధిక్యత మీద కోపంతో, కాలంమీద కసితో, సెల్ఫ్ పిటీతో అతిగా ప్రవర్తిస్తూ హద్దులు మీరినస్వేచ్ఛతో తల్లిదండ్రులకు, ఈ సమాజానికి తలనొప్పిగా మారి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టకుండా అవగాహనతో, పరిపక్వతతో మెలగాలి. స్ర్తి పురుషులకు వేరువేరుగా వుండే శారీరక ధర్మాలను, ప్రకృతి సిద్ధ చర్యలను గౌరవిస్తూ కుటుంబ వ్యవస్థకు, మానవ సంబంధాలకు మచ్చరాకుండా మసులుకోవాలి. స్ర్తివాదంపేరిట విపరీత భావజాలానికి, అర్ధం పర్ధంలేని మొండి వాదనలకు లోనుకాకుండా మంచి అవగాహనతో, పరస్పర గౌరవంతో వుండగలిగితే జీవితం ఒక ఆహ్లాదకరమైన ఆటలా, అందమైన పాటలా, హాయిగా సాగిపోయి అసలు సమస్యలు అనేవే రావు. సమాజం కూడా సుఖ శాంతులతో ముందుకు సాగిపోతూ అభివృద్ధి పథంలో వడివడిగా అడుగులు వేస్తుంది.

ఇప్పుడు మహిళలు ఆధునిక కాలాన్ని అనుసరిస్తూ చాలా మారిపోయారు. ఎదుగుతున్న సమాజంలో అందివచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుంటూ ‘అది...ఇది’ అని అన్ని రంగాల్లో ప్రవేశాన్ని, ప్రావీణ్యాన్ని సంపాదించి తమకు సాధ్యం కానిదంటూ ఏదీలేదని అంతరిక్షం సాక్షిగా నిరూపిస్తున్నారు. కుస్తీ, కరాటే వంటి సాహసాలే కాక ఇప్పుడిప్పుడు వీర వనితలై యుద్ధ భూమిలో సైనిక విధులను కూడా నిర్వర్తిస్తున్నారు.

-కొఠారి వాణీచలపతిరావు