సబ్ ఫీచర్

హార్దిక్ పటేల్ నిజాయితీ ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గం వారు సంపన్నుల కిందకి వస్తారు. వీరు పూర్వం భూమి పుత్రులు. ప్రస్తుతం రాజకీయ, విద్య, వైద్య, వ్యాపార రంగాలలో సముచిత స్థానం సంపాదించుకున్నారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్, వాణిబెన్ పటేల్, చుమన్‌భాయి, కేశూభాయి, ఆనంది బెన్ ఇలా పటేల్ కులస్థులే గుజరాత్ రాజకీయాల్లో అనాదిగా కీలక పాత్ర పోషిస్తు వచ్చారు.
ఇటీవల హార్దిక్ పటేల్ అనే యువకుడు పటేల్ కులస్థులకు రిజర్వేషన్ సౌకర్యం వర్తింప చేయాలని అంటూ ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. ‘‘సూరత్‌లో వజ్రాల వ్యాపారం చేసుకునే పటేళ్లకు రిజర్వేషన్ అవసరమా?’’ అని విమర్శకులు ప్రశ్నిస్తే ‘‘నిరోద్యుగులైన పటేళ్లు ఇదుగో చూడండి’’ అంటూ అతడొక ఊరేగింపు లేవదీశాడు. ఉద్యమం తీవ్రతరమై హింసకు దారి తీసింది. ఫలితంగా హార్దిక్ పటేల్‌పై కేసులు నమోదు చేసి కొర్టు ముందు ఉంచారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి భారతదేశాన్ని భ్రష్టుపట్టించిన మన ఏలినవారు రిజర్వేషన్ల విధానాన్ని అపభ్రంశంగా మార్చారు. కాశ్మీరులో ముస్లిములు మెజారిటీలో ఉన్నారు. ఐనా వారికి ‘‘మైనారిటీ’’ కోటా కింద రిజర్వేషన్ ఉంది. కంచ ఐలయ్య క్రైస్తవుడు. ఐనా బి.సి. అని చెప్పుకొని ఉస్మానియా యూనివర్శిటీలో రిజర్వేషన్ పొందాడు. సీమాంధ్రలో కాపులు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేసి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. తంగిరాల ఆంజనేయ శాస్ర్తీకి తినడానికి తిండిలేదు. ఆయన భార్య పెళ్లిళ్లల్లో వంటలు చేసుకుని బతుకీడుస్తున్నది. ఆయన కొడుకు వాచ్‌మన్. ఐనా తంగిరాల వారు అగ్ర కులస్థులు. ఇలా భారతదేశంలో ప్రజలు చట్టబద్ధంగా రాజ్యాంగం సాక్షిగా వంచింపబడ్డారు. కల్వకుంట్ల్ర చంద్రశేఖర రావు ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించాడు. అది రాజ్యాంగబద్ధం కాదని ఆయనకూ తెలుసు. సుప్రీంకోర్టులో కొట్టివేస్తారనీ తెలుసు. ఐనా ఎందుకు ప్రకటించినట్లు? ‘నా శక్తివంచన లేకుండా నేను పేద ముస్లిములను ఉద్ధరించాలని ప్రయత్నించాను. ఐనా కేంద్ర ప్రభుత్వము కోర్టులూ సహకరించడం లేదు’ అని ఓటర్లకు చెప్పుకోవచ్చు. నిజమేకదా? హైదరాబాద్ పాతబస్తీనిండా నిరుద్యోగులైన ముస్లిములు భారీసంఖ్యలో ఉన్నారు. వారు పొట్టకూటికోసం ఐసిస్‌లో చేరుతున్నారు. ఇదొక కఠోర సత్యం.
పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలా, వద్దా? అనే సమస్య అలా ఉంచితే ఇలా ఉద్యమాలు పేరుతో ఓట్లు నోట్లు దండుకొంటున్న ప్రబుద్ధుల మాటేమిటి? హార్దిక్ పటేల్ నవ యువకుడు. అతడు పటీదార్ ఉద్యమం పేరుతో ఇప్పటికే కోట్లు సంపాదించుకున్నాడు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. విజయరూపాని ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని బెదరిస్తున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యాంశం మనం గమనించాలి. గుజరాత్ మోడల్‌లో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ చెబుతున్నాడు. అంటే గుజరాత్ సర్వాంగ సుందరంగా సర్వతోముఖాభివృద్ధి చెందిందని ఆ మాటకు అర్థం. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలలో బిజెపి ఓడిపోతే దాని ప్రభావం మొత్తం భారతదేశం మీద పడుతుంది. అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కావలసింది గుజరాత్‌లో బిజెపిని ఓడించడం. అందుకు వారు హార్దిక్ పటేల్‌ను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. అందుకని బిజెపి తన అమ్ములపొదిలోని అన్ని తూణీరాలను ఉపయోగించుకుంటున్నది. జిఎస్‌టి శ్లాబ్‌ను తగ్గించింది. ఐటి డిఫాల్టర్ల పేర్లను అధికారికంగా వెల్లడించకుండ జాగ్రత్తపడింది. పనామా పారడైజు పత్రాలలో వెల్లడి అయిన పేర్లలో గుజరాతీలున్నారుకదా!! పెద్దనోట్ల రద్దు వలన చిన్న వ్యాపారులకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం నష్ట నివారణ చర్య (డామేజ్ కంట్రోల్) మొదలుపెట్టింది. ఐనా ఎన్నికలు భయపెడుతున్నాయి. ఇప్పుడేం చేయాలి?
ఇదుగో గుజరాత్ ఎన్నికల కథ ఇక్కడే మొదలయింది! హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ రాజకీయ లబ్ధి పొందుతుందని వ్యూహకర్తలు భరత్‌సింహ్ సోలంకి, అహ్మద్‌పటేల్ వంటివారు రాహుల్ బాబుకు హితవు పలికారు. అహమ్మదాబాదులోని ఒక హోటల్‌లో అమావాస్య అర్ధరాత్రి ఆదివారం నాడు రాహుల్‌బాబు హార్దిక్ పటేల్‌ను కలిశాడు. అప్పుడు హార్దిక్ పటేల్ తన డిమాండ్లను రాహుల్‌బాబు ముందు పెట్టాడు. మొదటిది పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం - రెండు తమ పాటీదార్ ఉద్యమ నిర్వహణ కోసం కొన్ని కోట్లు డబ్బు ఇవ్వడం - ఇందుకు రాహుల్ బాబు అంగీకరించాడా? ఏమోమరి. డబ్బు కావాలంటే ఓ పదివేల కోట్లు ఇవ్వగలడు. కానీ పటేల్ కులస్థులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషను ప్రకటిస్తే దాని పరిణామాలు దేశవ్యాప్తంగా చాలా సంచలనాలకు తెరతీస్తాయి. ఈ దశలో ఉన్నట్లుండి హార్దిక్ పటేల్‌మీద ఓ పిడుగు పడింది. అదే ‘వీడియో టేపుల విడుదల’. వీటిని విడుదల చేసింది ఆషామాషీ వ్యక్తికాదు. స్వయంగా పటీదార్ ఉద్యమ కీలక నాయకుడు అశ్వనీకుమార్ పటేల్. దీనిలో గుజరాత్ ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకూ ఈ టేపుల్లో ఏముంది?? గుజరాత్‌లోని ఒక హోటల్ రూంలో హార్దిక్ పటేల్ ఒక పటేల్ ఉద్యమ కార్యకర్తతో సరససల్లాపాలాడుతున్నాడు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని చేతిలో చెయ్యేసి హామీల వర్షం కురిపిస్తున్నాడు. మోజు తీరాక హార్దిక్ పటేల్ మరో అమ్మాయినీ ఇలాగే మోసగించాడు. ఈ ‘నీలి’ చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి. నేనేకాదు, కోట్లాదిమంది భారతీయులు వీటిని కొన్ని ఇంగ్లీషు ఛానల్స్‌లో చూశారు. ‘కథ ఇంతటితో ముగియలేదు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి’ అ అశ్వనీ పటేల్ చెబుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి.
1.గుజరాత్‌లో ఒక హోటల్ రూంలో రహస్య కెమెరాలు ఎవరు మార్చారు? ఈ పని హోటల్ యాజమాన్యం చేస్తున్నదా? లేక ఇంటెలిజెన్స్ విభాగం చేసిందా??
2.ఈ టేపులు ఎప్పటివి? 2015 నాటివి అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే 2017వరు వీటిని ఎందుకు బయటపెట్టలేదు??
3.అహమ్మదాబాదులో రాహుల్‌బాబు హార్దిక్ పటేల్-ల మధ్య రహస్య సమావేశం జరిగినప్పుడు అక్కడ ఉన్న ‘‘మూడవ’’ వ్యక్తి ఎవరు?
4.హార్దిక్ పటేల్ అవివాహితుడు. కాబట్టి వివాహేతర సంబంధం కిందికి రాదు-అని వాదిస్తున్నారు. నిజమే. కాని ఇలా పార్టీలోని మహిళా కార్యకర్తలను మోసగించడం నేరం కాదా? హార్దిక్ ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడా? అంటే అదీలేదు.
5. దేశంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అలాంటప్పుడు ఇతనిని తప్పు పట్టడం ఎన్నికల లబ్ధి కోసమే అని కొందరు వాదిస్తున్నారు. ఇక రాజకీయ నాయకుడు ప్రజాజీవనంలో మమేకమై సేవ చేస్తున్నప్పుడు అందరికళ్లూ అతడిమీదనే ఉంటాయి. అతని నుండి సమాజం క్రమశిణను ఆశిస్తుంది. ‘యద్యదాచరతి శ్రేష్టః’. ఈ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. దీని అర్ధం ఏమంటే నాయకుడు ఎలా చేస్తే కార్యకర్తలంతా అతడిని అనుసరిస్తారు. అంటే సౌజన్యానికి, సౌశీల్యానికి నాయకుడు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని అర్థం.
ఇది ఒక్క హార్దిక్ పటేల్‌కు మాత్రమే వర్తించదు. దేశంలోని అందరు రాజకీయ నాయకులకూ వర్తిస్తుంది. 1930 వ దశకంలో బ్రిటన్ మంత్రివర్గంలో ప్రొ ఫూమో అనే మంత్రి ఉండేవాడు. అతడు క్రిస్టిన్ కీలర్ అనే అమ్మాయిచేత వంచింపబడ్డాడు. ఫలితంగా ప్రోఫుమో రాజీనామా చేశాడు. తర్వాత మంత్రివర్గం పడిపోయింది. ‘ఈ ఇతివృత్తం’ ఈ తరంవారికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే బిల్ క్లింటన్ గూర్చి చాలా కథలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అధికార ప్రవక్త అభిషేక్ మను సంఘ్విని ఎందుకు ఆ పదవి నుంచి సోనియాగాంధీ తొలగించింది? సునందా పుష్కర్ హత్య కేసు మరీ ఆధునిక ఇతివృత్తమే. తనపై వచ్చిన ఆరోపణలు ‘ పెద్ద కుట్ర’ అంటూ హార్దిక్ పటేల్ ఓ టి.వి. ఇంటర్వ్యూలో చెప్పాడు. కాని అతని బాడీ లాంగ్వేజి గమనించినవారికి ఇదంతా సత్యమేనని తెలుస్తుంది. గుజరాత్ ఎన్నికలలో బిజెపి గెలుస్తుంది. హార్దిక్ పటేల్ జైలుకు పోతాడు. అంతటితో ఈ సమస్య పరిష్కారమవుతుందా? దేశంలో ఇంకా వందలాది మంది హార్దిక్‌లు ఉన్నారు. దొరికితే దొంగ - లేకుంటే ‘దొర’. ఆర్థికంగా, హార్థికంగా దేశాన్ని దోచుకుంటున్న ఈ రాజకీయ చెదరంగానికి ఎవడు ముగింపు పలుకగలడు?? 23 ఏళ్ల హార్దిక్ పటేల్‌లోబాటు అతడి స్నేహితులు కూడా మందుపొందు సాగిస్తున్నారని, పటీదార్ అనామత్ సంస్థలోని మహిళలు మానభంగాలకు గురి అవుతున్నారని అదే సంస్థకు చెందిన చిరాగ్ పటేల్ కేతన్ పటేల్ ఆరోపించారు. ఇదంతా ఎన్నికల రాజకీయం అని హార్దిక్ మద్దతుదారులు తేలికగా కొట్టిపారేస్తున్నారు. సందర్భ సాక్ష్యం (సర్కమస్టియల్ ఎవిడెన్సు) హార్దిక్ పటేల్‌కు వ్యతిరేకంగానే ఉంది.

ప్రొ. ముదిగొండ శివప్రసాద్