సబ్ ఫీచర్

సిల్క్ కాటన్ సరికొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్క్ కాటన్ చీరలో ఓ గ్లామర్ లుక్ కనిపిస్తోంది. పాతకాలపు ట్రెండ్ అయినప్పటికీ సరికొత్త డిజైన్లతో కట్టుకుంటే తేలికగా.. సున్నితంగా ఉంటుంది. అందుకే నేడు బాలీవుడ్ నటీమణులు, సామాజిక కార్యకర్తలు సైతం సింపుల్‌గా కనిపించే సిల్క్ కాటన్ చీరలనే ధరిస్తున్నారు. ఆరు గజాల చీర మీద ఆకట్టుకునే నైపుణ్యం ఇమిడి ఉండటంతో ఈ చీరలు వర్షాకాలానికే బాగుంటాయనే అపోహ ఉంది. కాని ఏ కాలంలోనైనా కట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. సిల్క్ కాట న్ చీరలు ఎక్కువగా డిజైన్లు లేకుండా ఉంటాయి. వీటిపై పనితనం చూ పించలేం కాబ ట్టి చక్కని రంగుల ను ఎం చుకుని అంతే సింపుల్‌గా బ్లౌజ్ ఉండేలా చూసుకుంటే చాలు. లేత ఆకుపచ్చ చీర మీద బంగారం రంగులో డిజైన్ చేసిన ఈ చీర పెద్ద అంచు లేకుండా సింపుల్‌గా కనిపిస్తోంది. పైట అంచు అంతా కూడా బంగారం రంగులోనే డిజైన్ చేశారు. లేత ఆకుపచ్చపై బంగారం రంగులో అంచు, కొంగూ తెచ్చిపెట్టే ఆకర్షణ అంతాఇంతా కాదు. పింక్ కలర్ ప్లెయిన్ చీరపై ఆకుపచ్చ రంగు అంచు వింత అందాన్ని అందిస్తోంది. మెరూన్ కలర్ చీరకు పెద్ద అంచు ఇచ్చి హుందాగా ఏ వేడుకకైనా కొత్త కళ తీసుకువస్తోంది. చీర అంచు ఎంత వెడల్పుగా ఉండే వేడుక అంత వైభవంగా మారుతోంది. ముదురు రంగులో ఈ చీరలు ఉన్నా ఎంచుకోవటం ముఖ్యం. చిన్న చిన్న పూలు పరుచుకున్న డిజైన్లు , పెద్ద అంచు వంటివన్నీ కూడా అందాల్ని రెంట్టింపు చేస్తాయి. హాయి గొలిపే రంగులు.. చిన్న, వెడల్పాటి అంచుల్లో జరీ చేసే జిలుగులు వేడుకలో ప్రత్యేకతను చాటడానికి సిద్ధం అంటున్నాయి.